breaking news
rail employes
-
చుక్..చుక్..చుక్.. రైలు కాదండోయ్ ఇళ్లు..!
జీవిత చరమాంకంలో చాలా మంది తాము అప్పటి వరకూ చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాటి గురించే ఇతరులకు చెప్పుతు లేదా తమలో తామే ఆలోచిస్తూ బాధ పడడమే లేక సంబరపడడమే చేస్తుంటారు. అయితే ఇక్కడ రైల్వేశాఖ మాజీ ఉద్యోగి మాత్రం విభిన్నంగా ఆలోచించారు. తను ఇంతకాలం పనిచేసిన జ్ఞాపకాలకు మనసులో కాకుండా కళ్లెదుట చూడాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆ నిర్మాణం చేపట్టారు.తమ జ్ఞాపకాలను వదలకుండా ఉండడానికి.. చాలా పనులు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక రైల్వే ఉద్యోగి ఇంతకాలం తను పని చేసిన సంస్థను వీడలేకపోయాడు. అవే జ్ఞాపకాలతో అను నిత్యం తనతో ఉండాలనుకున్నాడు ఇంకేంటి అనుకున్నదే తడువుగా తన ఇంటినే రైల్వే కోచ్‌గా మార్చాడు. దీని నిర్మాణం కోసం తన స్వహస్తాలతో రైలు నమూనాను చెక్కాడు.కేరళ, కాసరగోడ్ రవనీశ్వరం-చల్లింగల్ రహదారిపై వెళుతుంటే ఎవరి కన్నైనా సరే ఒకసారి ఆ ఇంటిపై పడాల్సిందే. ఎంటబ్బా ఈ నిర్మాణం అని అనాల్సిందే? ఎందుకంటే అది సాధారణ ఇళ్లు కాదుగా మరి.. పురాతన రైల్వే కోచ్ మోడల్‌కు చెందిన నమూనా.. అందుకే దాని నిర్మాణం చూసి ఎవరైనా ఔరా అనాల్సిందే..టీ. దామోదరన్ అనే వ్యక్తి రైల్వేలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. 20 ఏళ్ల క్రితమే ఆయన తన వృత్తికి స్వచ్ఛంగ విరమణ ప్రకటించారు. అయితే అంతకాలం రైల్వేలో పనిచేయడం ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేయడంతో ఆయన మదిలో ఎప్పుడూ రైలు జ్ఞాపకాలే మెదిలాడేయి. దీంతో ఆయన తన ఇంటినే రైలుగా మార్చాలని నిశ్చయించుకున్నాడు. దీంతో అనుకున్నదే తడవుగా ఆ నిర్మాణం చేపట్టారు.రెండేళ్ల క్రితం ఇండియన్ రైల్వే బ్యాన్ చేసిన ALCO లోకోమోటివ్ మోడల్లో దాని నిర్మాణం చేపట్టారు. దీని నిర్మాణంలో సహాజాకృతి రావాలని స్వయంగా ఆయనే 'రేక్వాల్' స్ప్రింగ్స్, వీల్స్ తదితరవన్ని కర్రతో తానే చెక్కినట్లు తెలిపారు. తాపీవారికి ఆ పని అప్పగిస్తే అంత సులభంగా చేయలేరని తానే ఆ పని చేసినట్లు దామోదరన్ అన్నారు.ఇక్కడితో కథ ముగియలేదు. తను ఎంతో కష్టపడి నిర్మించిన తన జ్ఞాపకాల గుర్తుకు తనను పెంచి పెద్దచేసిన తన మాతృమూర్తి పేరు మీద "ఆచా కోచ్" అని పెట్టాడు. తన మాతృమూర్తి తనను ఎంతో గొప్పవాడు కావాలని కలలు కందని దానికోసం ఎంతో తపించిందని అందుకోసమే తన పేరు పెట్టినట్లు తెలిపారు.తన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో తనకు ఏ జాబు రాలేదని అందుకే సేల్స్‌మాన్‌గా చేరానని ఆ సమయంలోనే తనకు రైల్వేస్ నుంచి ఉద్యోగం ఆఫర్ వచ్చిందని దామోదరన్ తెలిపారు. అయితే తాను వెళ్లడానికి నిరాకరించడంతో తన యజమాని వెళ్లాల్సిందని పట్టుబట్టినట్లు తెలిపారు. 1977లో రైల్వేలో ఉద్యోగంలో చేరగా 1996లో పదవీ విరమణ పొందినట్లు తెలిపారు. ఫిబ్రవరి 21న రైలు ఇళ్లును ప్రారంభించే ఫంక్షన్ ఘనంగా చేయనున్నట్లు దామోదరన్ తెలిపారు. -
తెలుగు వారందరూ కలిసే ఉండాలి
గుంతకల్లు, న్యూస్‌లైన్: తెలుగు వారందరూ కలిసే ఉండాలని, రాష్ట్ర విభజన ప్రక్రియను విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని గుంతకల్లు రైల్వే ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమైక్య ఉద్యమానికి సంఘీభావంగా మంగళవారం సాయంత్రం వేలాది మంది రైల్వే కార్మికులు, ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రైల్వే క్రీడా మైదానంలో తహసీల్దార్ వసంతబాబు, జేఏసీ పట్టణ చైర్మన్ మునివేలు, రైల్వే జేఏసీ సభ్యులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణానికి చెందిన ఓబాలిక భరతమాత వేషధారణలో ర్యాలీ ముందు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా రైల్వే జేఏసీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైల్వే ఉద్యోగులందరూ ఉద్యమానికి మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రెండు నెలలుగా అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రైల్వే ఉద్యోగులు సోదరభావంతో కలిసిమెలసి జీవిస్తుండగా, తెలుగు ప్రజలు ఐక్యంగా జీవించలేరా? అని ప్రశ్నించారు. రైల్వే ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు ప్రజలను ఐక్యంగా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే, రైల్వే ఉద్యోగులందరూ ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. రైల్వేను స్తంభింపజేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే జేఏసీ కన్వీనర్ ధనరాజ్, నాయకులు ప్రకాష్‌రెడ్డి, కరీముల్లా, ఆన్వర్, కోటేశ్వరరావు, దొరైరాజ్భూషణం, బాలాజీసింగ్, కేఎండీ గౌస్, జీఎన్ ప్రకాష్‌బాబు, అశోక్, రమేష్, సత్తార్, రాబర్ట్, డీఆర్ఆర్ పాల్, డి.వెంకటేశ్వర్లు, శివయ్య, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ గాంధీ చౌక్‌కు చేరుకున్న అనంతరం రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులు కొవ్వొత్తులతో ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్, వాసవీదేవి ఆలయం, పాతబస్టాండ్, వైఎస్సార్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, మున్సిపల్ కార్యాలయం మీదుగా పొట్టిశ్రీరాములు సర్కిల్‌కు చేరుకుని, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.


