breaking news
Rangar reddy district
-
ఊరకుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి
దోమ : ఊరకుక్కల దాడిలో 40 గొర్రెలు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నల్ల చిన్నయ్యకు చెందిన 100 గొర్రెలను తన పొలం దగ్గర మంద చేసి ఉదయం ఇంటికి వచ్చాడు. ఉదయం 10 గంటల సమయంలో ఊరకుక్కలు ఆ మందపై దాడి చేయడంతో 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలను మేపేందుకు పొలానికి వెళ్లగా గొర్రెలు మృతి చెంది కుప్పలుగా పడి ఉన్నాయి. కష్టపడి పొషించిన గొర్రెలు ఒకేసారి మృతి చెందడంతో రైతు దిక్కుతోచి స్థితిలో ఉన్నాడు. దీంతో రైతుకు తీవ్రంగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరుతున్నాడు. -
రంగారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం
30 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.50 వేల నగదు అపహరణ శంషాబాద్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండలో బుధవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కత్తులతో బెదిరించి, భారీచోరీకి పాల్పడ్డారు. 30తులాల బంగారం, 20తులాల వెండితో పాటు, రూ.50 వేల ను ఎత్తుకెళ్లారు. పెద్దగోల్కొండలో దేవయ్యగౌడ్ ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. దేవయ్య, ఆయన భార్యాపిల్లలు నిద్రిస్తున్న గదులకు గడియలు వేసుకోకపోవడంతో దుండగులు అందులోకి ప్రవేశిం చారు. అలికిడి వారంతా నిద్రలేచి కేకలు వేసే యత్నం చేయగా కత్తిచూపించి.. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. బీరువాలో ఉన్న రూ.50 వేల నగదుతోపాటు చంద్రకళతోపాటు ఆమె కూతుళ్ల మెడల్లో ఉన్న సుమారు 30 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను లాక్కున్నారు. వెళ్లేటప్పుడు దేవయ్య చేతులను కర్టెన్‌తో వెనక్కి కట్టేసి ఓ గదిలో బంధిం చారు. చంద్రకళ, ఆమె కుమార్తెలను మరో గదిలో తోసేశారు. బయటి నుంచి తలుపులకు గడియ వేసి పరారయ్యారు. ఈ తతంగం అంతా కేవలం 15 నిమిషాల్లోనే పూర్తయింది. చోరీకి ముందు సమీపంలోని రెండిళ్లకు దుండగులు బయట నుంచి గడియలు పెట్టారు. శంషాబాద్ డీసీపీ రమేష్‌నాయుడు, ఏసీపీ సుదర్శన్, ఎస్వోటీ డీసీపీ నర్సింగ్‌రావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.