breaking news
Sagubai
-
నేడు కందకాలపై సదస్సు
వైఎస్సార్ జిల్లా సొండిపల్లి మండలం ముడుంపాడు పంచాయతీ ఆరోగ్యపురం సమీపంలోని కత్తిరాళ్లబండ వద్ద గల డా. జనార్థన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 25న ఉ. 9.30 గం.కు స్వల్ప ఖర్చుతో కందకాల ద్వారా వాననీటి సంరక్షణపై అవగాహన సదస్సు జరగనుంది. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదరెడ్డి(99638 19074), ఉపాధ్యక్షుడు ముత్యంరెడ్డి(94419 27808) అవగాహన కల్పిస్తారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. వెంకటేశ్వరరెడ్డి– 82473 85931 -
‘సాగుబడి’ కథనాల సంకలనం ఆవిష్కరణ
హైదరాబాద్: ‘సాగుబడి’ డెస్క్ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు రాసిన ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి కథనాల సంకలనం ‘సాగుబడి’ని హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కేంద్ర కార్యాలయంలో సోమవారం ‘సాక్షి’ మీడియా గ్రూప్ చైర్పర్సన్ శ్రీమతి వై.ఎస్. భారతీ రెడ్డి ఆవిష్కరించారు. చిత్రంలో కుడి నుంచి ఎడమకు.. ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, ఎడిటర్ వి. మురళి, ఫైనాన్స్ డైరెక్టర్ వై. ఈశ్వర ప్రసాద్‌రెడ్డి, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణీ రెడ్డి, పంతంగి రాంబాబు, మార్కెటింగ్/ అడ్వర్టయిజింగ్ డైరెక్టర్ కె.ఆర్.పి. రెడ్డి పాల్గొన్నారు. ఈ సంకలనాన్ని కె.క్రాంతికుమార్‌రెడ్డి (లివాల్ట్ ప్రొడక్షన్స్) పబ్లిష్ చేశారు.