సైకాలజికల్ థ్రిల్లర్‌తో వస్తున్నఅనుపమ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తన పుట్టినరోజు(ఫిబ్రవరి 18) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. పాన్-ఇండియా రేంజ్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అనుపమ, ఇప్పుడు ఒక ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.గతంలో అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు ఆర్జే షాన్ కాంబినేషన్లో వచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే హిట్ జోడీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ ఫీచర్ ఫిల్మ్‌పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. నేషనల్ లెవల్లో రుస్తుం, ప్యాడ్ మ్యాన్, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా, బెంచ్‌మార్క్ స్టోరీటెల్లర్స్ మరియు ఎస్ కే గీ (Ess Kay Gee) ఎంటర్టైన్మెంట్ సంస్థలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.