breaking news
Salman Khan fans
-
‘సల్మాన్’ అభిమానులపై పోలీసుల లాఠీఛార్జి.. వీడియో వైరల్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 57వ బర్త్ డే వేడుకలు ఆయన నివాసంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. బంద్రాలోని ఆయన నివాసం వద్దకు వందల మంది చేరుకున్నారు. బర్త్‌డే సందర్భంగా అభిమానులను పలకరించిన సల్మాన్ ఖాన్ వారి ఆశిస్సులు తీసుకున్నారు. అయితే, రోడ్డుపై భారీగా జనాలు గుమిగూడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సల్మాన్ ఖాన్ తన ఇంటిలోని బాల్కనీ నుంచి కనిపించిన సమయంలో ఆయన అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బాల్కనీలో నుంచి అభిమానులను పలకరించారు సల్మాన్. ఈ క్రమంలో పోలీసుల మాటసైతం లెక్కచేయకుండా రోడ్డుపైకి వచ్చేశారు అభిమానులు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. లాఠీఛార్జి మొదలు పెట్టడం వల్ల అక్కడి నుంచి కొద్ది క్షణాల్లోనే అంతా వెళ్లిపోయారని వెల్లడించారు. #SalmanKhanBirthday #Police#lathicharge #fans #waiting #Outside #SalmanKhan #House #Bandra @MumbaiPolice @DGPMaharashtra pic.twitter.com/dHHQBK4pR3 — Indrajeet chaubey (@indrajeet8080) December 27, 2022 सलमान के घर के बाहर बेकाबू हुई भीड़, पुलिस ने किया लाठीचार्ज#SalmanKhan #salmankhanfans #lathicharge #mumbaipolice #SalmanKhanBirthday #lathichargeonfans@BeingSalmanKhan @MumbaiPolice pic.twitter.com/farkLDSI0b — Topchand (@topchandnews) December 27, 2022 ఇదీ చదవండి: Salman Khan: మాజీ లవర్‌ను ముద్దాడిన సల్మాన్ ఖాన్.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ -
సల్మాన్ అభిమాని ఎంతపని చేసింది!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సల్మాన్‌కు అభిమానులు ఉన్నారు. అభిమానులు తమ హీరోల కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన. తాజాగా సల్మాన్ అభిమాని ఒకరు ఇంట్లో నుంచి పారిపోయి ముంబైలోని సల్మాన్ ఇంటిలోకి ప్రవేశించేందుకు యత్నించింది. పోలీసుల తెలిపిని వివరాల ప్రకారం.. భోపాల్‌కు చెందిన ఓ పదిహేనేళ్ల అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి ముంబైలోని బాంద్రాలో ఉండే సల్మాన్ ఇంటికి వచ్చి, లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించింది. సెక్యూరిటీ గార్డ్లు సల్మాన్‌ఖాన్ ఇంట్లో లేరని సర్దిచెప్పారు. కొంత సమయం గడిచిన తరువాత గోడ ఎక్కి లోపలకు వెళ్లేందుకు యత్నించిగా సెక్యూరిటీ గార్డులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలికను తీసుకొచ్చి స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు బాంద్రా పోలీస్‌స్టేషన్ సీనియర్ ఎస్సై పండిత్ థాకరే తెలిపారు. ఆమె తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌లోని బెరాసియాలో అదృశ్యం కేసు పెట్టారని, బాలిక ముంబైలో ఉన్నట్టు వారికి సమాచారం అందించినట్టు చెప్పారు. బాలికను డోంగ్రి బాలల గృహానికి తరలించామని, తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వారికి అప్పగిస్తామన్నారు. -
నేను ఆంటీ అయితే ఆయనేంటి?
ముంబై: సల్మాన్ ఖాన్ 'రేప్' వ్యాఖ్యలను తప్పుబట్టిన గాయని సోనా మహాపాత్రపై అతడి అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. సల్మాన్ ను 50 ఏళ్ల బాలుడిగా పోల్చడంపై ఫైర్ అయ్యారు. సల్మాన్ ఖాన్ 'రేప్' వ్యాఖ్యలపై స్పందిస్తూ...మహిళల గెంటివేత, హిట్ అండ్ రన్, వన్యప్రాణుల వేట కేసుల్లో నిందితుడిగా ఉన్న హీరోకు దేశంలో అభిమానించేవారు ఉండడం విడ్డూరమని సోనా పేర్కొన్నారు. సోనా చేసిన కామెంట్స్ పై సల్మాన్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడ్డారు. 'సల్మాన్ కేసుల గురించి మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది. భారత న్యాయవ్యవస్థలో నీవేమైనా భాగమా' అని పోస్ట్ పెట్టారు. ఆమెను తిడుతూ అసభ్య పదజాలంతో ట్వీట్లు పెట్టారు. తనపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వారికి సోనా దీటుగా సమాధానం ఇచ్చారు. 'సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించినందుకు నాకు ఫోన్ చేసి నన్ను 40 ఏళ్ల ఆంటీ అంటున్నారు. నేను ఆంటీ అయితే 50 ఏళ్ల సల్మాన్ బాలుడా? మీరంతా 50 ఏళ్ల బాలుడిని వెనకేసుకురావడం హాస్యాస్పదంగా ఉంద'ని ఆమె ట్విటర్ లో పోస్ట్ చేశారు. తాను చేసిన కామెంట్స్ సరైనవేనని సల్మాన్ ఖాన్ 'చెమ్చాలు' నిరూపించారని సోనా కౌంటర్ ఇచ్చారు. తన అభిమానులకు హితబోధ చేయాలని సల్మాన్ ఖాన్ కు సూచించారు. & now the 100's calling me a 40 year old aunty, slut, randi, to defend their 50 years old baby idol. Aah the irony! #India #PopularCulture — #SonaLIVE (@sonamohapatra) June 21, 2016 Dear Bhai Chamcha's, You continue to prove my point with every perverted, sick, cheap message you write to me. HaHa pic.twitter.com/9lZAcydfHs — #SonaLIVE (@sonamohapatra) June 21, 2016 -
సల్మాన్ తీర్పుపై ఎవరేమన్నారంటే...
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ ను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో విభిన్న స్పందన వ్యక్తమైంది. కోర్టు తీర్పును బాలీవుడ్ స్వాగతించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయాలని సీనియర్ లాయర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుపై ఎవరేమన్నారంటే... * హైకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత ఏవిధంగా ముందుకు వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ * చిత్రపరిశ్రమకు చెందిన నటిగా, స్నేహితురాలిగా సల్మాన్ ఖాన్ కు విముక్తి లభించడం నాకెంతో సంతోషం కలిగించింది. అతడికి దేవుడి ఆశీస్సులుంటాయి: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ * కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, న్యాయస్థానం ఆదేశాలను శిరసావహిస్తాం: బాబూలాల్ సుప్రియో * చాలా సంతోషంగా ఉన్నా, బాంబే హైకోర్టుకు అభినందనలు: ప్రముఖ రచయిత్రి శోభా డే * హైకోర్టును తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తుందని ఆశిస్తున్నా: సీనియర్ లాయర్ అభా సింగ్ * సల్మాన్ వ్యక్తిగత జీవితంపై హిట్ అండ్ రన్ కేసు ప్రభావం చూపింది. యువకుడిగా ఉన్నప్పుడే అతడు పెళ్లిచేసుకోవాల్సివుంది. అతడికి ఇప్పుడు 50 ఏళ్లు వచ్చాయి: దర్శకనిర్మాత సుభాష్ ఘాయ్ -
సల్మాన్ ఇంటివద్ద భద్రత పెంపు
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ ను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో ఆయన కుటుంబ సభ్యులు, బాలీవుడ్ తారలు, అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు విన్నవెంటనే సల్మాన్ ను ఆయన కుటుంబ సభ్యులు చుట్టుముట్టి ఆనంద భాష్పాలు రాల్చారని పీటీఐ వెల్లడించింది. తమ హీరో కేసు నుంచి బయటపడడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ ఆనందాన్ని పంచుకునేందుకు సల్మాన్ నివాసానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. పరస్పరం మిఠాయిలు పంచుకుని డాన్సులు చేశారు. దీంతో ముందుజాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు తీర్పు పట్ల సల్మాన్ తరపు న్యాయవాది అమిత్ దేశాయ్ సంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతో సల్మాన్ గొప్ప ఊరట లభించిందని, అతడు చాలా సంతోషంగా ఉన్నాడని తెలిపారు. త్వరలో అతడి పాస్ పోర్టును కూడా తిరిగి ఇచ్చేస్తారని చెప్పారు. సల్మాన్ ను నిర్దోషిగా కోర్టు ప్రకటించడం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.