breaking news
Rajya Sabha member Chiranjeevi
-
కోడూరు ప్రజల అభిమానం మరవలేను
-
కోడూరు ప్రజల అభిమానం మరవలేను
రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి రైల్వేకోడూరు, అర్బన్ : రైల్వేకోడూరు ప్రజల అభిమానాన్ని తాను మరవలేనని సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పేర్కొన్నారు. శనివారం ఆయన పట్టణంలోని శివాలయం సర్కిల్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2010లోనే ఈ విగ్రహాన్ని చిరంజీవి చేతులమీదుగా ఆవిష్కరించాలని నిర్వాహకులు భావించారు. చిరంజీవికి సమయం లేకపోవడంతో ఎట్టకేలకు శనివారం ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన ఆయన పట్టణంలో అభిమానులకు అభివాదం చేస్తూ విగ్రహం వద్దకు వచ్చారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయులు పరిపాలనాధ్యక్షుడని ఆయన పరిపాలనలో రాజ్యం సస్యశ్యామలంగా ఉండేదన్నారు. ఆయన అడుగుజాడల్లో అందరం నడవాలన్నారు. అభిమానుల కోరిక మేరకు తన 150వ సినిమాను ఆగస్టులో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా హాజరైన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.