breaking news
Referrals
-
Infosys: కెరీర్ గ్యాప్ మహిళలకు శుభవార్త..
కెరీర్లో గ్యాప్ మహిళలకు దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చక్కని అవకాశం కల్పిస్తోంది. వృత్తి జీవితానికి విరామం ఇచ్చి మళ్లీ ఉద్యోగ ప్రపంచంలో అడుగు పెట్టాలనుకుంటున్న మహిళల కోసం రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ అనే కొత్త రిఫరల్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. విజయవంతమైన రిఫరల్స్‌కు రూ .50,000 వరకు రివార్డులను కూడా అందించనున్నట్లు కంపెనీ ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్ పంపింది.అర్హతలు ఇవే..ఈ ప్రోగ్రామ్ కు అర్హత పొందడానికి, అభ్యర్థులు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. కనీసం ఆరు నెలల పాటు నిరంతర కెరీర్ గ్యాప్ ఉండాలి. అర్హులైనవారిని వివిధ టెక్నాలజీల్లో డెవలపర్లు, టెక్ లీడ్లు, మేనేజర్లుగా నియమించుకునేందుకు ప్రయత్నిస్తోందని, దీని గురించి తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ ఒక నివేదిక పేర్కొంది.రెఫర్ చేసినవారికి రివార్డులుఈఎస్జీ విజన్ 2030లో భాగంగా 2030 నాటికి 45 శాతం మహిళా ప్రాతినిధ్యాన్ని సాధించాలని ఇన్ఫోసిస్ లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఈఎస్జీ నివేదిక ప్రకారం.. కంపెనీలో ప్రస్తుతం సుమారు 3,23,000 మంది ఉద్యోగులలో మహిళలు 39% ఉన్నారు. దీంతో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగా కంపెనీ ఈ రిఫరల్ ప్రోత్సాహకాలను అందిస్తోంది. జాబ్ లెవల్ 3 (JL3) లో విజయవంతమైన నియామకాలకు రూ .10,000, జాబ్ లెవల్ 4కు రూ .25,000, జాబ్ లెవల్ 5కు రూ .35,000, జాబ్ లెవల్ 6 రెఫరల్స్‌కు రూ .50,000 రివార్డులను ఇన్ఫోసిస్ అందించనుంది.ఇదీ చదవండి: ‘టీసీఎస్‌లో బలవంతంగా రాజీనామా చేయమన్నారు’ -
నిధుల లభ్యత సులభం కావాలి
* ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టులకు ప్రత్యేక చ ట్టం చేయాలి * స్వతంత్ర నియంత్రణ సంస్థ ఏర్పాటు అవసరం * ఇన్ఫ్రా రంగ సంస్కరణలపై కేల్కర్ కమిటీ సిఫార్సులు న్యూఢిల్లీ: అరకొర మౌలిక సదుపాయాలు దేశ ఆర్థిక వృద్ధికి అవరోధాలుగా మారిన నేపథ్యంలో ఇన్ఫ్రా రంగానికి ఊతమిచ్చేలా తీసుకోవాల్సిన పలు చర్యలను అత్యున్నత స్థాయి కేల్కర్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టే ప్రాజెక్టులకు (పీపీపీ) నిధుల లభ్యత సులభతరంగా ఉండేలా చూడాలని పేర్కొంది. వైద్యం, పట్టణ ప్రాంతాల్లో రవాణా తదితర విభాగాల్లో చేపట్టే ఇటువంటి ప్రాజెక్టుల కోసం ప్రత్యేక చట్టం చేయాలని సూచించింది. అలాగే వివాదాల పరిష్కారానికి ట్రిబ్యున ల్‌నూ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన విజయ్ కేల్కర్ కమిటీ గత నెల సమర్పించిన నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం విడుదల చేసింది. మోడల్ కన్సెషన్ ఒప్పందాలను సమీక్షించాలని, జీరో కూపన్ బాండ్ల ద్వారా నిధులు సమీకరించుకునేందుకు అనుమతులివ్వాలని కమిటీ ఇందులో సూచించింది. అలాగే, ఆయా ప్రాజెక్టులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ ప్రాజెక్ట్ రివ్యూ కమిటీ (ఐపీఆర్సీ)ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వృద్ధి వేగవంతం అయ్యేందుకు ఇన్ఫ్రా రంగ పీపీపీ ప్రాజెక్టులు కీలకపాత్ర పోషించగలవని కేల్కర్ కమిటీ వివరించింది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన వ్యవస్థను రూపొం దించడం అత్యవసరమని పేర్కొంది. రిస్కులు ఎదురైతే ఏ పక్షం ఎంత భరించాల్సి ఉంటుందనేది స్పష్టంగా ముందుగానే గుర్తించాలని, పీపీపీ ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇచ్చేటప్పుడు ఆర్థిక ప్రయోజనాలు కాకుండా సేవలను అందుబాటులోకి తేవడమే కీలకం కావాలని కమిటీ సూచించింది. మరిన్ని సిఫార్సులు.. * మాజీ సుప్రీం కోర్టు జడ్జి లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ సారథ్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ అడ్జుడికేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. ఇందులో సాంకేతిక, ఆర్థిక నిపుణులు ఉండాలి. * ఐపీఆర్‌సీలో ఆర్థిక శాస్త్ర నిపుణులతో పాటు రంగానికి సంబంధించిన నిపుణులు (ఇంజినీర్లు), న్యాయ శాస్త్ర నిపుణులు ఒక్కొక్కరు చొప్పున ఉండాలి. * పీపీపీ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే విషయానికి సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జీరో కూపన్ బాండ్లను జారీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతివ్వాలి.