సూసైడ్ చేసుకున్న నరహంతకుడు | Facebook murder suspect commits suicide in Pennsylvania, says officials | Sakshi
Sakshi News home page

సూసైడ్ చేసుకున్న నరహంతకుడు

Apr 18 2017 11:57 PM | Updated on Jul 26 2018 12:59 PM

సూసైడ్ చేసుకున్న నరహంతకుడు - Sakshi

సూసైడ్ చేసుకున్న నరహంతకుడు

ఓ వద్ధుడిని అతిక్రూరంగా హత్యచేస్తూ ఆ వీడియోను ఫేస్ బుక్ లైవ్ లో ప్రసారం చేసిన ఘరానా హంతకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వాషింగ్టన్:  ఓ వద్ధుడిని అతిక్రూరంగా హత్యచేస్తూ ఆ వీడియోను ఫేస్ బుక్ లైవ్ లో ప్రసారం చేసిన ఘరానా హంతకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టీవ్ స్టెఫెన్స్ అనే నరహంతకుడు రాబర్ట్ గాడ్విన్ అనే 74 ఏళ్ల వ్యక్తిని గత ఆదివారం తుపాకీతో కాల్చి హత్యచేస్తూ వీడియో లైవ్ స్ట్రీమ్ పెట్టాడు. గతంలో ఎంతో మందిని హత్యచేశానని, మరికొంత మందిని హత్య చేయనున్నట్లు హెచ్చరించిన నిందితుడు అకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడ్డాడని పెన్సిల్వేనియా రాష్ట్ర ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు.
 
ఒక్క హత్యతో అమెరికాలో సంచలనం సృష్టించిన నిందితుడు స్టీవ్ స్టీఫెన్స్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తనకు మరోదారి లేదని గ్రహించిన స్టీఫెన్స్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హత్యకుగురైన గాడ్విన్‌కు నిందితుడు స్టీఫెన్స్‌కు పరిచయం లేదని, అయితే ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడో తెలియడం లేదన్నారు.

గతంలో ఎంతో మందిని హత్యచేసినట్లు స్టీఫెన్స్‌ పేర్కొన్నప్పటికీ అతడిపై గతంలో ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు, నేర చరిత్ర లేదని క్లీవ్ లాండ్ అధికారులు మీడియా సమావేశంలో వివరించారు. రిటైర్డ్ ఉద్యోగి అయిన గాడ్విన్ ఈస్టర్ ఈవెంట్‌ను తన కొడుకు, కోడలుతో కలిసి జరుపుకున్నాడు. అనంతరం కొన్ని నిమిషాల్లోనే హత్యకు గురయ్యాడు. 'ఆ నిందితుడిని నేను క్షమించి వదిలేస్తున్నాను. అతడిపై మాకు ఎలాంటి ద్వేషం లేదు' అని హత్యకు గురైన గాడ్విన్ కుమారుడు రాబీ మిల్లర్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement