breaking news
rapped
-
బోయిన్‌పల్లిలో బాలికపై అత్యాచారం
హైదరాబాద్: నగరంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన నగరంలోని బోయిన్పల్లి ఆర్‌ఆర్‌నగర్‌లో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ బాలిక(16)పై అదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా బాలిక ప్రియుడి స్నేహితుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పనిమనిషిపై లాయర్ లైంగిక దాడి
హైదరాబాద్: నగరంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో పనిచేసే బాలికపై ఇంటి యజమాని కొడుకు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాలు.. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసం ఉండే హైకోర్టు న్యాయవాది సుధాకర్‌రెడ్డి ఇంట్లో ఓ బాలిక(14) పనిచేస్తోంది. ఆమెపై అతని కుమారుడు, లాయర్ అయిన భరత్‌కుమార్‌రెడ్డి గత కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఆమె ప్రస్తుతం రెండు నెలల గర్భవతి. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు మహిళా సంఘాల సాయంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. సరూర్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.