breaking news
Sadguru Jaggi Vasudev
-
కైలాష్ యాత్రలో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న సద్గురు
కైలాష్ మానస సరోవర్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న ఈశా ఫౌండేషన్‌కు చెందిన బృందం విషాదంలో చిక్కుకుంది. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో అకస్మాత్తుగా భారీ వరద రావడంతో తమ బృందంలోని 80 మంది ఆచూకీ తెలియడం లేదని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్ఘీ వాసుదేవ్ తెలిపారు. టిబెట్‌లోని సాగాలో ఈ ఘటన గురించి అనుచరులకు వివరిస్తూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.వరదకు ముందు చివరి సందేశంసద్గురు తెలిపిన వివరాల ప్రకారం.. యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న S3 బృందం గైరాంగ్లోని ఇమ్మిగ్రేషన్ భవనానికి చేరుకుంది. ఉదయం 9:05 గంటలకు బృంద నాయకుడు తాము ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి చేరుకున్నామని చివరిసారిగా సందేశం పంపారు. ఆ తర్వాత కేవలం తొమ్మిది నిమిషాలకు, అంటే 9:14 గంటల సమయంలో భారీ వరద సంభవించినట్లు సద్గురు చెప్పారు. ఈ బృందంలో 34 మంది పురుషులు, 46 మంది మహిళలు ఉన్నారు. వీరంతా వివిధ దేశాలకు చెందిన వారు అని తెలిపారు. సమీపంలోని హోటళ్లలో ఉన్న ముగ్గురు వాలంటీర్లు, ఒక వైద్యుడి ఆచూకీ కూడా తెలియడం లేదని సద్గురు పేర్కొన్నారు.BIG BREAKING 🚨 Sadhguru broke down in tears while talking about Nepal floods 🥹Emotional Moment !!He says "I want to go to Gyirong to help flood victims.Kindly allow us (myself and a few volunteers) to be at Gyirong.We will in no way hamper rescue efforts.Our only… pic.twitter.com/KhAZG8Dyyc— News Algebra (@NewsAlgebraIND) August 27, 2026గల్లంతైన వారి సంఖ్యపై ఆందోళననేపాల్ వైపు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయని సద్గురు పేర్కొన్నారు. భారతీయ మీడియా కథనాలను ఉటంకిస్తూ నేపాల్ వైపు 484 మంది వరకు గల్లంతైనట్లు తెలిపారు. టిబెట్ వైపు మాత్రం పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేదన్నారు. మొత్తం గల్లంతైన వారి సంఖ్య 1,500కు పైగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ సంఖ్య ఎంత అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.సహాయక చర్యలకు సవాళ్లువరద ప్రభావిత ప్రాంతంలో రహదారులు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో అక్కడికి చేరుకోవడం కష్టంగా మారిందని సద్గురు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు భారత, చైనా రాయబార కార్యాలయాల ద్వారా అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నామని, అమెరికా రాయబార కార్యాలయం కూడా సహకరిస్తోందని చెప్పారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు తమవారి సమాచారం కోసం తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. -
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన సద్గురు.. చేతులూ వణికాయ్..
న్యూఢిల్లీ: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్ర ఆకస్మిక వరదల్లో తమ సంస్థకు చెందిన 80 మంది సభ్యులు గల్లంతయ్యారని భావోద్వేగంతో సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రకటించడంతో టిబెట్‌లోని ఈశా ఫౌండేషన్ శిబిరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టిబెట్‌లోని సాగాలో ఉన్న శిబిరంలో వాతావరణం విషాదభరితంగా మారింది.కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నిస్తూ, సద్గురు చేతులు వణుకుతుండగా భావోద్వేగపూరితంగా విజ్ఞప్తి చేశారు. భారీ విధ్వంసం జరిగిన టిబెట్‌లోని గ్యిరోంగ్‌కు వెళ్లి సహాయక చర్యలు, యాత్రికుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని భారత, చైనా రాయబార కార్యాలయాలను కోరారు.సాధారణంగా ఎంతో ప్రశాంతంగా కనిపించే ఆధ్యాత్మిక గురువు ప్రస్తుతం సాగాలో ఉన్నారు. కైలాస యాత్ర నుంచి తిరిగి వస్తున్న 80 మంది సభ్యుల బృందానికి జరిగిన విషాదాన్ని వివరిస్తూ ఆయన తీవ్రంగా కలత చెందినట్లు కనిపించారు. “విధ్వంసం స్థాయిని చూస్తే పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. ఇది భయంకరమైన, అసాధారణమైన ఘటన” అని సద్గురు అన్నారు.తన అనుచరులను ఉద్దేశించి సద్గురు మాట్లాడుతూ.. గురువారం ఉదయం తాను స్వయంగా ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పారు. అయితే విపత్తు కారణంగా అక్కడికి వెళ్లే దాదాపు అన్ని మార్గాలు తెగిపోయాయని తెలిపారు. “ఇప్పటివరకు మాకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు... కానీ విధ్వంసం స్థాయిని చూస్తే పరిస్థితి ఏమాత్రం బాగున్నట్లు కనిపించడం లేదు” అని ఆయన అన్నారు.సందేశం వచ్చిన 9 నిమిషాల్లోనే సంబంధాలు కట్బృందం గ్యిరోంగ్‌లోని ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న సమయంలో మొత్తం భవనం కొన్ని క్షణాల్లోనే పూర్తిగా కొట్టుకుపోయిందని సద్గురు తెలిపారు. వరద నీరు భవనాన్ని తాకిన క్షణాన్ని చూపించే భయానక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వారం రోజుల క్రితమే తాను అదే ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్నానని సద్గురు గుర్తుచేసుకున్నారు. “వారం రోజుల క్రితం మేము ఇమ్మిగ్రేషన్ కోసం ఉన్న అదే భవనం... ఆ భవనం మొత్తం కొట్టుకుపోయింది” అని ఆయన అన్నారు.ఉదయం 9.05 గంటలకు బృందం నాయకుడు ఇషంగా ప్రవీణ్ నుంచి ఫౌండేషన్‌కు సందేశం వచ్చిందని సద్గురు తెలిపారు. “వారు ఇమ్మిగ్రేషన్‌కు చేరుకున్నారని ఆయన సందేశం పంపారు. ఆ తర్వాత 9.14 గంటలకు ఇది జరిగింది” అని సద్గురు చెప్పారు.మరోసారి భావోద్వేగంప్రవీణ్ 20 ఏళ్లకు పైగా ఈశా ఫౌండేషన్‌తో అనుబంధం కలిగి ఉన్నారని చెప్పేటప్పుడు సద్గురు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు ఆగిన తర్వాత ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రవీణ్ నేపాల్ ఫోన్ నంబర్ ఆ రోజు పనిచేయడం ప్రారంభించలేదని తమ బృందం గుర్తించిందని సద్గురు తెలిపారు. “అతను సరిహద్దు దాటి ఉంటే, అతని నేపాల్ ఫోన్ పనిచేయాలి. కానీ అది పనిచేయలేదు” అని సద్గురు అన్నారు.మంచు చరియలు విరిగిపడటం వల్ల ఈ విషాదం సంభవించి ఉండొచ్చని, విపత్తు తీవ్రత ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సద్గురు హెచ్చరించారు. ప్రభావితమైన వారి సంఖ్య 1,500 లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని ఆయన అన్నారు.అయితే సద్గురు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదు. ఫౌండేషన్‌కు బృందం నుంచి చివరిసారిగా సమాచారం వచ్చి దాదాపు 12 గంటలు గడిచాయని ఆయన తెలిపారు. దీని ఆధారంగా అన్ని ఆశలు వదులుకోవాల్సి వచ్చిందని మాత్రం ఆయన చెప్పలేదు. టిబెట్‌లోని గ్యిరోంగ్‌లో ప్రభావిత ప్రాంతానికి సద్గురు, చిన్న బృందం వెళ్లేందుకు అనుమతి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహాయక చర్యలకు మద్దతు ఇవ్వాలని సద్గురు కోరుతున్నారు.“ఈ విషయంలో భారత, చైనా, అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. కొంతమంది వ్యక్తులతో కలిసి నేను అక్కడికి వెళ్లి మనం ఏం చేయగలమో చూసేందుకు అనుమతిస్తారేమో చూస్తున్నాం” అని ఆయన అన్నారు. సద్గురు తన ప్రసంగాన్ని ముగించినా ఈశా శిబిరంలో విషాద వాతావరణం అలాగే కొనసాగింది. నేపథ్యంలో వినిపించిన రోదనలు ఆగలేదు.ఇదీ చదవండి: పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులుటిబెట్కు సరిహద్దుగా ఉన్న నేపాల్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించడంతో సుమారు 300 మంది మరణించగా, 1,500 మంది గల్లంతయ్యారు. వరద నీరు వల్ల ఇళ్లు, వాహనాలు, వంతెనలను కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలో సమాచార సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. సుమారు 300 మంది భారతీయులు గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.ఈశా సేక్రెడ్ వాక్స్ సమన్వయకర్త స్పందననేపాల్లో వరద పరిస్థితుల కారణంగా ఈశా ఫౌండేషన్ ‘సేక్రెడ్ వాక్స్’ (కైలాస మానస సరోవర్ యాత్ర)కు వెళ్లిన పలువురు యాత్రికులు, స్వచ్ఛంద సేవకులు గల్లంతు కావడం/చిక్కుకుపోవడంపై ఈశా సేక్రెడ్ వాక్స్ సమన్వయకర్త మా గంభీరి స్పందించారు “ఊహించని పరిస్థితి ఎదురైంది. బృందం కాఠ్మాండూకు తిరిగి వస్తుండగా చైనా ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉంది. ఉదయం 9.05 గంటలకు వారితో చివరిసారిగా మాట్లాడినప్పుడు, బృందం నాయకుడు ప్రవీణ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి ఇప్పుడే చేరుకున్నామని, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ప్రారంభించబోతున్నామని చెప్పారు. 10 నిమిషాల్లోనే మళ్లీ వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా, వారి ఫోన్లు అందుబాటులోకి రాలేదు. ఇదీ చదవండి: పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులుఆ 10 నిమిషాల్లోనే ఈ మొత్తం విషాదం జరిగింది. మొత్తం సమాచార వ్యవస్థ పనిచేయకపోవడంతో బృందంలోని అందరితో సంబంధాలు తెగిపోయాయి. మేము సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. నేపాల్ వైపు అన్ని సమాచార వ్యవస్థలు పనిచేయలేదు. సమాచారం తెలుసుకునేందుకు కొన్ని హెలికాప్టర్లను పంపేందుకు ప్రయత్నించారని అనుకుంటున్నాను. నేపాల్ వైపు మా ముగ్గురు స్వచ్ఛంద సేవకులు ఉన్న పట్టణం పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. మొత్తం 80 మంది ఈ ఘటనతో ప్రభావితమయ్యారు. చైనా అధికారులు త్వరలో, ఆశాజనకంగా రేపు ఉదయం నాటికి ఏదైనా సమాచారం ఇస్తారని మేము ఇంకా ఆశిస్తున్నాం. మంచి వార్త వింటామనే ఆశతో ఎదురుచూస్తున్నాం” అని చెప్పారు.నేపాల్‌లో వరదల కారణంగా చిక్కుకుపోయిన 77 మంది యాత్రికుల గురించి ఆమె మాట్లాడుతూ.. “వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్‌లోని వివిధ దేశాలు, బ్రిటన్ నుంచి వచ్చారు. కొన్ని ఆసియా దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. మొత్తం 19 దేశాల నుంచి పాల్గొన్నవారు ఉన్నారు. వారిలో చాలామంది భారతీయ మూలాలు ఉన్నవారు. భారత్, నేపాల్‌లోని మొత్తం 19 రాయబార కార్యాలయాలను సంప్రదించాం. వారితో మేము నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాం. మాకు ఎలా సహాయం చేయాలి, ఏదైనా సమాచారం ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను వారు కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషాదం చాలా మారుమూల ప్రాంతంలో, భారీ స్థాయిలో చోటుచేసుకోవడంతో సమాచారం అందడానికి చాలా ఆలస్యం అవుతోంది” అని తెలిపారు. View this post on Instagram A post shared by Sadhguru (@sadhguru) -
రాముడిగా రణ్‌బీర్, రావణుడిగా యష్. ట్రోల్స్‌పై స్పందించిన సద్గురు!
ప్రస్తుతం మన దేశంలో అత్యంత పేరొందిన ఆధ్యాత్మిక గురువుగా సద్గురు జగ్గీ వాసుదేవ్(Sadhguru Jaggi Vasudev ) చెప్పొచ్చు. ఆయనకు ఏ ఆధ్యాత్మిక గురువుకూ లేనంతగా సినిమా రంగంలో అభిమానులు ఉన్నారు, అలాగే సినీ రంగంతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఆయన శివరాత్రి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో తారలు హాజరై నృత్యాలు చేయడం చూస్తుంటాం. అలాగే తరచుగా సినిమా నటీనటులు, ఇతర ప్రముఖులు ఆయనతో సంభాషణలు జరుపుతూ ఉండడం ఆ విశేషాలు మీడియాలో బాగా హల్ చల్ చేయడం తెలిసిందే. అదే క్రమంలో ఆయన ఇటీవల ప్రతిష్టాత్మక చిత్రం ’రామాయణ’(Ramayana) నిర్మాత నమిత్ మల్హోత్రాతో జరిగిన సంభాషణలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రాముని పాత్రను రణబీర్ కపూర్ పోషించడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. రణబీర్ గతంలో పోషించిన పాత్రలతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన వార్తల గురించి సైతం ప్రస్తావిస్తూ పెద్ద యెత్తున ట్రోల్ చేస్తున్నారు. దీనిపై కూడా ఈ సంభాషణలో ఇద్దరూ చర్చించారు. దీని గురించి సద్గురు మాట్లాడుతూ ‘రామ్ పాత్ర కు రణబీర్ సరికాదని చెప్పడం న్యాయమైన తీర్పు కాదు అతను ఏదో ఒక విధంగా గతంలో నటించాడనేది అప్రస్తుతం.. రేపు, మరొక సినిమాలో, అతను రావణుడిలా నటించవచ్చు. అతను ఒక ప్రొఫెషనల్ నటుడు. అంతవరకు చూడాలి. అయితే ఒకటి సినిమా అనేది నటులు లేదా దర్శకుల వల్ల కాదు, ప్రజల వల్ల నడుస్తుంది. కాబట్టి, వారి అంచనాలను కూడా పూర్తిగా తోసిపుచ్చలేం’’ అంటూ వ్యాఖ్యానించారు.కేజీఎఫ్ స్టార్ యష్(Yash)ను రావణుడిగా ఎంపిక చేయడం పట్ల సద్గురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యష్ నాకు బాగా తెలుసు. అతను ఈ సినిమా లో రావణుడు ఎలా అయ్యాడో నాకు తెలియదు. విలన్ అంటే అతనికి చట్టి ముక్కు వంటివి ఉంటాయి. అయితే యష్ ఒక అందమైన వ్యక్తి కదా అంటూ ఆ పాత్రకు యష్ ఎంపిక పట్ల సద్గురు అభ్యంతరం వ్యక్తం చేశారు.దీనిపై సినిమా నిర్మాత నమిత్ తన వైఖరిని సమర్థించుకుంటూ అవును మీరన్నది నిజమే. అతను చాలా అందంగా ఉంటాడు. అంతేకాదు దేశంలో చాలా ప్రతిభావంతుడైన స్టార్ కూడా ‘మేం ఆ పాత్ర ఒక సూపర్ స్టార్ స్థాయి వ్యక్తి పోషించాలని అనుకున్నాం. అంతేకాక అతను కూడా ఆ పాత్ర పోషణను చాలా ఇష్టపడ్డాడు.’’ అంటూ యష్ ఎంపిక గురించి చెప్పాడు. అయితే, సాధారణంగా విలన్లు ఒక ప్రత్యేక రూపంతో ముఖ్యంగా చదునైన ముక్కును కలిగి ఉంటారే తప్ప పదునైన ముక్కు తో ఉండరని సద్గురు అంటూ అది మీరు గమనించారా?‘ అని అంటే... ‘ఇకపై గమనిస్తాను’ అంటూ నమిత్ చమత్కరించారు.ఇదే చర్చలో ఒక సందర్భంలో తెలుగు దిగ్గజ కధానాయకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావును కూడా సద్గురు ప్రస్తావించడం విశేషం. ఎన్నో సినిమాల్లో ఎన్టీయార్ కృష్ణుడిగా కనిపించి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, అదే ఆయనను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించి ఎన్నికల్లో గెలిచేందుకు కూడా దోహదం చేసిందంటూ ఆయన అభిప్రాయపడ్డారు.సినిమా, సోషల్ మీడియాలో...ఈ చర్చ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తింది. భక్తి చిత్రాలకు ఎంపిక చేసేటప్పుడు చిత్రనిర్మాతలు ఆధ్యాత్మిక నాయకులను సంప్రదించాలా? దీనిపై తెలుగు దర్శకుడు డాలీ ఓ మీడియాతో మాట్లాడుతూ ‘సద్గురు గొప్ప వ్యక్తి, ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించే ధైర్యం చేయను. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు కలిగి ఉంటారు. కానీ పాత్రల ఎంపిక విషయంలో చివరికి, నిర్మాత దర్శకుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. నాకు తెలిసి రణ్‌బీర్‌ను రామ్‌గా, యష్‌ను రావణ్‌గా నటింపజేయడం ఉత్తర దక్షిణ భారత ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకునే ఒక తెలివైన ప్రయత్నం. రణ్‌బీర్ అద్భుతంగా నటించగలడు..అలాగే యష్ కూడా మెరిపిస్తాడు. ఇక ట్రోల్స్ అంటారా? విశాల థృక్పధం లేని ట్రోల్‌లను విస్మరించడం ఉత్తమం‘ అంటూ స్పష్టం చేశారు. -
సుప్రీం కోర్టులో ఈశా ఫౌండేషన్‌కు ఊరట
ఢిల్లీ: ఈశా ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని ఇటీవల పోలీసులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఈశా ఫౌండేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది. ఆశ్రమంలో పోలీసుల సోదాలు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు మహిళలతో ఆన్లైన్లో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నామని ఇద్దరు యువతులు తెలిపారు. ఈశా యోగా ఆశ్రమంలో తమిళనాడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పేర్కొంది. ఇక.. ఈ కేసులో పూర్తి స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 18కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.ఇక.. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్ యోగా కేంద్రాన్ని మంగళవారం దాదాపు 150 మంది పోలీసు సిబ్బంది ప్రభుత్వ అధికారులతో కూడిన బృందం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.చదవండి: కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. -
అదే భారత్ గొప్పతనం.. ‘సాక్షి’తో సద్గురు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 17వ మహాసభలు ఘనంగా జరిగాయి. వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్లో జూలై 1 నుండి 3 తేదీ వరకు జరిగిన మూడు రోజుల కార్యక్రమాల్లో వివిధ రంగాల ప్రముఖులు, ఆధ్మాతిక వేత్తలు, అమెరికాలోని తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆటా మహా సభల్లో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించింది. సద్గురుతో సాక్షి టీవీ రిపోర్టర్ రుచికా శర్మ ఇంటర్వ్యూ... నేటీ టెక్నాలజీ యుగంలో ధనమే పరమావధిగా పరుగులు పెడుతున్న ఈతరం యువత.. ముఖ్యంగా అమెరికా జీవన విధానంలో మునిగి తేలుతున్న మన భారతీయ పిల్లల్లో సంప్రదాయ సంస్కృతులను ఎలా స్థిరంగా నిలబెట్టాలనే దానిపై ‘సాక్షి’ సద్గురు అభిప్రాయాలను తెలుసుకుంది. సద్గురు మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలు ఇండియాలో స్కూలింగ్ చేయడం వీలు కాదు. కాబట్టి స్కూలింగ్ తరువాత పిల్లలను 4, 5 సంవత్సరాల వరకు ఉన్నత చదువులకు ఇండియాకు పంపించడం మంచింది. ఇండియాలో ఉండే మూడు, నాలుగేళ్లు నేర్చుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా అమెరికాకు, ఇండియాకు ఉన్న జీవన విధానంలో తేడాను గమనిస్తారు. ఎన్నో విషయాలపై అవగాహన వస్తుంది. భారతీయ సంప్రదాయాలు, పద్ధతులు తెలుస్తాయి. భారత్ భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ జీవించే భిన్న వర్గాల ప్రజలు, వారి అలవాట్లు, జీవన విధానంపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుంది. ఇదే ఇండియా గొప్పతనం. విభిన్న వర్గాల మధ్య జీవించడం ద్వారా వారి ఆలోచనలు, మనస్తత్వాలు తెలుస్తాయి. మన సొంత ఉనికి స్వభావాన్ని తెలుసుకోవచ్చు, జీవిత సత్యం బోధపడుతుంది. ఎంతో అద్భుతమైన మానవత్వం గల మనుషులుగా తయారవుతాం. ఓపెన్ మైండ్‌తో ఇండియాలో ట్రావెల్ చేయడం ముఖ్యం. ఇండియాకు, అమెరికాకు మధ్య మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవహారాల్లో వ్యతాసాలు చూడకుండా ఇక్కడి ప్రజల్లోని మానవత్వాన్ని, సంస్కృతిని నేర్చుకోవడం ఎంతో విలువైనది’ అని సద్గురు పేర్కొన్నారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది వీడియో చూడండి👇 -
ఉపాధి పెంచే పెట్టుబడులు రావాలి
ఆర్థికంగా పురోగమించడంతో గడిచిన 20 ఏళ్లలో 24 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని... కరోనా వైరస్ కారణంగా ఎందరో పేదలు, వలస కార్మికులు మళ్లీ దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయే ప్రమాదం కనిపిస్తోందని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సద్గురు జగ్గీ వాసుదేవ్ హెచ్చరించారు. భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ పరిస్థితిని నివారించే అవకాశం ఉందన్నారు. ‘‘కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచదేశాలు తమ తయారీ వ్యవస్థల కోసం చైనా వెలుపలికి చూస్తున్నాయి. దీన్ని భారత్ అందిపుచ్చుకోవాలి’’ అని చెప్పారు. ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధితో ఆర్థికాంశాలపై ప్రత్యేకంగా మాట్లాడారాయన. ఆ వివరాలివీ... ► కోవిడ్‌తో తయారీ రంగంలో చైనా ఆధిపత్యానికి బ్రేకులు పడొచ్చనే అంచనాలున్నాయి. అలా బయటకు వచ్చే సంస్థలు ఇండియావైపు చూసే అవకాశం ఉందా? కరోనా మహమ్మారితో మన ఆర్థికవ్యవస్థ కూడా బాగా దెబ్బతినేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 140 కోట్ల మంది జనాభా ఉన్నా... ఆ స్థాయి ఆర్థిక వ్యవస్థ మనకు లేదు. ధనికులు ఈ పరిస్థితిని తట్టుకోవచ్చు కానీ రోజు కూలీలు చాలామంది ఎంతో దుర్భర స్థితిని ఎదుర్కొంటారు. వచ్చే రెండేళ్లలో భారీ పెట్టుబడులు గానీ రాకపోతే పెద్ద ఎత్తున జనం దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయే ప్రమాదముంది. చైనాపై ఇతర దేశాలకు నమ్మకం తగ్గుతోంది. అక్కడ భారీ పెట్టుబడులు పెట్టిన జపాన్... తమ కంపెనీలు చైనా నుంచి బయటకు వస్తే ప్రోత్సాహకాలిస్తోంది. ఇక అమెరికా ఇంతకన్నా ఎక్కువే చేయొచ్చు. అప్పుడు చైనాలో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తిలో కొంతైనా ఇక్కడకు తరలిస్తే మనకు కలిసొస్తుంది. మన దేశానికి భౌగోళికంగా ఎన్నో అనుకూలతలున్నాయి. ఆయా దేశాలతో మనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ల పెట్టుబడులు ఇక్కడ సురక్షితమనే భావన కలిగించటం ముఖ్యం. ► చైనా వదిలి రావాలనుకుంటున్న కంపెనీలను ఆకర్షించడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? చైనాలో 300కు పైగా విదేశీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో కొన్నయినా బయటికి వచ్చే ప్రయత్నాలు చేస్తాయి. అదే జరిగితే దాదాపు 150 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలిపోతాయి. వాటిలో కొంతయినా వచ్చే రెండేళ్లలో ఇక్కడికి వస్తే ఉపాధి గురించి ఆందోళన ఉండదు. కాకపోతే దీనికోసం ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థల నుంచి గట్టి ప్రయత్నాలు జరగాలి. అధికార పరమైన అడ్డంకులు లేకుండా, భూమి, విద్యుత్, ఇతర మౌలిక వసతులు కల్పించడంతో పాటు.. అన్ని రకాల ఆమోదాలను ఒకే వేదికపై అందించే ఏర్పాట్లుండాలి. ► రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకోవాలంటారా? రాష్ట్రాలు ఇలాంటి భారీ పెట్టుబడులు ఆకర్షించడానికి వీలుగా చట్టపరమైన మార్పులు తేవాలి. పరిశ్రమలన్నీ ఒకే చోట కాకుండా దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తరించాలి. దేశంలో వచ్చే పదేళ్లలో 20 కోట్ల మంది ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తారని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. అదే జరిగితే నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. అందుకే వ్యాపారాలు నగరాల్లోనే కేంద్రీకృతం కాకూడదు. మన న్యాయవ్యవస్థలో జాప్యం ఎక్కువ కనుక భారీగా పెట్టుబడులు పెట్టేవారికి, వ్యాజ్యాల నుంచి కనీసం ఐదేళ్ల వరకైనా రక్షణ కల్పించాలి. ► కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ సరైనదేనా? వలస కార్మికులు, పేదలకు ఇంకా ఏం చేయాలి? రాజకీయ ఉద్యమాలతోనో, మిలిటరీ బలంతోనో దేశం అభివృద్ధి చెందదని అర్థం చేసుకోవాలి. వ్యాపారాభివృద్ధితోనే ఇది సాధ్యం. దురదృష్టవశాత్తు దేశంలో సోషలిస్టు భావాలున్న శక్తులు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు ఏ ఆర్థిక సాయం చేసినా... ‘ధనికులు మరింత ధనికులు అవుతున్నారు’ అంటూ వీళ్ళు మాట్లాడతారు. డబ్బులివ్వడం ద్వారా పేదవారిని దారిద్య్రం నుంచి బయటకు తీసుకురాలేం. సరైన పరిశ్రమలతోనే ఇది సాధ్యం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కావాలి. అందరికీ గౌరవప్రదమైన జీవన భృతి దొరికేది అప్పుడే. (సాక్షి, బిజినెస్ ప్రతినిధి) -
భౌతికాతీత కోణాన్ని సజీవం చేయడమే యోగ
యోగా యోగా అంటే బరువు తగ్గటం కోసమో, సన్నబడటం కోసమో, నడుమునొప్పి, తలనొప్పి తగ్గటం కోసమో చేసేది కాదు. యోగా చేస్తే అవన్నీ ఎలాగూ జరుగుతాయి - మీరు ఎలాగూ ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ప్రేమగా, సున్నితంగా తయారవుతారు. కానీ అవన్నీ యోగా వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. అవి యోగా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. మీరు బరువు తగ్గటానికి యోగా చేయనవసరం లేదు. అందుకోసం మీరు కొంచెం వివేకంతో తింటే, టెన్నిస్ ఆడితే లేదా ఈత కొడితే సరిపోతుంది. భౌతికాతీతమైన కోణాన్ని మీలో సజీవం చేయటమే యోగ యొక్క ముఖ్య ఉద్దేశం. అది సజీవమైనప్పుడు మాత్రమే ఈ సృష్టి మెల్లిగా అనేక విధాలుగా మీకు అందుబాటులోకి వస్తుంది. భౌతికాతీతమైన కోణం మీలో సజీవం అవ్వటం వల్ల మీరెప్పుడూ ఊహించనటువంటి విషయాలు కూడా మీ జీవితంలో యథార్థాలుగా మారతాయి. మీరు యోగ చేస్తుంటే, అధికంగా ఉన్న బరువు కచ్చితంగా తగ్గుతుంది. ఉదాహరణకు, కొందరు క్రియ యోగా మొదలుపెట్టినప్పుడు బరువు తగ్గుతారు, మరికొందరు బరువు పెరగటం మొదలుపెడతారు. మీ జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే, మీరు క్రియలు చేయడం మొదలుపెట్టినప్పుడు... మీ జీర్ణ శక్తి ఉత్తేజితం అవుతుంది. మీ జీర్ణశక్తి మెరుగవటం వల్ల, ఆహారం మాంసంగా మారటం మరింత సమర్థవంతంగా జరుగుతుంది. అందువల్ల మీరు బరువు పెరగటం మొదలు అవుతుంది. మీ జీర్ణశక్తి ముందే బాగుండి, మీరు క్రియలు చేయటం మొదలుపెడితే, అప్పుడు కూడా ఆహారాన్ని ఉపయోగించుకునే మీ సామర్థ్యం మరింత మెరుగవుతుంది. కానీ ఆహారం అప్పుడు మాంసంగా కాకుండా, ఒక సూక్ష్మమైన శక్తిగా మార్చబడుతుంది. అప్పుడు మీరు ఎంత తిన్నా మీ బరువు తగ్గుతూనే ఉండటమే మీరు గమనిస్తారు.అదే మరోవిధంగా కూడా జరగవచ్చు. మీరు తీసుకునే ఆహారం నాటకీయంగా తగ్గిపోవచ్చు. కానీ మీరు బరువు తగ్గకపోవచ్చు. మనలో ఆహారం రూపాంతరం చెందే నిష్పత్తి మారటం వల్లే ఇలా జరుగుతుంది. యోగా మీ వ్యవస్థను పునరుత్తేజితం చేసి, మీ విజ్ఞతను పెంపొందిస్తుంది. అందువల్ల మీరు అతిగా తినరు. మీ శరీరంలో కొంత స్థాయి అవగాహన రాగానే, దానికి అవసరమైనంతే తినేటట్లుగా అది మారుతుంది. మీరు మీ జీవితాన్ని నియంత్రించటం వల్లనో లేక ఎవరో మీకు డైటింగ్ చేయమని చెప్పటం వల్లనో ఇది జరగదు. మీరు వ్యాయామం లేక డైటింగ్ చేస్తున్నారంటే, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. యోగా సాధన చేస్తే, మిమ్మల్ని మీరు నియంత్రించుకునే అవసరం ఉండదు. మీరు కేవలం సాధన చేయండి. ఇది మీ వ్యవస్థను ఎలా చూసుకుంటుంది అంటే అది మిమ్మల్ని మీకు అవసరమైన దానికంటే ఎక్కువ తిననివ్వదు. యోగా చేయడానికి, బరువు తగ్గటానికి చేసే మిగతా పనులకి మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఇదే! ప్రేమాశీస్సులతో,సద్గురు - సద్గురు జగ్గీ వాసుదేవ్ www.sadhguru.org -
శబ్దం... శక్తిమంత్రం
సద్గురు జగ్గీ వాసుదేవ్ www.sadhguru.org నాదయోగం పాథమికంగా ఈ అస్థిత్వంలో మూడు శబ్దాలు ఉన్నాయి. ఏ ఇతర శబ్దాన్నైనా ఈ మూడు శబ్దాలతో సృష్టించవచ్చు. ఒక చిన్న ప్రయోగంతో మీరు దీన్ని గమనించవచ్చు. నాలుకను వాడకుండా మీరు చేయగలిగిన శబ్దాలను చేయండి. నాలుకను వాడకుండా మీరు చేయగలిగే శబ్దాలు మూడే అని మీరు గమనిస్తారు. అవే ఆ, ఊ,మ్లు. మీ నాలుకను కోసేసుకున్నా మీరు ఈ మూడు శబ్దాలు చేయగలరు. వేరే ఏ శబ్దం చేయాలన్నా మీకు నాలుక వాడవలసిన అవసరం ఉంటుంది. ఈ మూడు శబ్దాలను మీరు మీ నాలుకతో అనేక విధాలుగా కలిపి ఇతర అన్ని శబ్దాలను సృష్టించగలుగుతున్నారు. మీరు మీ నోటితో మిలియన్ శబ్దాలను సృష్టించగలరు. కానీ ఒక మూగ వ్యక్తి ఆ, ఊ, మ్ శబ్దాలను మాత్రమే చేయగలడు. ఈ మూడు శబ్దాలను కలిపి ఉచ్ఛరిస్తే ఏమి వస్తుంది? ఆమ్ (ఓం) వస్తుంది. ఆమ్ (ఓం) ఒక మతం యొక్క ట్రేడ్ మార్క్ (వ్యాపార చిహ్నం) కాదు. అది ఈ అస్థిత్వపు ప్రాథమిక శబ్దం. శివుడు కేవలం మూడుసార్లు ‘ఆమ్ (ఓం)’ అని ఉచ్ఛరించి ఒక కొత్త ఉనికిని సృష్టించగలడని అంటారు. ఇది నిజం కాదు. కానీ సత్యం! సత్యానికి, నిజానికి మధ్య తేడా ఏమిటి? ఉదాహరణకు ఒక స్త్రీని తీసుకుందాం. ఒకరు శారీరకంగా ‘స్త్రీ’ అయినంత మాత్రాన, ఆమె తండ్రి ఆమె పుట్టుకలో పాలుపంచుకోలేదా? దానర్థం ఆమెలో తన తండ్రి అంశ లేదనా? కాదు. నిజం ఏమిటంటే ఆమె ఒక స్త్రీ. కానీ సత్యం ఏమిటంటే ఆమెలో స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉన్నారు. అలాగే శివుడు ఎక్కడో కూర్చుని ఆమ్ (ఓం) అని ఉనికిని సృష్టిస్తాడని కాదు. అది కాదు విషయం. విషయం ఏమిటంటే ప్రతిదీ ఒక ప్రకంపనే! మంత్రం అంటే ఒక శబ్దం. ఒక ఉచ్ఛారణ లేక ఒక అక్షర ధ్వని. నేడు ఆధునిక విజ్ఞానం ఈ అస్థిత్వం మొత్తాన్ని ఒక శక్తి ప్రకంపనగా, వివిధ స్థాయిల్లో ఉన్న ప్రకంపనగా చూస్తుంది. ఎక్కడైతే ప్రకంపనం ఉంటుందో అక్కడ శబ్దం ఉండి తీరుతుంది. అంటే ఈ మొత్తం అస్థిత్వం ఒక రకమైన శబ్దమని లేదా శబ్దాల సంక్లిష్ట సమ్మేళనమని లేక అనేక మంత్రాల సమ్మేళనమని అర్థం. వీటిలో కొన్ని మంత్రాలు లేక శబ్దాలు గుర్తించబడ్డాయి. వీటిని ఒక నిర్దిష్ట విధానంలో ఉపయోగిస్తే, అవి మీలోని ఒక భిన్న జీవిత పార్శ్వాన్ని తెరచి, మీకో భిన్న అనుభూతిని అందించగలిగే తాళంచెవిగా మారతాయి. మంత్రాలు చాలా మంచి సన్నాహక ప్రక్రియలు కాగలవు. కేవలం ఒక్క మంత్రమే మనుషులపై ఎంతో మహత్తరమైన ప్రభావాన్ని చూపగలదు. కానీ ఆ మంత్రం శబ్దాలన్నింటి గురించి, ఈ సృష్టినంతటి గురించి సంపూర్ణమైన అవగాహన కలిగిన ఒక మూలం నుంచి వచ్చినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. అటువంటి మూలం నుంచి, అటువంటి అవగాహన నుంచి ఒక మంత్రం వస్తే... దాంతో పాటు అది స్వచ్ఛంగా అందించబడినప్పుడు, అది ఒక సమర్ధవంతమైన శక్తి కాగలదు. ప్రేమాశీస్సులతో,సద్గురు -
ఆసనాలను క్రమపద్ధతిలోనే ఎందుకు చేయాలి?
యెగా ఈ రోజుల్లో హఠయోగా వికృతరూపం తీసుకుంది. దీనికి కారణం అందరూ దీనిని ఒక సర్కస్‌లాగా తయారు చేయడమే. పశ్చిమదేశాల్లో ఇది జరుగుతున్న తీరు చూస్తుంటే నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ యోగా పేరుతో అన్ని రకాల పిచ్చి పనులు చేయబడుతున్నాయి. యోగాసనాలు ఒక వ్యాయామం కాదనీ, అవి మీ ప్రాణశక్తిని ఒక నిర్దిష్ట దిశలో ఉత్తేజపరిచే సున్నితమైన ప్రక్రియలనీ మీరు అర్థం చేసుకోవాలి. వీటిని చాలా సున్నితంగా వీలైనంత అవగాహనతో చేయడం చాలా ముఖ్యం. ఆసనాలను ఒక నిర్దిష్ట క్రమపద్ధతిలో చేయాలి. ఈ క్రమపద్ధతి మీరో, నేనో కనిపెట్టినది కాదు. ఇది మానవ వ్యవస్థ ఎలా పని చేస్తుందనే దాన్ని గమనించడం వల్ల వచ్చినది. మీ వ్యవస్థలో అస్థిపంజర వ్యవస్థ సౌఖ్యం, కండరాల సౌఖ్యం, అవయవ సౌఖ్యం, ప్రాణశక్తి సౌఖ్యం అనేవి ఉంటాయి. ఉదాహరణకు మీరు ఒక ఏటవాలుగా ఉన్న కూర్చీలో కూర్చుంటే మీ కండరాలు సౌకర్యంగా ఉంటాయి కానీ, మీ కీళ్ళు, అవయవాలు ఇబ్బందికి గురవుతాయి. మీ ఉదర భాగంలోని ముఖ్యమైన అవయవాలు గట్టిగా నట్లు, బోల్టులతో బిగించబడి ఉండవు. అవి కణజాల బంధనంతో వేలాడతీయబడి ఉంటాయి. అందువల్ల ఏటవాలుగా ఉన్న కుర్చీలో కూర్చుంటే వాటికి సౌకర్యంగా ఉండదు. హఠయోగాలో ప్రాణశక్తి సౌఖ్యం కూడా పరిగణించబడుతుంది. మీ ప్రాణశక్తిలోని ఒక అంశాన్ని ఉత్తేజపరచకుండా మరొక అంశాన్ని ఉత్తేజపరిస్తే, మీ వ్యవస్థ గందరగోళానికి గురి అయ్యేటట్లు మీ ప్రాణశక్తి అస్థవ్యస్థంగా పని చేస్తుంది. అస్థవ్యస్థ శక్తి అంటే మీరు అస్థవ్యస్థంగా జీవిస్తున్నారని అర్థం. మీరు ఎక్కువ రోజులు జీవించవచ్చు, లాటరీ గెలవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, రోజుకు 24 గంటలు పూజ చేయవచ్చు. కానీ మీరు ఎప్పుడూ సంపూర్ణమైనవారు కాలేరు. మీరు ఏమి చేసినా సరే, మీది ఒక అస్థవ్యస్థ జీవనమే అవుతుంది. ఆసనాలు క్రమపద్ధతిలో చేయడం ద్వారా మానవ వ్యవస్థను ఒక చివరి నుంచి మరొక చివరి వరకు ఒక క్రమపద్ధతిలో ఉత్తేజపరచవచ్చు. జీవన పరిస్థితులు అకస్మాత్తుగా మారవచ్చు. అవి ఎలా మారితే మీరు అలా పని చేయవలసి రావచ్చు. మీరు వ్యవస్థను ఒక పద్ధతిలో ఉత్తేజపరిస్తే, ఏది జరిగినా మీ వ్యవస్థను కలత పెట్టకుండా మీరు వాటిని ఎదుర్కోగలరు. ఎవరైనా దీన్ని స్పష్టంగా చూడొచ్చు. మీరు సరైన సాంప్రదాయ హఠయోగాని చేస్తే ఎలాంటి పరిస్థితులు వచ్చినా అవి మిమ్మల్ని చెదరగొట్టలేవు. ప్రేమాశీస్సులతో - మీ సద్గురు గమనిక: గత వారం ‘యోగా’ శీర్షిక కింద ఇచ్చిన ‘ప్రాణాయామం’ వివరాలు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇచ్చినవి కావు.


