breaking news
relay deeksha
-
అమరావతి జేఏసీ వెబినార్ అట్టర్ ఫ్లాప్
తాడికొండ: అమరావతి రాజధాని పేరిట జేఏసీ చేస్తున్న బినామీ దీక్షల వెబినార్ అట్టర్‌ఫ్లాప్ అయిందని, దాదాపు రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా.. 200 మంది కూడా హాజరు కాలేదని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 213వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నాయకులు ప్రసంగించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేస్తూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో 500 రోజుల ఉత్సవాలు జరిగాయని, 29 గ్రామాల్లో ప్రజల మద్దతు ఉందంటూ వెబినార్‌లో ఉత్సవాలు నిర్వహించి ఎల్లో మీడియాలో ప్రజలను నమ్మించేందుకు నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అమరావతి జేఏసీ పేరిట కుల విభజన చేసి దళితులకు ఓ జేఏసీ, తన కులస్తులకు మరో జేఏసీ పెట్టి మరోసారి మోసం చేశాడన్నారు. బహుజనులంతా ఏకమై 213 రోజులుగా ఉద్యమం చేస్తుంటే.. దానిని నిర్వీర్యం చేసేందుకు కోర్టులు, వ్యవస్థలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాటకాలాడడం సిగ్గుచేటన్నారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత ఏసీబీ కస్టడీకి ధూళిపాళ్ల -
9వ రోజు రిలే దీక్షలు
-
రాష్ట్రమంతా వికేంద్రీకరణను స్వాగతిస్తోంది
-
ఏపీలో ప్రత్యేక హోదా కోసం 2వ రోజు రిలే దీక్షలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చేపట్టిన ఈ దీక్షలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ దీక్షలో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు భారీగా ప్రజలు పాల్గొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా : ఉండి : ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ నేత పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పాలకొల్లు : స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. తణుకు : తణుకులో వైఎస్ఆర్ సీపీ నేత కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. గోపాలపురం : తానేటి వనిత ఆధ్వర్యంలో రిలే దీక్షలు. అనంతపురం జిల్లా : తాడిపత్రి : వైఎస్ఆర్ సీపీ నేత వీఆర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో. అలాగే పార్టీ నేత రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. మండపేట : మండపేటలో వేగుళ్ల పట్టాభిరామయ్య, లీలాకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ. అనంతరం రిలే దీక్ష. పి.గన్నవరం : కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అనంతరం రిలే దీక్ష. అనపర్తి : డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో భిక్షాటన. రాజమండ్రి రూరల్ : ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. కడియం : గిరిజాల వెంకటస్వామినాయుడు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు. అమలాపురం : మాజీ మంత్రి పి.విశ్వరూప్, చిట్టబ్బాయి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రామచంద్రాపురం : ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. ముమ్మడివరం: గుత్తుల సాయి ఆధ్వర్యంలో రెండోరోజు రిలే దీక్షలు. రాజోలు : బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రంపచోడవరం : ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రాజానగరం : జక్కంపూడి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. జగ్గంపేట : ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. కృష్ణాజిల్లా : పెడన : బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ సీపీ నేత ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నందిగామ: జగన్మోహన్రావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. తిరువూరు: ఎమ్మెల్యే రక్షానిధి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. గుంటూరు జిల్లా : బాపట్ల : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోనా రఘుపతి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. మాచర్ల : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. గుంటూరు : నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. మంగళగిరి : ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రేపల్లె : మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నెల్లూరు జిల్లా : ఆమంచర్ల : ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరవాలంటూ అమంచర్లలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో గంటానాథం. చిత్తూరు జిల్లా : సత్యవేడు : సత్యవేడులో పార్టీ నేతలు ఆదిమూలం మునిశేఖర్‌రెడ్డి, సుశీల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్ష. కుప్పం : కుప్పంలో వైఎస్ఆర్ సీపీ నేతల రిలే దీక్షలు పలమనేరు : ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు జీడీ నెల్లూరు: స్థానిక ఎమ్మెల్యే నారాయణస్వామి ఆధ్వర్యంలో రిలే దీక్షలు పూతలపట్టు: ఎమ్మెల్యే సునీల్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. బి.కోట : వైఎస్ఆర్ సీపీ నేతల రిలే దీక్షలు వైఎస్ఆర్ జిల్లా : జమ్మలమడుగు : హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కర్నూలు జిల్లా : బనగానపల్లె : వైఎస్ఆర్ సీపీ నేత కాటసాని రాంరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు. నంద్యాల : భూమా నాగిరెడ్డి ఆధ్వర్యలో రిలే దీక్షలు. అళ్లగడ్డ: అఖిలప్రియ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. కర్నూలు: స్థానిక ధర్నా చౌక్ వద్ద ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. కల్లూరు : గౌరు సరిత ఆధ్వర్యంలో రిలే దీక్షలు. -
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ రిలే దీక్షలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు... కార్యకర్తలు శనివారం చేపట్టిన రిలే దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రారంభమైనాయి. ఈ నెల 21వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ దీక్షలు చేపట్టనున్నారు. అలాగే ఈ నెల19న ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టనున్నాయి. అందులోభాగంగా ఆర్టీసీ డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేయనున్నాయి. ఈ నెల 20వ తేదీ సాయంకాలం నియోజకర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షల వివరాలు... అనంతపురం జిల్లా: రాయదుర్గం : మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. తాడిపత్రి : స్థానిక వైఎస్ఆర్ సీపీ నేతలు చేపట్టిన రిలే దీక్షలకు మద్దతు తెలిపిన సీపీఐ నేతలు నర్సింహయ్య, రంగయ్య. అలాగే రాజధాని శంకుస్థాపనకు వెళ్లకూడదన్న వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సీపీఐ నేతలు ఈ సందర్బంగా స్వాగతించారు. వైఎస్ జగన్ నిర్ణయం అభినందనీయమన్నారు. కల్యాణదుర్గం: వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. మడకశిర : పార్టీ సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. కర్నూలు జిల్లా : కర్నూలు : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జి.జయరామ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. బనగానపల్లె : స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రాంరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నంద్యాల : పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. కడప జిల్లా: కడప : ప్రత్యేక హోదా కోరుతూ పులివెందుల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రిలే దీక్షలు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రైల్వే కోడూరు : స్థానిక గాంధీ విగ్రహాం వద్ద వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి బండారు సుభద్రమ్మ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రొద్దుటూరు : స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు బద్వేల్ : పట్టణంలో వైఎస్ఆర్ సీపీ నేత బీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు జమ్మలమడుగు : వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చిత్తూరు జిల్లా : తిరుపతి: స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే దీక్షలు... పాల్గొన్న స్థానిక ఎంపీ వర ప్రసాద్, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మమత. జీడీ నెల్లూరు : ఎమ్మెల్యే నారాయణ స్వామి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పీలేరు : స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పలమనేరు : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అమర్నాధ్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. సత్యవేడు : స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత ఆదిమూలం, మునిశేఖర్‌రెడ్డి, రాధారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నెల్లూరు జిల్లా : ఇందుకూరుపేట : ఇందుకూరుపేటలో వైఎస్ఆర్ సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. ప్రకాశం జిల్లా : పరుచూరు : నియోజకవర్గం ఇంఛార్జ్ గొట్టిపాటి భరత్‌కుమార్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. గిద్దలూరు : ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం. అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. గుంటూరు జిల్లా : రేపల్లె : వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆధర్వంలో రిలే దీక్షలు, పాల్గొన్న కౌన్సిలర్లు, కార్యకర్తలు. అమరావతి : స్థానిక పార్టీ సమన్వయకర్త పాణెం అనిమిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. చిలకలూరిపేట: గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.. పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లు. గుంటూరు : నగరంలోని కొత్త బస్టాండ్ ఎదుట వైఎస్ఆర్ సీపీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. వినుకొండ : స్థానిక పార్టీ ఇంచార్జీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు. మాచర్ల : స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. కృష్ణాజిల్లా : పెడన : పెడన బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ సీపీ నేత రాంప్రసాద్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు. మైలవరం : నియోజకర్గం ఇంఛార్జ్ జోగి రమేష్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా : కొయ్యలగూడెం : వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నరసాపురం : వైఎస్ఆర్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. తూర్పుగోదావరి జిల్లా : జగ్గంపేట : స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, నవీన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. కడియపులంక: స్థానిక జాతీయ రహదారిపై దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ సీపీ నేత ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. ముమ్మడివరం : స్థానిక నాయకుడు గుత్తుల సాయి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రాజమండ్రి : స్థానిక కోటగుమ్మం సెంటర్లో వైఎస్ఆర్ సీపీ నేత, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వరంలో రిలే దీక్షలు. రంపచోడవరం : వైఎస్ఆర్ సీపీ నేత, పార్టీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నాయకులు ఉదయ్ భాస్కర్, బాలకృష్ణ పాల్గొన్నారు. మండపేట : స్థానిక నాయకుడు పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రామచంద్రాపురం : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పి. గన్నవరం : పార్టీ నేత కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రాజోలు : బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పిఠాపురం : పార్టీ సమన్వయ కర్త పెండెం దొరబాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. విశాఖపట్నం జిల్లా : విశాఖ కలెక్టరేట్ : వైఎస్ఆర్ సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, కోలా గురువులు, జాన్ వెస్లీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. ఇసుకతోట : పార్టీ నేతలు వంశీకృష్ణ శ్రీనివాస్, కొయ్య ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. గురుద్వార్ : వైఎస్ఆర్ సీపీ నేతలు ఉషాకిరణ్, రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు ఎన్ఏడీ కొత్త రోడ్డు : మాజీ ఎమ్మెల్యే మళ్లా విజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు పెందుర్తి : పార్టీ నేత ఆదీప్ రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు అనకాపల్లి : ఆర్డీవో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత ఆధ్వర్యలో రిలే దీక్షలు పాడేరు : రిలే దీక్షను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ తగరపువలస: బీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ కర్రి సీతారం ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నర్సిపట్నం : నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమాశంకర్‌గణేశ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పాయకరావుపేట : నియోజకవర్గ ఇంఛార్జ్ చెంగల వెంకట్రావ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ఎలమంచిలి : నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు విజయనగరం జిల్లా : సాలూరు : స్థానిక ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో రిలే దీక్షలు శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం : పట్టణంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. టెక్కలి : నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పాతపట్నం : స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రణస్థలం : పార్టీ సమన్వయకర్త గొల్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. అముదాలవలస : పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పాలకొండ : స్థానిక ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రాజాం : స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.