మహిళల స్వేచ్ఛ కోసం.. 

Singer Mangli New Movie Swechha  - Sakshi

గాయని మంగ్లీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘స్వేచ్ఛ’. కేపీఎన్‌ చౌహాన్‌ దర్శకత్వం వహించారు. సరస్వతి డెవలపర్స్, లచ్చురాం ప్రొడక్షన్ పతాకంపై ఆంగోత్‌ రాజునాయక్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. ఆంగోత్‌ రాజునాయక్‌ మాట్లాడుతూ– ‘‘తండా స్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు గాయనిగా ఎదిగిన మంగ్లీ పాత్ర నేటి అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది. సెంటిమెంట్, వినోదంతో రూపొందిన ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఈ నెల 22న పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు.‘‘పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడ పిల్లలూ అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది’’ అన్నారు కేపీఎన్‌ చౌహాన్‌ . ‘‘ఇందులో ఓ పాత్రలో నటించడంతో పాటు సంగీతం అందించడం ఆనందంగా ఉంది’’ అన్నారు భోలో షావలి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top