breaking news
rtc bus turns
-
ఆర్టీసీ బస్సు బోల్తా: 17మందికి గాయాలు
అనంతపురం: అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లె వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తాడిపత్రి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్సు బోల్తా: 40మందికి గాయాలు
ప్రకాశం: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు శివారులోని వెంగముక్కలపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో 40మందికి గాయలాయ్యాయి. బస్సు నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి తిరుపతి వెళుతుండగా వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సులో దాదాపు 50మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. సంఘటనా స్థలానికి 108 సిబ్బంది చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.