breaking news
Ram Prasad Reddy
-
మంత్రి రాంప్రసాద్‌కు గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్
అన్నమయ్య జిల్లా: మంత్రి రాంప్రసాద్‌కు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాలు విసిరారు. ఇప్పుడు స్వేచ్ఛగా రాయచోటి మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహిస్తే 20 వేల మెజారిటీ తగ్గితే రాజకీయాల నుంచి వైదొలగుతానని ఛాలెంజ్ చేశారు. రాయచోటిలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిపే ధైర్యం మంత్రికి లేదని చెప్పారు. నామినేషన్ కేంద్రంలోకి మంత్రి చొరబడడం దారుణమని మండిపడ్డారు.రామాపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయాలను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాయచోటిలో విచ్చలవిడిగా రౌడీయిజం చేయడం మంత్రికే చెల్లింది. ఒక మంత్రిగా ఉండి కనీస బాధ్యత లేకుండా ఎస్కార్ట్ తో నామినేషన్ కేంద్రాల్లోకి చొరబడి మహిళలను దుర్భాషలాడి నామినేషన్ పత్రాలు చించడం నైతికమా? మంత్రికి ధైర్యం ఉంటే ఇప్పుడైనా రాయచోటి మునిసిపల్ చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తే 20,000 మెజారిటీ తగ్గితే రాజకీయాల నుంచి వైదొలుగుతా. లూటీ చేయడం కోసమే మంత్రి డ్యూటీ తీసుకున్నారు. అభివృద్ధి కోసం, ప్రజల ఆర్థిక స్థితిని పెంచడం కోసం నేను డ్యూటీ తీసుకున్నా. నా చేతిలో రెండు సార్లు డిపాజిట్ లేకుండా ఓడిపోయిన మంత్రి నాతో కంపారిజన్ చేస్తారా? కేవలం పోస్టల్ బ్యాలెట్ తో గెలిచిన వ్యక్తి మంత్రి. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపే ధైర్యం మంత్రికి లేదు, నామినేషన్లు వేస్తానంటేనే మంత్రికి భయం. రాజకీయ పార్టీలు, మేధావులు, ఎన్నికల సంఘం ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఓటర్లు పోలింగ్ బూత్ కి వెళ్లే పరిస్థితే ఉండదు.ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, పోలీసులతో బెదిరించడం ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఎన్నికల్లో పోటీ చేస్తామంటే వారిని వ్యక్తిగతంగా కృంగదియడం, వ్యాపారం పరంగా పతనం చేయడం, ఫోన్ లిఫ్ట్ చేసి బెదిరించడం బైండోవర్లు పెట్టడం ఇలా రకరకాలుగా వేధించడం తగునా? ప్రజాదారణ ఉంటే మంత్రికి గెలుస్తామని నమ్మకం ఉంటే ఏ ఎన్నికైనా సరే, మంత్రి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరపాలి. 90 శాతం నేను గెలవకపోతే రాజకీయాలనుంచి శాశ్వతంగా వైదొలుగుతా? ప్రజల్లో భయం నింపి ధైర్యం పోగొట్టిన వ్యక్తి మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితిని కూడా దూరం చేసిన వ్యక్తి మంత్రి. నామినేషన్ సెంటర్లలో క్యాబినెట్ హోదాలో ఉన్న ఒక మంత్రి చొరబడి మహిళలతో దుర్భాషలాడి నామినేషన్ పత్రాలు చించడం, వారి మొబైల్ ఫోన్లు లాక్కోవడం ఎప్పుడైనా జరిగిందా?’’ అని నిలదీశారు. -
ఎన్నికల నామినేషన్లు.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి హల్చల్
సాక్షి, అన్నమయ్య జిల్లా: ఏపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని పాతరేసేందుకు చంద్రబాబు డైరెక్షన్లో పచ్చముఠాలు బరితెగిస్తున్నాయి. ఓటమి భయంతో ప్రజాతీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక ప్రత్యర్థులను పోటీకి దూరం చేయడమే లక్ష్యంగా కుట్రలకు తెరతీశారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి హల్చల్ చేశారు.వివరాల మేరకు.. లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట నామినేషన్ కేంద్రంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆదివారం ఉదయం నామినేషన్ కేంద్రంలోకి ప్రవేశించి అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.మరోవైపు.. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కూడా టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లడంతో వారిని టీడీపీ మూకలు అడ్డుకున్నారు. అభ్యర్థులను అడ్డుకున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ పచ్చ బ్యాచ్‌ను పట్టించుకోలేదు. ఇదే సమయంలో పలుచోట్ల పోలీసుల బైండోవర్లు, అక్రమ నిర్బంధాలు, అధికారుల తనిఖీల పేరుతో వైఎస్సార్సీపీ అభ్యర్థులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలా అడుగడుగునా అధికార బలాన్ని ప్రయోగిస్తూ ఎన్నికల స్వేచ్ఛను కాలరాస్తున్నారు.నామినేషన్ కేంద్రాల కుదింపు మొదలు ప్రత్యర్థులపై దాడుల వరకు అన్నింటా ప్రజాస్వామ్య హక్కులకు సంకెళ్లు వేస్తున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనుసరించిన బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలనే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ పునరావృతం చేస్తున్నారు. ప్రజలు ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన ఎన్నికలను టీడీపీ నేతలు తమకు నచ్చిన వారిని ఏకగ్రీవంగా ప్రకటించుకునే ప్రక్రియగా మార్చేస్తున్నారు. ఓటుతో ప్రజాతీర్పు వెలువడాల్సిన పల్లెల్లో.. బెదిరింపులు, దౌర్జన్యాలు, వేలంపాటలతో అధికార పార్టీ తన ఆధిపత్యాన్ని రుద్దుతోంది.ఇదీ చదవండి: ఇక్కడా ఏకగ్రీవాలే లక్ష్యమా? -
మంత్రి ఇలాకాలో టీడీపీ దౌర్జన్యం.. ఏడాదైనా మహిళకు దక్కని న్యాయం
-
ఇదొక పిరికిపంద చర్య.. నువ్వు నిజంగా మగాడివి అయితే.. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వార్నింగ్
-
విశాఖలో బస్టాండ్ లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి షాక్
-
కర్నూలు బస్సు ప్రమాదాన్ని కప్పిపుచ్చిన TDP మంత్రి
-
పోలింగ్ బూత్‌లో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దౌర్జన్యం
-
ఒంటిమిట్టలో మంత్రి హల్ చల్
-
బ్రాండ్ ఇండియా కోసం ఫార్మా ట్రస్ట్
* రెస్పాన్సిబుల్ ఇండియా ట్రస్ట్వచ్చే నెలలో ప్రారంభం.. * ప్రభుత్వానికి 60 శాతం, ఫార్మా కంపెనీలకు 40 శాతం వాటా... * కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా ఇండియన్ ఫార్మాపై వస్తున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి కేంద్రం నడుంబిగించింది. ఇందుకోసం ఫార్మా కంపెనీల భాగస్వామ్యంతో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రెస్పాన్సబుల్ హెల్త్‌కేర్ ట్రస్ట్ (ఆర్‌హెచ్‌టీ) ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే నెలలో ఈ ట్రస్ట్‌ను రిజిస్టర్ చేస్తామని, బ్రాండ్ ఇండియా బిల్డింగ్‌పై ఇది ప్రధానంగా దృష్టిసారిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ తెలిపారు. ఫార్మెక్సిల్ 10 వార్షిక సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశీయ ఔషధాల నాణ్యత, జనరిక్ ఔషధాలపై అంతర్జాతీయంగా పెరుగుతున్న దుష్ర్పచారాన్ని అరికట్టడానికి ఫార్మా కంపెనీలతో కలసి ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మన మందులపై దక్షిణాఫ్రికా, వియత్నాంలలో ఈ విధంగానే అసత్య ప్రచారం జరిగిందని, ఇక నుంచి ఇలాంటి సంఘటనలు వెలుగు చూడగానే వాటికి అడ్డుకట్టవేయడమే ఆర్‌హెచ్‌టీ ప్రధాన కర్తవ్యం అన్నారు. కేంద్రం 60 శాతం, ఫార్మా కంపెనీలు 40 శాతం వాటాతో 11 మంది సభ్యులతో ఈ ట్రస్ట్ ఏర్పడుతోంది. ప్రస్తుతం దేశీయ ఫార్మా నాణ్యత, బ్రాండింగ్, మానవ వనరుల లభ్యత వంటి అంశాల్లో సమస్యలు ఎదుర్కొంటోందని రాజీవ్ ఖేర్ పేర్కొన్నారు. ఏక లక్ష్యంతోనే లీడర్... వ్యాపారంలో కాని, మరే అంశంలోనైనా ఒకే అంశంపై దృష్టిసారించి ముందుకు కొనసాగితే ఎప్పటికైనా లీడర్ స్థాయికి ఎదుగుతారని అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి పి.వి తెలిపారు. ఫార్మెక్సిల్ సీఈవో కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఒకేసారి అన్ని విషయాలపై దృష్టిసారించే కంటే ఏక లక్ష్యంతో పనిచేస్తే తొందరగా విజయాన్ని చేరుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ మాట్లాడుతూ పేటెంట్ హక్కులు ముగిసే సమయం కంటే ఏనిమిదేళ్ల ముందుగానే జనరిక్ పరిశోధనలు మొదలు పెడితే కాని అవకాశాలు అందిపుచ్చుకోలేమన్నారు. ఈ కార్యక్రమంలో జైడస్ క్యాడిలా సీఎండీ పంకజ్ పటేల్, నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్ నన్నపనేని, సువెన్‌లైఫ్ చైర్మన్ వెంకట్ జాస్తి తదితర ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు ఫార్మా ఎగుమతులు, పేటెంట్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వారికి ఫార్మెక్సిల్ అవార్డులను ప్రదానం చేసింది. అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన కంపెనీగా లుపిన్ ఫార్మా, బల్క్ డ్రగ్స్‌లో అరబిందో ఫార్మా అవార్డులను గెలుచుకున్నాయి.


