breaking news
rare infection
-
అమ్మాయి చెవిలో వింత శబ్ధాలు! ఎంఆర్ఐలో ఏం కనిపించిందంటే..
ఆ అమ్మాయికి కొన్నాళ్లుగా చెవుల్లో నిరంతరం ఏవో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. మొదట్లో ఆమె ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజులు గడిచేకొద్దీ ఆ శబ్దాల తీవ్రత పెరగడంతో భయపడింది. రాత్రిళ్లు నిద్రకూడా పోయేది కాదు. తల్లిదండ్రులకు విషయం చెబితే.. మొదట్లో తేలికగా తీసుకున్నారు. సమస్య తగ్గకపోవడంతో ఆలోచనలో పడ్డారు. ఒకానొక టైంలో అతీంద్రియ శక్తులేమోనని అనుమానించే స్థాయికి వెళ్లారు. చివరకు బంధువుల సలహా మేరకు వైద్యులను సంప్రదించారు. అక్కడ.. రిపోర్టుల్లో వచ్చింది చూసి వైద్యులు.. వాళ్లు చెప్పింది తల్లిదండ్రులు.. కంగుతినాల్సి వచ్చింది.అది సాధారణ రింగింగ్ శబ్దం కాదు.. గుండె చప్పుడుకు అనుగుణంగా లయబద్ధంగా వినిపించే శబ్దం. 24 గంటలూ కొనసాగుతున్న ఈ సమస్య ఆమె రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేసింది.చెవిలో శబ్దం తగ్గకపోవడంతో తల్లిదండ్రులు పలువురు వైద్యులను సంప్రదించారు. పరీక్షల్లో వాళ్లకేం తేడా కనిపించలేదు. ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగా భావించారు. మందులు వాడినప్పుడు కొంత ఉపశమనం కనిపించినా.. కొద్దిరోజులకు మళ్లీ అదే సమస్య మొదలైంది. చివరకు మరింత లోతుగా పరీక్షలు నిర్వహించగా.. అసలు కారణం బయటపడింది.బాలికకు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించగా.. ఆ రిపోర్టులో ఊహించని విషయం బయటపడింది. సాధారణ చెవి సమస్యగా భావించిన ఈ లక్షణం వెనుక మెదడులోని రక్తనాళానికి సంబంధించిన అరుదైన సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఎంఆర్ఐ వెనోగ్రామ్ పరీక్షలో మెదడులోని ఓ ప్రధాన రక్తనాళం ట్రాన్స్వర్స్ వీనస్ సైనస్ సన్నబడినట్లు వైద్యులు గుర్తించారు. ఈ రక్తనాళ సమస్య కారణంగానే చెవిలో గుండె చప్పుడులా శబ్దం వినిపిస్తున్నట్లు నిర్ధారించారు.వైద్య భాషలో దీన్ని యూనిలేటరల్ పల్సటైల్ టిన్నిటస్(Unilateral Pulsatile Tinnitus) అంటారు. సాధారణ టిన్నిటస్లో చెవిలో గంట మోగుతున్నట్లు అనిపిస్తే.. ఈ సమస్యలో రక్తప్రసరణకు అనుగుణంగా శబ్దం వినిపిస్తుంది. అయితే ఎంఆర్ఐ రిపోర్ట్ తర్వాత బాలిక మెడలోని జుగ్యులర్ వీన్ను కొద్దిసేపు నొక్కినప్పుడు చెవిలో శబ్దం తగ్గిపోయింది. దీంతో సమస్య వెనుక రక్తనాళ సంబంధిత కారణం ఉందని వైద్యులు గుర్తించారు.సన్నబడిన రక్తనాళాన్ని సరిచేసేందుకు వైద్యులు వీనస్ సైనస్ స్టెంటింగ్ శస్త్రచికిత్స నిర్వహించారు. చికిత్స అనంతరం బాలిక చెవిలో వినిపిస్తున్న శబ్దం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు తనకేం సౌండ్లు వినిపించడం లేదని ఆ బాలిక అంటోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో వైద్యం రంగానికి సంబంధించిన ఈ అరుదైన ఘటన ఘటన.ఒకే చెవిలో నిరంతరం గుండె చప్పుడుకు అనుగుణంగా శబ్దం వినిపిస్తే.. దాన్ని సాధారణ సమస్యగా భావించకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చెవి వైద్యులతో పాటు న్యూరాలజీ, రక్తనాళ నిపుణులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.ఇదీ చదవండి: వెనక నుంచి కౌగిలించుకుంటే.. కన్నీళ్లు పెట్టుకున్నాడు -
కడుపునొప్పితో వెళ్లి.. కంగుతిన్నాడు!
వాషింగ్టన్: తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ పేషెంట్‌కు డాక్టర్లు చికిత్స చేశారు. చికిత్స తర్వాత కొన్ని గంటలకు కళ్లు తెరిచిన పెషేంట్ తనకు కనిపించిన దృశ్యానికి షాక్ తిన్నాడు. ఎందుకుంటే అతడి కాళ్లు, చేతులు ఇప్పుడు కనిపించడం లేదు. అవును.. డాక్టర్లు అతడికి చికిత్స చేసి వాటిని తొలగించారు. అసలేం జరిగిందంటే.. అమెరికాలోని మిచిగన్ రాష్ట్రానికి చెందిన కెవిన్ బ్రీన్ అనే 44 ఏళ్ల వ్యక్తికి కొద్దిరోజులుగా కడుపునొప్పి సమస్య ఉంది. భార్య జూలీ బ్రీన్‌తో పాటు చెకప్ కోసం హాస్పటల్‌కు వెళ్లాడు. డాక్టర్ల పరీక్షలు ఫలితాలన్నీ నెగటీవ్ అని వచ్చాయి. మొదట కొన్ని టాబ్లెట్లు రాసిచ్చారు వైద్యులు. అవి వాడిన తర్వాత కెవిన్ కడుపునొప్పి తీవ్రమైంది.. తప్ప తగ్గలేదు. ఇక లాభం లేదని భావించిన డాక్టర్లు పెషేంట్ శరీరాన్ని పూర్తిగా పరీక్షించి కంగుతిన్నారు. ఎందుకంటే కెవిన్ కడుపులో దాదాపు ఒకటిన్నర లీటర్ల చీము ఉందని గుర్తించారు. అందువల్లే అతడి అవయవాల పనితీరు తగ్గడంతో పాటు తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. కొన్ని సర్జరీలు చేస్తే అతని సమస్య తీరుతుందని వైద్యులు కెవిన్ భార్యకు చెప్పారు. భర్త ప్రాణాలే ముఖ్యమని జూలీ బ్రీన్ డాక్టర్లకు చెప్పింది. సర్జరీ పూర్తయిన తర్వాత కళ్లు తెరిచిన కెవిన్ భయంకరమైన నిజాన్ని చూడాల్సి వచ్చింది. సర్జరీలో భాగంగా అతడి రెండు కాళ్లు, ఎడమ చెయ్యి, మరో చేతివేళ్లను తొలగించారు. చాలా అరుదైన ఇన్ఫెక్షన్ అని, సర్జరీ చేయకపోతే ప్రాణాలు దక్కవని చెప్పినందువల్లే సర్జరీ చేయాలని డాక్టర్లకు చెప్పినట్లు భర్తకు జూలీ బ్రీన్ వివరించింది.


