ఎగుమతులకు ప్రోత్సాహకాలు: కేంద్రం | Exports now recovering, fall has bottomed out: Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

ఎగుమతులకు ప్రోత్సాహకాలు: కేంద్రం

Jun 18 2016 12:31 AM | Updated on Sep 4 2017 2:44 AM

ఎగుమతుల వృద్ధికి కేంద్రం ప్రోత్సాహకాలిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: ఎగుమతుల వృద్ధికి కేంద్రం ప్రోత్సాహకాలిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పేర్కొన్నారు. ఇక్కడ ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఎగుమతుల క్షీణ రేటు తగ్గుతున్నట్లు మే గణాంకాలు వెల్లడించాయన్నారు. 2014 డిసెంబర్ తరువాత మేలో అతితక్కువగా 0.79 శాతం క్షీణ రేటు నమోదయ్యిందన్నారు. ఇది సానుకూల పరిణామం అని వివరించారు. పరిస్థితి మరింత మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వడ్డీ సబ్‌వెన్షన్ రూపంలో లేదా మరో రకంగా  కానీ ఎగుమతుల వృద్ధికి  ప్రోత్సాహకాలు కల్పించాల్సిన తరుణం ఇదని కూడా ఆమె పేర్కొన్నారు.భారత్ ఎగుమతులు 18 నెలలుగా క్షీణతలో కొనసాగుతుండటం తెలిసిందే. చక్కెర ఎగుమతులపై 20% సుంకం విధింపుపై మాట్లాడుతూ, ఇది దేశీయంగా కమోడిటీ లభ్యతను మెరుగుపరుస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement