breaking news
Robert Godwin
-
సూసైడ్ చేసుకున్న నరహంతకుడు
వాషింగ్టన్: ఓ వద్ధుడిని అతిక్రూరంగా హత్యచేస్తూ ఆ వీడియోను ఫేస్ బుక్ లైవ్ లో ప్రసారం చేసిన ఘరానా హంతకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టీవ్ స్టెఫెన్స్ అనే నరహంతకుడు రాబర్ట్ గాడ్విన్ అనే 74 ఏళ్ల వ్యక్తిని గత ఆదివారం తుపాకీతో కాల్చి హత్యచేస్తూ వీడియో లైవ్ స్ట్రీమ్ పెట్టాడు. గతంలో ఎంతో మందిని హత్యచేశానని, మరికొంత మందిని హత్య చేయనున్నట్లు హెచ్చరించిన నిందితుడు అకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడ్డాడని పెన్సిల్వేనియా రాష్ట్ర ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. ఒక్క హత్యతో అమెరికాలో సంచలనం సృష్టించిన నిందితుడు స్టీవ్ స్టీఫెన్స్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తనకు మరోదారి లేదని గ్రహించిన స్టీఫెన్స్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హత్యకుగురైన గాడ్విన్కు నిందితుడు స్టీఫెన్స్కు పరిచయం లేదని, అయితే ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడో తెలియడం లేదన్నారు. గతంలో ఎంతో మందిని హత్యచేసినట్లు స్టీఫెన్స్ పేర్కొన్నప్పటికీ అతడిపై గతంలో ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు, నేర చరిత్ర లేదని క్లీవ్ లాండ్ అధికారులు మీడియా సమావేశంలో వివరించారు. రిటైర్డ్ ఉద్యోగి అయిన గాడ్విన్ ఈస్టర్ ఈవెంట్‌ను తన కొడుకు, కోడలుతో కలిసి జరుపుకున్నాడు. అనంతరం కొన్ని నిమిషాల్లోనే హత్యకు గురయ్యాడు. 'ఆ నిందితుడిని నేను క్షమించి వదిలేస్తున్నాను. అతడిపై మాకు ఎలాంటి ద్వేషం లేదు' అని హత్యకు గురైన గాడ్విన్ కుమారుడు రాబీ మిల్లర్ అన్నాడు. -
మర్డర్‌ను ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్ చేశాడు
-
మర్డర్‌ను ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్ చేశాడు
ఓహియో: ఓ వద్ధుడిని అతిక్రూరంగా మర్డర్ చేస్తూ ఆ వీడియోను ఫేస్ బుక్ లైవ్ లో బ్రాడ్ కాస్ట్ చేశాడు ఓ ఘరానా హంతకుడు. అమెరికాలోని ఓహియోలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టీవ్ స్టెఫెన్స్ అనే నరహంతకుడు, రాబర్ట్ గాడ్విన్ అనే 74 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడు. ఈ హత్యను ఫేస్ బుక్ లో లైవ్‌లో చూపించాడు. రాబర్ట్ గాడ్విన్ హత్య కంటే ముందు తాను మరో 13 మందిని హత్య చేసినట్టు, మరింతమంది తాను చంపబోతున్నట్టు ఫేస్ బుక్ లో మరో పోస్టులో హెచ్చరించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ నరరూపహంతకుడిని పట్టుకునే పనిలో పడ్డారు. అయితే ఈ హంతకుడు ఎందుకు మర్డర్లు చేస్తున్నాడో కూడా తెలియడం లేదని, రాండమ్ గా రాబర్ట్ ను టార్గెట్ చేసి, ఆయన్ని హతమార్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒకవ్యక్తిని మాత్రమే మర్డర్ చేసినట్టు తాము గుర్తించామని, మిగతా బాధితులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదని క్లేవ్ ల్యాండ్ పోలీసు చీఫ్ కాల్విన్ విలియమ్స్ తెలిపారు. ఈస్టర్ మీల్ ముగించుకున్న ఇంటికి వెళ్తున్న రాబర్ట్ ను అతను చంపినట్టు పేర్కొన్నారు. ఇది చాలా క్రూరమైన హత్యగా పరిగణించిన ఫేస్ బుక్ అధికారప్రతినిధి, ఇలాంటి కంటెంట్ తమ ఫేస్ బుక్ లో రాకుండా చూసుకుంటామని చెప్పారు. ఫేస్బుక్ ను సురక్షితమైన వాతావరణంగా ఉంచేందుకు తాము కృషిచేస్తామన్నారు. దారుణంగా హత్యకు పాల్పడుతూ వాటిని ఫేస్బుక్ పోస్టు చేయడం ఇదేమి మొదటిసారి కాదు. గతేడాది జూన్ లో కూడా ఫేస్బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ వీడియో తీస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ గుర్తుతెలియని వ్యక్తిని 16 సార్లు షూట్ చేసిన ఘటన ఫేస్బుక్ లైవ్ లో స్ట్రీమ్ అయింది. ఫేస్బుక్ లైవ్-స్ట్రీమింగ్ ఫీచర్‌తో ఏ వాస్తవ ఘటననైనా బ్రాడ్ కాస్ట్ చేసుకునే వీలును కంపెనీ కల్పించింది.దీంతో మర్డర్డు, అత్యాచారాలను కొంతమంది ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు.