rarandoy veduka chuddam
-
హిందీలో ఫేట్ మారుతుందా?
‘రారండోయ్..వేడుక చూద్దాం’ సినిమాలో భ్రమరాంబ క్యారెక్టర్లో రకుల్ ఎంత సందడి చేశారో ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఇప్పడు ఈ టాలీవుడ్ భ్రమరాంబ బాలీవుడ్లో తన లక్‌ను మరోసారి చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ‘యారియాన్’ మూవీతో రకుల్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ‘సిమ్లా మిర్చి’ అనే మరో బాలీవుడ్ మూవీకి సైన్ చేసినప్పటికీ ఈ ప్రాజెక్ట్ సరైన దిశలో సాగడం లేదు. బాలీవుడ్లో పరిస్థితి తారుమారుగా ఉన్నా తెలుగులో మాత్రం రకుల్ కెరీర్ సూపర్. ఇక్కడ ఎలానూ స్టార్ హీరోయిన్ అనిపించు కున్నారు కాబట్టి, బాలీవుడ్లో కూడా ఆ పేరు తెచ్చుకోవాలను కుంటున్నారామె. కరెక్ట్‌గా ఇదే టైమ్‌లో బాలీవుడ్ నుంచి రకుల్‌కి ఓ ఛాన్స్ వచ్చిందని ఫిల్మ్‌నగర్ టాక్. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నీరజ్ పాండే డైరెక్షన్లో రూపొందనున్న సినిమాలో రకుల్‌ను హీరోయిన్గా సెలక్ ్టచేశారట. ‘వెడ్నస్ డే’, ‘బేబీ’, ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరి’ వంటి హిట్ చిత్రాలకు నీరజ్ పాండేనే దర్శకుడు కావడంతో రకుల్ వెంటనే ఓకే చెప్పారని బాలీవుడ్ టాక్. ఈ చిత్రంతో అయినా బాలీవుడ్లో రకుల్ ఫేట్ మారాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు. -
మా వేడుక కలర్ఫుల్గా ఉంటుంది!
‘‘టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా ఓ ఫెస్టివల్‌లా ఉంటుంది. నేను ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని నాగచైతన్య అన్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నాగార్జున నిర్మించిన చిత్రం ‘రారండోయ్... వేడుక చూద్దాం’. నేడు ఈ చిత్రం విడుదల సందర్భంగా నాగచైతన్య పత్రికలవారితో పంచుకున్న విశేషాలు... ► వేడుక చూద్దామని పిలిస్తే ప్రేక్షకులు ఫెస్టివల్లాంటి సినిమా అని వచ్చేస్తారు.. అలానే ఉంటుందా? కలర్ఫుల్గా ఉంటుంది. ‘నీ లవ్‌స్టోరీలు అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. కానీ నువ్వు నెక్స్›్టæలెవల్‌కి వెళ్లాలంటే ఆ లవ్‌స్టోరీలో ఇంకా ఏదో ఉండాలి. నన్ను నమ్మి ఈ సినిమా చెయ్యి’ అని నాన్న అన్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ నాన్నగారికి బాగా నచ్చింది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా చూసిన తర్వాత నాకు డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ టాలెంట్ మీద నమ్మకం పెరిగింది. నాన్న మాటని నమ్మి చేశాను. సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నాన్నగారైతే సినిమాను చాలాసార్లు చుశారు. అవుట్‌పుట్ బాగా రావడంతో ఆయనతో పాటు యూనిట్ అంతా మూవీ సూపర్ సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ అయ్యి, నా కెరీర్‌కి హెల్ప్ అవుతుంది. ► నాగార్జునగారు అంతగా చెప్పారంటే మీ క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉండి ఉంటుందేమో? అవును. ఫస్ట్ టైమ్ నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, ఈ సినిమా చేశాను. ప్రేక్షకులు నన్ను ఇంత ఎనర్జిటిక్ రోల్లో యాక్సెప్ట్ చేస్తారా? అనే డౌట్ ఉండేది. ‘ఇలాంటి క్యారెక్టర్ చేస్తే, నీ బాడీ లాంగ్వేజ్ సెట్ అవుతుంది’ అని నాన్న అన్నారు. కల్యాణ్‌కి కమర్షియల్ పల్స్ బాగా తెలుసు. తను కూడా ప్రోత్సహించాడు. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగుంటాయి. ఇప్పటివరకు నేను చేసిన లవ్ స్టోరీస్ హీరో, హీరోయిన్ల మధ్య లవ్ గురించే ఉంటాయి. కానీ, ఈ సినిమాలో ఓ తండ్రికి, ఓ కొడుక్కి మధ్య ఉన్న ప్రేమ, ఎమోషన్స్ కూడా ఉంటాయి. అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న రెండు కుటుంబాల మధ్య ఎలాంటి సంఘర్షణ ఉంటుంది? ఇంట్లో పెద్దవాళ్లు ఒక ఎమోషనల్ బాండేజ్కు ఎలా కనెక్ట్ అయి ఉంటారు? అనే విషయాలతో హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా ఉంటుంది. ► ‘ప్రేమమ్’లో ఆర్టిస్టుగా మీరు ఇంకా డెవలప్ అయినట్లనిపించింది. మరి ఈ సినిమాలో? సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ పాత్రలో నేను సెట్ అవుతానా లేదా అన్న భయం ఉండేది. అయితే నాన్నగారు, డైరెక్టర్ కల్యాణ్‌కృష్ణ నన్ను ప్రోత్సహించారు. నేను చేసే రోల్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందన్న నమ్మకాన్ని నాలో నింపారు. అయితే ఒకసారి స్క్రిప్ట్ విన్న తర్వాత ఇంట్రెస్ట్ పెరిగింది. షూటింగ్ సరదాగా గడిచింది. నా యాక్టింగ్ స్కిల్స్‌ను పెంచే విధంగా కల్యాణ్ కృష్ణ సినిమాను తెరకెక్కించాడు. ►రకుల్ గురించి? భ్రమరాంబగా రకుల్ నటన సూపర్బ్. మా ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఈ చిత్రంలో కొత్త రకుల్‌ని చూస్తారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో బంగార్రాజు క్యారెక్టర్ ఎలా గుర్తుండిపోతుందో అలా ఈ మూవీలో భ్రమరాంబ క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ మా బ్యానర్లో మంచి హిట్ సాంగ్స్ అందించాడు. ఈ సినిమా కథ విని, దేవి ఇంప్రెస్ అయ్యాడు. రీ–రికార్డింగ్ ఎలా ఇస్తాడో ముందే చెప్పి నన్ను యాక్టింగ్‌కి రెడీ అవ్వమన్నాడు. యాక్టర్‌గా నేను ఇంప్రూవ్ అవ్వడానికి దేవిశ్రీ సలహాలు ఉపయోగపడ్డాయి. ► ఇందులో జగపతిబాబు చేసిన పాత్రను మీ నాన్నగారిని చేయమని అడిగారట..? అవును. కానీ, నాన్న చేయనన్నారు (నవ్వుతూ). అయితే ఈ పాత్ర (తండ్రి పాత్ర)కు మా నాన్నగారికన్నా జగపతిబాబుగారే కరెక్ట్. ఆయన కాంబినేషన్ నాకు చాలా బాగా కుదిరింది. ►ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? సాయి కొర్రపాటి బ్యానర్లో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ సినిమా చేస్తున్నాను. చందూ మొండేటి చెప్పిన కథ నచ్చింది. అది కూడా చేయాలనుకుంటున్నా. గౌతమ్‌మీనన్ నాలుగు భాషల్లో తెరకెక్కించబోయే సినిమాలో తెలుగు వెర్షన్లో నేను హీరోగా యాక్ట్ చేయబోతున్నాను. ఫుల్ క్లారిటీ! ప్రస్తుతం ‘హ్యాపీ స్పేస్’లో ఉన్నాను. అక్టోబర్‌లో సమంతతో పెళ్లి. పర్సనల్ లైఫ్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాను. ప్రొఫెషనల్‌గా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఇంతకు మించి నేను పెద్దగా ఏం ఆలోచించడంలేదు. -
ఫాదర్గానా... ఐ కాంట్!
‘‘నటుడికి ఓ ఇమేజ్ ఉండాలని నేనెప్పుడూ అనుకోను. ఒకవేళ ఇమేజ్ వస్తే దానికి కట్టుబడి సినిమాలు చేయాలి. చైతూ విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు. మొన్న ‘ప్రేమమ్’ చేశాడు. అంతకు ముందు వేరే సినిమాలు చేశాడు. ఇప్పుడో థ్రిల్లర్ చేయబోతున్నాడు. ‘రారండోయ్..’తో అందరికీ దగ్గరవుతాడు’’ అన్నారు నాగార్జున. కుమారుడు నాగచైతన్య (చైతూ) హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున పాత్రికేయులతో ముచ్చటించారు. ► నేను బాగా ఇష్టపడి చేసిన, నాకిష్టమైన సినిమా ‘నిన్నే పెళ్లాడతా’. అలాంటి ఫ్యామిలీ, ఎమోషన్స్ ఉన్న సినిమా చైతూకి కావాలని ‘రారండోయ్..’ చేశాం. ఇప్పుడు అమ్మాయి–అబ్బాయిల మధ్య రిలేషన్షిప్స్, ఎమోషన్స్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. తండ్రీకొడుకులు, తండ్రీకూతుళ్ల మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయనేది చూపించాం. చక్కని కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ►మనకు ఇలాంటి స్నేహితుడు, ప్రేమికుడు ఉండాలనుకునే పాత్రను చైతూ చేశాడు. జగపతిబాబు–చైతూ మధ్య సీన్స్ అయితే ఆల్మోస్ట్ నేను–చైతూ ఎలా మాట్లాడుకుంటామో అలానే దింపేశాం. ‘మీరే ఆ పాత్ర చెయ్యొచ్చు కదా’ అన్నారు. అఖిల్ సినిమాలోనూ ఫాదర్‌గా చేయమన్నారు. (నవ్వుతూ..) ఐ కాంట్. ►చైతూకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? అని అడగ్గా... ‘‘(నవ్వుతూ) సినిమా అయిన తర్వాత ఇస్తానని చెప్పా. నేను ఇచ్చేదేంటి? ఇదంతా వాళ్లదే కదా!’’ అన్నారు. తనకు ఖర్చులుంటాయి కదా? అంటే... ‘‘అవసరం అయితే అడిగి తీసుకువెళతాడు. సుప్రియను అడగమంటా. తను కరెక్ట్‌గా ఆన్సర్ ఇస్తుంది’’. ►‘మన్మథుడి’కి ‘హి హేట్స్ విమెన్’ అని ట్యాగ్‌లైన్ పెట్టాం. సినిమా చూస్తే కంప్లీట్ రివర్స్‌లో ఉంటుంది. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా? అనడిగితే... ‘‘ట్రైలర్లో డైలాగది. సినిమాలో రాజకుమారుడు ఎవరంటే ‘అమ్మాయిని రాణీలా చూసుకునేవాడు’ అనే డైలాగ్ ఉంది. స్త్రీలకు సినిమా వ్యతిరేకం కాదు’’ ►నిర్మాత అంటే చెక్కుల మీద సంతకం పెట్టడం కాదు. ప్రతి పనినీ దగ్గరుండి చూసుకోవాలి. నాన్నగారు, నాన్నగారి నిర్మాతల నుంచి నేను నేర్చుకున్నది అదే. నేను నిర్మించే ప్రతి సినిమా పనులను దగ్గరుండి చూసుకుంటా. చైతూ, అఖిల్ ఇతర సంస్థల్లో చేస్తుంటే నేను వేలు పెట్టను. వాళ్లతో కంటిన్యూస్‌గా సినిమాలు తీసే ఓపిక నాకు లేదు. వాళ్లిద్దరున్నారు, నేను... ఏడాదికి మా సంస్థలో ఒక్కో సినిమా చేయగలమంతే. ►50 కోట్లు ఎక్కడ? 1500 కోట్లు (‘బాహుబలి–2’ వసూళ్లను ఉదహరిస్తూ) ఎక్కడ? కొన్నాళ్లు అందరూ క్లబ్బుల గురించి మాట్లాడడం మానుకోవాలి. గతేడాదే నేను క్లబ్బుల గురించి మాట్లాడ వద్దని చెప్పా. బడ్జెట్ ఎంత? వసూళ్లెన్ని! అనేవి చూసుకోవాలి. ‘బాహుబలి’తో రాజమౌళి ‘డ్రీమ్ బిగ్. యు మైట్ అచీవ్ ఇట్’ అని చెప్పారు. తెలుగు సినిమా క్వాలిటీని పెంచారు. ‘బాహుబలి’కి ముందు ‘అడవి రాముడు, ప్రేమాభిషేకం, మాయాబజార్’... ఇలా తెలుగు సినిమావాళ్లు ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ► ‘మనం’ చేసినప్పట్నుంచి బాగా జోకులేసుకోవడం నాకు, సమంతకు అలవాటు. అప్పుడు ‘సార్’ అనేది. ఇప్పుడు ఎలాగోలా ఒప్పించి ‘మామా’ అని పిలిపించుకుంటున్నా. ‘మామయ్య’ అంటే మరీ ఓల్డ్‌గా ఉంది కదా! అక్టోబర్‌లో చైతూ–సమంతల పెళ్లి ఉంటుంది. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. ► ‘విక్రమ్’ విడుదలై నేటికి (మంగళవారం) 31 ఏళ్లయ్యిందని నాగార్జునకు గుర్తు చేయగా... ‘‘నిజమా! నాకు నిజంగా గుర్తు లేదు. ఇక్కడికి వస్తుంటే అమల ‘పార్టీ టు నైట్’ అని మెస్సేజ్ పెట్టింది. ఇందుకే అన్నమాట’’ అన్నారు. ►మోహన్‌లాల్ భీముడిగా నటించనున్న ‘మహాభారతం’లో కర్ణుడిగా నటించమని అడిగారు. చిత్రదర్శకుడు శ్రీకుమార్ నాలుగేళ్ల నుంచి ‘మహాభారతం’ తీయాలని ప్లాన్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే ‘మీకు ఇంట్రెస్ట్ ఉందా? అని నన్ను అడిగారు. వాసుదేవ్ నాయర్ నాకు స్క్రీన్‌ప్లే ఇచ్చారు. భీముడి కోణంలో సినిమా తీస్తే నా పాత్రకు ప్రాముఖ్యత ఏముంటుంది? అని శ్రీకుమార్‌ను అడిగితే... ‘‘అన్ని పాత్రలను బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం’’ అన్నారు. చిన్న క్యారెక్టర్ అయినా... ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే చేస్తానని చెప్పా. ఇంకా డిస్కషన్స్‌లో ఉంది. నేను చేస్తానా? లేదా? అనేది చెప్పలేను.