breaking news
Recruitment Examination
-
జార్ఖండ్‌లో 939 మంది విద్యార్థులపై కేసులు
రాంచీ: జార్ఖండ్‌లో నియామక పరీక్షల్లో అవకతవకలపై నిరసన తెలిపిన వందలాది మంది విద్యార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అధికార విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులతో ఘర్షణ పడటం వంటి ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ విషయమై 39 మంది పేరు తెలిసిన వ్యక్తులు, మరో 900 మందికి పైగా గుర్తుతెలియని వ్యక్తులపై గిరిధ్, హజారీబాగ్ జిల్లాల్లో మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నియామక పరీక్షల్లో అవకతవకలు జరిపాయని ఆరోపిస్తూ శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు నిరసన చేపట్టారు. అందులో భాగంగా గాంధీ మైదాన్‌లో విద్యార్థులు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దిష్టి»ొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో పాల్గొన్న 14 మంది పేరు తెలిసిన వ్యక్తులు, మరో 200 మంది గుర్తు తెలియని వ్యక్తులపై రాంచీలోని కోత్వాలీ పోలీస్స్టేషన్లోనూ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, వారిని గుర్తించేందుకు సీసీటీవీ, వీడియో ఫుటేజీలను విశ్లేషిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. నిరసనల సందర్భంగా నలుగురు ఎస్ఐలు సహా 8 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. -
నేహా బోరాపై సిరా దాడి
రాంచీ: జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా శుక్రవారం అసెంబ్లీ వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాను దేశద్రోహి అని ఆరోపిస్తూ ఒక వ్యక్తి ఆమెపై సిరా చల్లాడు. వామపక్ష విద్యార్థి సంఘాలైన ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్ మద్దతుదారులు, నిరసనకారులు అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళ్తుండగా బిర్సా చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. సిరా చల్లిన వ్యక్తిని అమర్నాథ్ పాండేగా గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశి్నస్తున్నారు. అయితే, ఇప్పటివరకు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. ఈ సిరా దాడి ఒక నాటకమేనని ప్రతిపక్ష బీజేపీ విమర్శించింది. అధికార జేఎంఎం నేతృత్వంలోని కూటమిలో భాగమైన సీపీఐ(ఎంఎల్) లిబరేషన్‌కు ఏఐఎస్ఏ విద్యార్థి విభాగమని గుర్తుచేసింది. ఉద్యమాన్ని బలహీనపర్చడానికి కుట్రలు తాజా సంఘటనపై నేహా బోరా స్పందించారు. ఢిల్లీలో నిరసనల సమయంలో పెల్లెట్ గన్ కాల్పులు, లాఠీచార్జిని ఎదుర్కొన్న తనకు ఈ సిరా దాడి వల్ల ఎలాంటి భయం కలగదని చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఆగ్రహాన్ని సిరాతో అణచివేయగలరా? అని ప్రశ్నించారు. ఉద్యమాన్ని బలహీనపర్చడానికి బీజేపీ–ఆర్ఎస్ఎస్ వర్గాలు కుట్రలు సాగిస్తున్నాయని దుయ్యబట్టారు. నిరసన ర్యాలీ నిర్వహిస్తుండగా హింసకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన ఢిల్లీ ఉద్యమంలో తాను భాగమైనందుకే ప్రతీకార చర్యగా బీజేపీ ఈ ఘటనకు పాల్పడిందని నేహా బోరా ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా జనసందోహం మధ్య నుంచి ఒక్కసారిగా ఒక వ్యక్తి బయటకు వచ్చి బోరాపై సిరా విసిరాడని ఏఐఎస్ఏ నాయకురాలు శివాని పేర్కొన్నారు. నిందితుడికి బీజేపీ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. నేహా బోరా దేశ వ్యతిరేకి అని నిందితుడు అమర్నాథ్ పాండే మండిపడ్డాడు. ఆమె ఉమర్ ఖలీద్ మద్దతుదారు అని ధ్వజమెత్తాడు. ఆసుపత్రికి రాహుల్ క్రాంతి తరలింపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అక్రమాలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఆరుగురు నిరసనకారుల ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నట్లు తెలిసింది. వారిలో రాహుల్ క్రాంతి అనే విద్యార్థి ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం రాంచీలోని సదర్ ఆసుపత్రిలో చేర్చినట్లు ఒక అధికారి తెలిపారు. రాహుల్ క్రాంతి మంగళవారం రాత్రి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రతిపక్ష నాయకుడు బాబూలాల్ మరాండి ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఇద్దరు మహిళలు సహా మొత్తం ఐదుగురు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల నిరసన శుక్రవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. రెండు విద్యార్థి సంఘాలు రాష్ట్ర అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించాయి. నియామక పరీక్షల్లో అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశాయి. 14వ జేపీఎస్సీ సివిల్ సరీ్వసెస్ పరీక్షను రద్దు చేయాలని, అవకతవకలపై సీబీఐ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తుల బృందం చేత స్వతంత్ర విచారణ జరిపించాలని తేల్చిచెప్పాయి. ప్రభుత్వంతో తొలి విడత చర్చలు ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకలపై జార్ఖండ్ ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఆందోళనను కొనసాగిస్తామని నిరసనకారులు తేల్చిచెప్పారు. జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయడంతోసహా తమ డిమాండ్లన్నీ నెరవేర్చే వరకూ ఆందోళనను విరమించబోమని పేర్కొన్నారు. ఆదివారం నాటికి తమ డిమాండ్లు నెరవేరకపోతే, ఆగస్టు 10న రాష్ట్ర అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, జేపీఎస్సీ/జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్‌కు చెందిన 10 మంది సభ్యుల ప్రతినిధి బృందానికి మధ్య శుక్రవారం రాత్రి మొదటి విడత చర్చలు జరిగాయి. జార్ఖండ్ ప్రభుత్వంతో చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, తమ డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని సంస్కరణల మంచ్ నాయకులు చెప్పారు. -
టీచర్ పోస్టులకు బ్రేక్.. ప్రభుత్వం సవాల్
లక్నో: ప్రైమరీ టీచర్ల నియామకాలు ఆపాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. టీచర్ల నియామకాల్లో నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఆ రాష్ట్ర ఎగ్జామినేషన్ రెగ్యులారిటీ అథారిటీ స్పష్టం చేసింది. ఈమేరకు ఇద్దరు జడ్జిల డివిజన్ బెంచ్‌లో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసింది. సింగిల్ జడ్జి తీర్పు అనవసర, చట్టవిరుద్ధమైందని పిటిషన్లో పేర్కొంది. కాగా, రాష్ట్రంలో ఇటీవల 69 వేల ప్రైమరీ టీచర్ పోస్టుల నియామకాలకు పరీక్షలు జరిగాయి. అయితే, ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లాయని, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయనే కారణాలతో.. నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని జస్టిస్ అలోక్ మాథుర్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ జూన్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక యూపీ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను జూన్ 9న డివిజనల్ బెంచ్ విచారించనుంది. -
అలహాబాద్ హైకోర్టులో 343 రివ్యూ ఆఫీసర్ పోస్టులు
అలహాబాద్ హైకోర్టు.. రివ్యూ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు ‘రివ్యూ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్-2016’ను నిర్వహించనుంది. ఖాళీల వివరాలు మొత్తం పోస్టులు 343. అయితే ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వ్ చేసిన 171 పోస్టుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఆయా కేటగిరీల వారినే నియమిస్తారు. ఇవి పోను మిగిలిన 172 పోస్టులకు మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు పోటీ పడాల్సి ఉంటుంది. వేతనం: రూ.9,300-34,800+గ్రేడ్‌పే రూ.4,800. విద్యార్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ; కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా/డిగ్రీ లేదా ఎన్ఐఈఎల్ఐటీ/డీఓఈఏసీసీ సొసైటీ జారీచేసిన ‘ఒ’ లెవల్ సర్టిఫికెట్ లేదా సీసీసీ సర్టిఫికెట్. డేటా ఎంట్రీ, వర్డ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం. వయసు: 2016, జూలై 1 నాటికి కనీసం 21 ఏళ్లు, గరిష్టం 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక విధానం: రెండు దశల్లో నిర్వహించే పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రెండున్నర గంటల (150 నిమిషాల) వ్యవధిలో జరిగే మొదటి దశ పరీక్షలో 200 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు (200 మార్కులు కేటాయించారు) జవాబులు గుర్తించాలి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఒక పోస్టుకు ఐదుగురు చొప్పున రెండో దశ పరీక్ష (కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్-సీకేటీ)కి ఎంపిక చేస్తారు. 15 నిమిషాల వ్యవధిలో జరిగే సీకేటీలో సుమారు 500 పదాలు గల ఇంగ్లిష్ కంటెంట్‌ను కంప్యూటర్లో కంపోజింగ్ (టైపింగ్) చేయాలి. దీనికి 50 మార్కులు కేటాయించారు. ఇందులో కనీసం 17 మార్కులు సాధించాలి. రాత పరీక్ష సిలబస్: జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం; భారత రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, సంస్కృతి, వ్యవసాయం, వాణిజ్యం, జనాభా, జీవావరణ శాస్త్రం; ప్రపంచ, భారత భూగోళశాస్త్రం, వనరులు; జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత గల వర్తమానాంశాలు; జనరల్ ఇంటెలిజెన్స్; ఉత్తరప్రదేశ్‌లోని విద్య, సంస్కృతి, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, వాణిజ్యం, జనజీవనం, సామాజిక సంప్రదాయాలు; గ్రాడ్యుయేషన్ స్థాయి సాధారణ ఆంగ్ల, హిందీ భాషల పరిజ్ఞానం, కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ముఖ్య తేదీలు 1.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2016. 2.ఇ-చలాన్ ద్వారా ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: డిసెంబర్ 16 వెబ్సైట్: www.allahabadhighcourt.in


