breaking news
Ram Gopal Varmas film
-
అవేమీ భయపెట్టలేవు.. దేవుడా నా మాట విను.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన ప్రియురాలిని అతికిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన దేశ రాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ వార్త వింటేనే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతోంది. ప్రియురాలిని అతి కిరాతకంగా చంపి 35 ముక్కలుగా చేశాడంటే అతను ఎంత నరరూప రాక్షసుడో అర్థమవుతోంది. దేశ రాజధానిలో కలకలం రేపిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. (చదవండి: బస్సులో ఒకడు అసభ్యంగా ప్రవర్తించాడు: నటి) ఈ నేపథ్యంలో తాజాగా ఈ దారుణ ఘటనపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. యువతి దారుణ హత్యను ప్రస్తావిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇలాంటి క్రూరమైన హత్యలను కేవలం చట్టంతో అరికట్టలేమంటూ దేవునికి విచిత్రమైన రిక్వెస్ట్ పెట్టారు. ఆర్జీవీ ట్వీట్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ట్వీట్లో ఆర్జీవీ ప్రస్తావిస్తూ.. 'ఇలాంటి క్రూరమైన హత్యలను కేవలం చట్టం అనే భయంతో అరికట్టలేము .. కానీ చనిపోయాక బాధితుల ఆత్మలు తిరిగి వచ్చి హంతకులను చంపితే వాటిని కచ్చితంగా అరికట్టవచ్చు. దయచేసి ఈ విషయాన్ని భగవంతుడు పరిగణనలోకి తీసుకుని ఈ విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ యువతి ఆత్మ విశ్రాంతి తీసుకోకుండా తిరిగి వచ్చి అతనిని 70 ముక్కలుగా కట్ చేయాలి.' అంటూ పోస్ట్ చేశారు. Instead of resting in PEACE she should come back as a spirit and cut him into 70 PIECES — Ram Gopal Varma (@RGVzoomin) November 16, 2022 Brutal murders can’t be prevented just by fear of law ..But they can be definitely stopped if the victims spirits come back from the dead and kill their killers ..I request God to consider this and do the needful 🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) November 16, 2022 -
వర్మ సినిమాను 267 సార్లు చూశాను: హీరోయిన్
ఒక సినిమాను ఎన్నిసార్లు చూస్తాం? ఒకటీ రెండుసార్లు.. బాగా నచ్చిందంటే ఓ పది సార్లు చూస్తాం. ఇక వీరాభిమానులైతే 30 నుంచి 50 సార్లైనా చూస్తారు. కానీ ఓ నటి మాత్రం ఒకట్లు, పదులు కాదు, ఏకంగా వందల సార్లు ఒకే సినిమాను చూసిందట. జోష్‌తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి శ్రేయా ధన్వంతరి 'ది ఫ్యామిలీ మ్యాన్', 'స్కామ్ 1992' వెబ్ సిరీస్‌లతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఆమెకు తెలుగు సినిమాలంటే మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించినన 'క్షణక్షణం' చిత్రాన్ని ఆమె ఏకంగా 267 సార్లు చూసిందట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. తెలుగులో నా ఫేవరెట్ సినిమాను 267వ సారి చూశాను. ఇందులో హీరో దగ్గుబాటి వెంకటేష్, పరేశ్ రావల్, శ్రీదేవి అద్భుతంగా నటించారు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఎమ్ఎమ్ కీరవాణి బీజీఎమ్ కూడా సూపర్‌గా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవని చెప్తున్నారు. చదవండి: బుట్టబొమ్మ ఇంట్లో బర్త్‌డే వేడుకలు 'దిల్ బేచారా'లో క్యాన్సర్ రోగిగా కనిపించింది ఈవిడే.. -
సైదులు
సింగిల్ పేజ్ స్టోరీ నిన్న రాత్రి ఎనిమిది, ఎనిమిదింపావు మధ్యలో వచ్చినట్టుంది చీకటి. వచ్చి ఎనిమిది గంటలు దాటిందో ఏమో? సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగిలా వెళ్లటానికి సిద్ధమవుతూ, తర్వాత షిఫ్ట్ రావలసిన సూర్యుడికి రమ్మని కేకేసింది. క్యాబ్ మిస్సయ్యి సిటీ బస్‌లో వస్తున్న ఉద్యోగిలా సూర్యుడు మెల్లగా వస్తున్నాడు. పీరయ్య మటన్ కొట్లో... కోళ్ల బోన్లో ఉన్న శీనయ్య కోడి ‘సైదులు’ గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటోంది. మర్డర్ చేసి దొరికిపోయిన నేరస్తుడిలా బిక్కుబిక్కుమని భయంతో అటూ ఇటూ చూస్తూ... ‘ఏంటో ఈ కోడి బతుకు!’ అని తిట్టుకుంటోంది. రామ్‌గోపాల్‌వర్మ సినిమాల్లోలా తలుపు తీసిన చప్పుడయ్యింది. లోపలికి వచ్చిన పీరయ్య ఎడం చేత్తో లైట్ వెయ్యబోయి, ఆగి కుడిచేత్తో వేశాడు. ఓల్టేజ్ సరిగా లేదో, బల్బ్ సరిగా లేదో... లైట్ మాత్రం దీనంగా వెలుగుతోంది. సాన పట్టించుకొచ్చిన రెండు కత్తులు అరుగుమీద పెట్టి, దేవుడి పటం ముందు నిల్చొని మొక్కుకుంటున్నాడు పీరయ్య. తనని బతికించమని అదే దేవుణ్ని మొక్కుకుంది సైదులు. చంపటానికి వచ్చిన పీరయ్యా అదే దేవుణ్ని మొక్కుతుండటం చూసి అసలీ దేవుడి కాన్సెప్ట్ ఏమిటో అర్థం కాలేదు సైదులికి. పూజ ముగించిన పీరయ్య కోళ్లను నరికే మొద్దు బండని శుభ్రం చేస్తున్నాడు. కొట్లో క్యాలెండర్ అక్టోబర్ మూడు చూపిస్తోంది. ‘‘గాంధీతాత దయవల్ల ఒక్కరోజు ఎక్స్ట్రా అయినా బతకగలిగాను. కాని, లాభమేంటి? రోజు మొత్తం భయం భయంగా బతకటం తప్ప. ఎవరికొచ్చిందో స్వాతంత్రం, మాకు మాత్రం రాలేదు’’ అని సైదులు నిట్టూర్చింది. ‘‘దేవుడా... దేవుడా... ప్లీజ్! బతికి బయటపడే అవకాశమైతే కనపడట్లేదు. కానీ బతకాలనుంది. గుడ్లు పెట్టే వయసు రాకముందే గుడ్లు తేలెయ్యాల్సొస్తుందని బాధగా ఉంది. ప్లీజ్ దేవుడా... ప్లీజ్, ప్లీజ్’’ అని దేవుణ్ని ప్రార్థిస్తోంది సైదులు. పీరయ్య వచ్చి బోను తెరిచాడు. అంతలో దీనంగా వెలుగుతోన్న లైట్ కాస్తా ఆరిపోయింది. సైదులు వెంటనే బోను నుంచి బయటికి దూకి చీకట్లో పరిగెత్తింది. ఏమీ కనిపించకపోవడంతో కోడి ఎటు పోయిందో గుర్తించలేకపోయాడు పీరయ్య. అక్కడి నుండి బయటపడ్డ సైదులు మాత్రం పక్కనున్న పొలాల్లోంచి రయ్యిరయ్యిమని శీనయ్య ఇంటికి బయలుదేరింది. తను చిన్నగా వున్నప్పటినుంచి తనని ప్రేమగా పెంచాడు శీనయ్య. తనకున్న దాంట్లో భార్యాపిల్లలతో హాయిగానే జీవిస్తున్నాడు. శీనయ్య ఇంట్లోంచి సైదులుని దొంగతనంగా ఎత్తుకొచ్చి పీరయ్యకి అమ్మేశాడు సుబ్బులు. ‘ఆడు కనపడాలీ... ముక్కుతో వాడి పిక్క ముక్కలు ముక్కలు చేసి చంపేస్తా’ అని తిట్టుకుంటూ వెళ్తోంది సైదులు. శీనయ్యని చూసి రెండు రోజులు దాటింది. తనని చూసి శీనయ్య ఎంత ఆనందపడతాడో గుర్తుకొస్తూనే సైదులు వేగం ఇంకా పెరిగింది. ఎలాగైతేనేం ఇంటికి చేరుకుంది సైదులు. దొడ్డి గుమ్మం వైపు వెళ్లి కిటికీ లోంచి లోపలికి చూసింది. శీనయ్య నాలుగేళ్ల కొడుకు అశోక్, అక్క స్వాతి మీద చెయ్యేసుకుని పడుకున్నాడు. ఎప్పటిలాగే వాడి భయం చూసి నవ్వుకుంది సైదులు. ఒంట్లో నలతగా వుందో ఏమో? శీనయ్య భార్య లక్ష్మి మంచం మీద పడుకుని వుంది. రెండు ప్లేట్లలో ఉప్మా పెట్టుకుని వచ్చి ‘తిను’ అంటూ ఒక ప్లేట్ లక్ష్మికి ఇచ్చాడు శీనయ్య. ‘‘భార్య లక్ష్మి అంటే అంత ప్రాణం శీనయ్యకి. అందుకే శీనయ్య అంటే అంత గౌరవం లక్ష్మికి. వాళ్లిద్దరి అన్యోన్యత గురించి మాట్లాడుకోని కోడి గానీ, మనిషి గానీ లేడు’’ అనుకుంటూ దొడ్డి వాకిలి గుండా ఇంట్లోకి వచ్చింది సైదులు. ఉప్మా వాసన బాగా వస్తుండటంతో వాళ్లకి కనిపించకుండా వంటింట్లోకెళ్లింది. తనలాగే శీనయ్యకీ పల్లీలు ఎక్కువగా వేసి చేసిన ఉప్మా అంటే ప్రాణం. మెల్లిగా వంటింట్లోకెళ్లిన సైదులు తన ముక్కుతో ఉప్మా కాస్త పక్కనేసుకుని ఆస్వాదిస్తూ తింటోంది. రెండు రోజుల్నుంచి తినిందో లేదో గబగబా నాలుగు ముద్దలు కడుపులోకేసింది. ఎందుకో గొంతు పట్టేసినట్టు అనిపించింది సైదులుకి. కడుపులో మెలికలు తిరిగే నొప్పి, కళ్లు తిరుగుతున్నాయ్. కడుపులో అగ్గి పోసినట్టుగా వుంది. ఏమయ్యిందో ఏమో అర్థం కావట్లేదు. భరించలేని బాధ. కాస్త ఓపిక తెచ్చుకుని వంటింటి గుమ్మం దాకా వచ్చి చూసింది. నోట్లోంచి నురగులు కక్కుతూ చచ్చిపోతున్నారు శీనయ్య, లక్ష్మి. కోడి గుండె ఆగిపోయింది. విషయం తెల్సి చుట్టుపక్కలవాళ్లంతా వచ్చారు. ఉత్తమ వ్యవసాయదారుడు అని రాసున్న ఒక అవార్డు ముక్క, సగం కాలి కట్టెల పొయ్యిలో ఉంది. పీరయ్య మటన్ కొట్లోనే చావాల్సిన సైదులు చావు శీనయ్య ఇంట్లో రాసిపెట్టుంది. పిల్లల్ని ఓదార్చిన ఆ వూరి ఎం.ఎల్.ఎ. బయటికి వచ్చి, ఎవరూ చూడకుండా డెటాల్‌తో చేతులు కడుక్కుని వెళ్లిపోయాడు. - కళ్యాణ్ రాఘవ పసపుల