breaking news
Sahakutumbaanaam Movie
-
సఃకుటుంబానాం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: సఃకుటుంబానాంనటీనటులు..: రామ్ కిరణ్, మేఘ ఆకాష్, రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్ తదితరులుదర్శకుడు..: ఉదయ్ శర్మనిర్మాతలు..: మహదేవ్ గౌడ్, నాగరత్నవిడుదల తేదీ..: జనవరి 01, 2026రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన తాజా చిత్రం సకుటుంబానాం. ఉదయ్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సాధారణ మధ్యతరగతి కుటుంబంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి (రామ్ కిరణ్) తన కుటుంబంపై అపారమైన ప్రేమ చూపిస్తాడు. అతనిది ప్రశాంతమైన జీవితం.. మంచి జీతం. అయితే ఒక అమ్మాయి తన టీమ్‌లో చేరడంతో ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. అలా ఆమెను తన కుటుంబానికి పరిచయం చేస్తాడు. కానీ ఆమె రాకతో కుటుంబంలో వచ్చే పరిణామాలు ఏంటి? ఆ తర్వాత బయటపడే రహస్యాలు.. అతని జీవితంలో వచ్చే పరివర్తనలు ఏంటి? చివరికి కుటుంబం మొత్తం ఐక్యంగా ఉంటుందా? అసలు అతనికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? విలన్ వారి జీవితాల్లోకి ఎలా ప్రవేశిస్తాడు? ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..కుటుంబ విలువలను, విభేదాలను ఎలా సమతుల్యం చేయాలో దర్శకుడు చూపించాడు. అవీ కుటుంబ బంధాలను ఎంత బలోపేతం చేస్తాయో ఈ కథలో మేసేజ్ ఇచ్చాడు. కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన సకుటుంబానాం టైటిల్ తగ్గట్టుగానే కథను ఎంచుకున్నారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ ఉద్యోగం, ప్రేమ చుట్టే కథ తిరుగుతుంది.ఇక సెకండాఫ్‌లోనే అసలు కథ మొదలవుతుంది. కుటుంబంలో జరిగే పరిణామాల చుట్టే స్టోరీని నడిపించాడు. అక్కడక్కడా కొన్ని సీన్స్ రోటీన్‌గా అనిపిస్తాయి. ప్రేక్షకుడి బోర్ కొట్టించేలా కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. కథ పరంగా డైరెక్టర్ తన విజన్‌కు తగినట్లుగానే తెరకెక్కించాడు. తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను ప్రేక్షకుడికి వివరించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సరికొత్త కథాంశంతో వెండితెరను అలరించడంలో దర్శకుడు ఉదయ్ శర్మ విజయవంతమయ్యాడు. ఓవరాల్‌గా చూస్తే కుటుంబ సమేతంగా చూడదగిన అద్భుత చిత్రమే సకుటుంబానాం.ఎవరెలా చేశారంటే..హీరోగా పరిచయమైన రామ్ కిరణ్ తన డ్యాన్స్, నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ మేఘ ఆకాష్ తనదైన నటనతో అదరగొట్టేసింది. రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రలో జీవించేశాడు. బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, భద్రం, నిత్య, రచ్చ రవి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. సినిమాటోగ్రాఫర్ మధు దాసరి పనితీరు బాగుంది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు, నృత్యాలు సినిమాకు పెద్ద ప్లస్. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. శశాంక్ మలి తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది.రేటింగ్ : 2.5 /5 -
'సకుటుంబానాం' మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆసక్తిరంగా "స:కుటుంబానాం" టీజర్
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే వెళ్తుంది అని చెప్పచ్చు. ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీనీ హేట్ చేస్తూ కనిపించిన ఈ టీజర్ తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు దర్శక రచయిత ఉదయ్ శర్మ. మణిశర్మ సంగీతం అందించిన ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రంలో రాజేంద్రప్రసాద్, రామ్ కిరణ్, మేఘా ఆకాష్, బ్రహ్మానందం, సత్య, గిరి, భద్రం ముఖ్య తారాగణంగా.. ప్రేక్షకులని అలరించబోతున్నారు.ఈ చిత్ర టీజర్ విషయానికి వస్తే ఒక పక్క నుండి అర్జున్ రెడ్డి లాంటి వైబ్స్ కనిపిస్తూనే మరోపక్క కుటుంబ సమేతంగా చూసే చిత్రం అని అర్థమవుతుంది. టీజర్ లోని ప్రతి డైలాగ్, విజువల్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే సత్య, బ్రహ్మానందం గారి హాస్యం చిత్రంలో బాగా పండుతుందని అనిపిస్తుంది. మేఘా ఆకాష్ మంచి క్యారెక్టర్ ప్లే చేసినట్లు అర్థమవుతుంది. రామ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో ఒక మార్క్ సృష్టిస్తారు నడిపించేలా తన ప్రెసెన్స్ & పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కుటుంబం విషయాలలో హీరో ఉద్దేశం అందరిలా సహజంగా ప్రేమగా కాకుండా కాస్త కొత్తగా ఉంటుందని ఈ చిత్ర టీజర్ అనిపిస్తుంది. టీజర్ లోని సంగీతం చాలా బాగుంది.


