చింతకాయల చింతామణి.. అనిత | YSRCP Leader Rojarani comments on TDP Leaders | Sakshi
Sakshi News home page

చింతకాయల చింతామణి.. అనిత

Jun 30 2022 4:52 AM | Updated on Jun 30 2022 7:51 AM

YSRCP Leader Rojarani comments on TDP Leaders - Sakshi

మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కార్యదర్శి రోజారాణి. చిత్రంలో పార్టీ నేతలు

దొండపర్తి(విశాఖ దక్షిణ): టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏనాడూ దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం మాట్లాడని దళిత ద్రోహి అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కార్యదర్శి రోజారాణి ధ్వజమెత్తారు. టీడీపీలో యామిని, దివ్యవాణిలకు పట్టిన గతే అనితకు కూడా పడుతుందని మండిపడ్డారు. దళితులకు సంక్షేమ పథకాలు అందకుండా ఆమె అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని నిప్పులు చెరిగారు. బుధవారం విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రోజారాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంకా ఆమె ఏమన్నారంటే..

భర్తపైనే అనిత రేప్‌ కేసు పెట్టింది..
అనిత మీడియా ముందుకు వచ్చి నీతులు చెబుతూ.. అబద్దాలు వల్లె వేస్తుంటే దెయ్యం బ్రేక్‌ డ్యాన్స్‌ చేసినట్లుంది. ఆమెకు నౌకల్లో రికార్డింగ్‌ డ్యాన్సులు చేయడం అలవాటు. చింతకాయల చింతామణి డ్రామా కంపెనీ, గంజాయి కంపెనీ, బ్రోకర్ల హౌస్‌కు ఓనర్లు.. అరగుండు అయ్యన్న, అనితలే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తపైనే రేప్‌ కేసు పెట్టిన తెంపరి.. అనిత. ఆమె మాట్లాడితే సూక్తులు, మేము మాట్లాడితే బూతులా?. బడుగు, బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ను, వైఎస్సార్‌సీపీని విమర్శించే స్థాయి అనితకు లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే ఇంటికి వచ్చి మరీ తగిన శాస్తి చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచేసిన భూములకు అనిత సమాధానం చెప్పాలి. ఆమె అరాచకాలు, నడిపే కంపెనీలపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలి. 

అనితకు కూడా యామిని, దివ్యవాణిలకు పట్టిన గతే.. 
అనిత రూ.70 లక్షలు ఖర్చు పెట్టి ఏ సర్జరీ చేయించుకుందో తెలియదు గానీ, డబ్బులు ఎగ్గొట్టినందుకు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు కబ్జా చేస్తే.. అక్కడ అనిత బానిసలా బతుకుతోంది. టీడీపీలో మహిళలకు ఏపాటి గౌరవం ఇస్తున్నారో.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన యామిని, దివ్యవాణిలను అడిగితే చెబుతారు. కుక్కలు చింపిన విస్తరిలా మార్చి అనితను కూడా టీడీపీ నుంచి తరిమేస్తారు. సీఎం వైఎస్‌ జగన్‌ మహిళలకు అన్ని పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి.. అత్యున్నత పదవుల్లో కూర్చోబెట్టారు.

అమ్మఒడి మీద మాట్లాడే అర్హత పట్టాభికి లేదు..
విద్యార్థుల డబ్బులు దోచేసిన దొంగ పట్టాభికి అమ్మఒడి పథకంపై మాట్లాడే అర్హత లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియంతోపాటు బైజూస్‌ ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తుంటే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తుప్పునాయుడు, పప్పునాయుడు, ఇతర టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement