breaking news
rate fall
-
పసిడి పతనం.. వెండి జోరు!
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో గత వారం మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. ఒకవైపు పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టగా, మరోవైపు వెండి మాత్రం పరుగులు తీస్తోంది. మే 3 నాటికి ముగిసిన వారపు ట్రేడింగ్‌ను పరిశీలిస్తే, విలువైన లోహాల ధరల్లో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది.బంగారం బేజారు.. వెండి జోరు!అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం బంగారం ధరల్లో కొంత మేర సడలింపు కనిపించింది. అయితే, వెండి మాత్రం ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏప్రిల్ 27న రూ.1,53,710 ఉండగా మే 3 నాటికి అది రూ.1,50,930లకు దిగివచ్చింది. అంటే రూ.2,800 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏప్రిల్ 27న రూ.1,40,900 ఉండగా మే 3 నాటికి అది రూ.1,38,350లకు క్షీణించింది. అంటే రూ.2,550 కరిగింది.ఇక వెండి విషయానికి వస్తే కేజీ ధర ఏప్రిల్ 27న రూ.2,70,000 ఉండగా తగ్గుతూ పెరుగుతూ మే 3 నాటికి మళ్లీ రూ.2,70,000 వద్దకే వచ్చి ఆగింది. అయితే దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో మాత్రం వెండి ధర వారం మొత్తంలో కేజీకి రూ.5,000 పెరిగింది.ధరల ఒడిదుడుకులకు కారణాలుమార్కెట్ నిపుణులు, 'రాయిటర్స్' నివేదికల ప్రకారం, ప్రస్తుత ధరల మార్పులకు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.ప్రపంచ మార్కెట్ సంకేతాలు: అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ ఆర్థిక పరిస్థితులు పసిడి ధరపై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా 2026లో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.మారిన డిమాండ్: పారిశ్రామిక అవసరాల రీత్యా వెండికి డిమాండ్ పెరగడం దాని ధర పెరగడానికి ఊతమిచ్చింది. ఇదే సమయంలో బంగారంపై ఇన్వెస్టర్లు కొంత లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ధరల తగ్గుదలకు కారణమైంది.పెట్టుబడిదారుల ధోరణి: సురక్షితమైన పెట్టుబడిగా భావించే ఈ లోహాల విషయంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లపై నెలకొన్న అనిశ్చితి కూడా మార్కెట్ కదలికలను శాసిస్తోంది.ఇదీ చదవండి: ఇల్లు కొంటే.. ఇన్ని ఖర్చులా? -
ఎగుమతులకు ప్రోత్సాహకాలు: కేంద్రం
న్యూఢిల్లీ: ఎగుమతుల వృద్ధికి కేంద్రం ప్రోత్సాహకాలిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పేర్కొన్నారు. ఇక్కడ ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఎగుమతుల క్షీణ రేటు తగ్గుతున్నట్లు మే గణాంకాలు వెల్లడించాయన్నారు. 2014 డిసెంబర్ తరువాత మేలో అతితక్కువగా 0.79 శాతం క్షీణ రేటు నమోదయ్యిందన్నారు. ఇది సానుకూల పరిణామం అని వివరించారు. పరిస్థితి మరింత మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వడ్డీ సబ్వెన్షన్ రూపంలో లేదా మరో రకంగా కానీ ఎగుమతుల వృద్ధికి ప్రోత్సాహకాలు కల్పించాల్సిన తరుణం ఇదని కూడా ఆమె పేర్కొన్నారు.భారత్ ఎగుమతులు 18 నెలలుగా క్షీణతలో కొనసాగుతుండటం తెలిసిందే. చక్కెర ఎగుమతులపై 20% సుంకం విధింపుపై మాట్లాడుతూ, ఇది దేశీయంగా కమోడిటీ లభ్యతను మెరుగుపరుస్తుందని తెలిపారు.


