breaking news
rojarani
-
చింతకాయల చింతామణి.. అనిత
దొండపర్తి(విశాఖ దక్షిణ): టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏనాడూ దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం మాట్లాడని దళిత ద్రోహి అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం కార్యదర్శి రోజారాణి ధ్వజమెత్తారు. టీడీపీలో యామిని, దివ్యవాణిలకు పట్టిన గతే అనితకు కూడా పడుతుందని మండిపడ్డారు. దళితులకు సంక్షేమ పథకాలు అందకుండా ఆమె అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని నిప్పులు చెరిగారు. బుధవారం విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో రోజారాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంకా ఆమె ఏమన్నారంటే.. భర్తపైనే అనిత రేప్ కేసు పెట్టింది.. అనిత మీడియా ముందుకు వచ్చి నీతులు చెబుతూ.. అబద్దాలు వల్లె వేస్తుంటే దెయ్యం బ్రేక్ డ్యాన్స్ చేసినట్లుంది. ఆమెకు నౌకల్లో రికార్డింగ్ డ్యాన్సులు చేయడం అలవాటు. చింతకాయల చింతామణి డ్రామా కంపెనీ, గంజాయి కంపెనీ, బ్రోకర్ల హౌస్‌కు ఓనర్లు.. అరగుండు అయ్యన్న, అనితలే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తపైనే రేప్ కేసు పెట్టిన తెంపరి.. అనిత. ఆమె మాట్లాడితే సూక్తులు, మేము మాట్లాడితే బూతులా?. బడుగు, బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను, వైఎస్సార్సీపీని విమర్శించే స్థాయి అనితకు లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే ఇంటికి వచ్చి మరీ తగిన శాస్తి చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచేసిన భూములకు అనిత సమాధానం చెప్పాలి. ఆమె అరాచకాలు, నడిపే కంపెనీలపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలి. అనితకు కూడా యామిని, దివ్యవాణిలకు పట్టిన గతే.. అనిత రూ.70 లక్షలు ఖర్చు పెట్టి ఏ సర్జరీ చేయించుకుందో తెలియదు గానీ, డబ్బులు ఎగ్గొట్టినందుకు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు కబ్జా చేస్తే.. అక్కడ అనిత బానిసలా బతుకుతోంది. టీడీపీలో మహిళలకు ఏపాటి గౌరవం ఇస్తున్నారో.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన యామిని, దివ్యవాణిలను అడిగితే చెబుతారు. కుక్కలు చింపిన విస్తరిలా మార్చి అనితను కూడా టీడీపీ నుంచి తరిమేస్తారు. సీఎం వైఎస్ జగన్ మహిళలకు అన్ని పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి.. అత్యున్నత పదవుల్లో కూర్చోబెట్టారు. అమ్మఒడి మీద మాట్లాడే అర్హత పట్టాభికి లేదు.. విద్యార్థుల డబ్బులు దోచేసిన దొంగ పట్టాభికి అమ్మఒడి పథకంపై మాట్లాడే అర్హత లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియంతోపాటు బైజూస్ ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తుంటే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తుప్పునాయుడు, పప్పునాయుడు, ఇతర టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. -
పెళ్లికిముందే వరకట్న కాటు: యువతి బలి
ఆత్మకూరు: పెళ్లి కాకముందే వరకట్న వేధింపులు ఒక నిండు జీవితాన్ని బలి తీసుకున్నాయి. నిశ్చితార్థం సమయంలో కట్నకానుకలు మాట్లాడుకున్నారు. పెళ్లిలో ఒప్పుకున్న కట్నం నగదు మొత్తం ఇవ్వాలంటూ ఓ యువకుడు వేధించగా.. ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్ జిల్లా ఆత్మకూరులో గు రువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు. ఆత్మకూరుకు చెందిన మార్త శంకర్-రమ దంపతుల ఏకైక కుమార్తె రోజారాణి(21) పీజీ, బీఈడీ పూర్తి చేసింది. ఆమెకు నా లుగు నెలల క్రితం దుగ్గొండి మండలం మైసంపల్లెకు చెందిన ఎంఫార్మసీ పూర్తిచేసిన బిట్ల శ్రావణ్‌కుమార్‌తో వివాహం నిశ్చయించారు. వీరు బంధువులే. నిశ్చితార్థ సమయంలో రూ. 5 లక్ష లు ఇచ్చిన రోజారాణి తల్లిదండ్రులు రూ. 2 లక్షలు వివాహం సమయంలో, ఆ తర్వాత కొం తకాలానికి రూ. 6 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నా రు. అలాగే, ఈనెల 18న పెళ్లి ముహూర్తం కూ డా నిశ్చయించారు. అయితే, పెళ్లి సమయంలో మొత్తం కట్నం ఇవ్వాలని, లేకుంటే పెళ్లి ఆపుతానని శ్రావణ్‌కుమార్ తరచూ ఫోన్లో ఆమెను వేధించసాగాడు. గురువారం ఇరువర్గాల వారు పెళ్లి దుస్తుల కోసం హన్మకొండకు వెళ్లారు. చెప్పులు కొనుక్కునేందుకు శ్రావణ్, రోజారాణి వెళ్లగా, అక్కడ కూడా డబ్బుల విషయంలో ప్రస్తావించాడు. దీంతో మనస్తాపానికి గురైన రోజారాణి గురువారం అర్ధరాత్రి తర్వాత ఇంటిపైకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకుంది. బాధ భరించలేక అరుస్తూ డాబా పైనుంచి కిందకు దూకగా.. స్థానికులు, తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ శుక్రవారం మృతి చెందింది. అయితే, కట్నం డబ్బు కోసం శ్రావణ్ వేధించడం వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి చేసిన శంకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.