breaking news
rajunayak
-
ఆరేళ్లు కష్టపడితే 60 ఏళ్లు సుఖంగా జీవించవచ్చు..!
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగితేనే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజునాయక్ అన్నారు. మంగళవారం వీఎస్టీ ఫంక్షన్హాల్లో న్యూఎరా కళాశాల ఆధ్వర్యంలో సంకల్ప్ దివాస్ పేరిట పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ... లక్ష్యం లేని చదువులు వృథా అవుతాయని అన్నారు. ఆరేళ్లు కష్టపడి చదివితే 60 ఏళ్లు సుఖంగా జీవించొచ్చని అన్నారు. సెల్ఫోన్లకు కేటాయించే సమయాన్ని చదువు, ఆటలపైన కేటాయించాలని సూచించారు. ప్రేమ మత్తులోపడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ... క్రమశిక్షణ పట్టుదల ఉన్న ఏ విద్యార్థి ఓడిపోడని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. -
మహిళల స్వేచ్ఛ కోసం..
గాయని మంగ్లీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘స్వేచ్ఛ’. కేపీఎన్ చౌహాన్ దర్శకత్వం వహించారు. సరస్వతి డెవలపర్స్, లచ్చురాం ప్రొడక్షన్ పతాకంపై ఆంగోత్ రాజునాయక్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. ఆంగోత్ రాజునాయక్ మాట్లాడుతూ– ‘‘తండా స్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు గాయనిగా ఎదిగిన మంగ్లీ పాత్ర నేటి అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది. సెంటిమెంట్, వినోదంతో రూపొందిన ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఈ నెల 22న పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు.‘‘పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడ పిల్లలూ అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది’’ అన్నారు కేపీఎన్ చౌహాన్ . ‘‘ఇందులో ఓ పాత్రలో నటించడంతో పాటు సంగీతం అందించడం ఆనందంగా ఉంది’’ అన్నారు భోలో షావలి. -
కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా రాజునాయక్
వరంగల్ : కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామానికి చెందిన అజ్మీరా రాజునాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నవీన్‌నాయక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.