breaking news
Rachna Banerjee
-
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో రాణించడం అంతా ఈజీ కాదు. స్టార్డమ్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం కత్తిమీద సాములాంటిదే. అలా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. సక్సెస్ అయినవాళ్లు చాలా తక్కువమందే ఉన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే చాలా అరుదని కూడా చెప్పొచ్చు. ఇండస్ట్రీలోకి అలా వచ్చి.. ఇలా వెళ్లిన వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు తెలుగు రాణించి.. ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్ ఒకప్పటి హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1997లో నేను ప్రేమిస్తున్నాను అనే మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బెంగాలీ బ్యూటీ రచన బెనర్జీ. ఈ ముద్దుగుమ్మ రెండో సినిమా కన్యాదానంతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మామిడాకులు మూవీలో మెరిసింది. అంతేకాకుండా ఓకే ఏడాదిలో నాలుగు సినిమాలు చేసి తెలుగులో సత్తా చాటింది. తెలుగులో ఆమె చివరిసారిగా 2002లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీలో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమైనప్పటికీ ఇతర భాషల్లోనూ మెప్పించారు.కోల్‌కతాకు చెందిన రచన 1991లో మిస్ కోల్‌కతా కిరీటాన్ని అందుకుంది. 1992 మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొంది. అలా తన అందంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ 1993లో దాన్ ప్రతిదాన్ అనే బెంగాలీ సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది.ఎంపీగా పార్లమెంట్‌కు..సినిమాల్లో తెచ్చుకున్న క్రేజ్‌తో ఈ ముద్దుగుమ్మ పార్లమెంట్లో ఎన్నికల్లో పోటీ చేశారు. వెస్ట్ బెంగాల్‌లోని హుగ్లీ లోక్‌సభ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఒరియా అగ్ర నటుడు సిద్ధాంత్ మహాపాత్రను పెళ్లాడింది. అయితే 2004లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. రచనా బెనర్జీ ఒరియాలో యాభైకి పైగా సినిమాలలో నటించారు. ఆ తర్వాత రచన బెనర్జీ 2005లో ప్రొబల్ బసుని రెండవ వివాహం చేసుకుంది. అతనితో విభేదాలు రావడంతో 2016లోనే విడిపోయింది. ప్రస్తుతం ఎంపీగా రాజకీయాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. -
Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
రచనా బెనర్జీ. అందం, అభినయం కలబోసిన నటిగా దక్షిణాదికి చిరపరిచితం. ఒడిశా సినీ పరిశ్రమలోనూ వెలుగు వెలిగిన బెంగాలీ బ్యూటీ. దీదీ అనగానే తృణమూల్ అధినేత్రి మమతాయే గుర్తొస్తారు. అయితే సూపర్‌హిట్ బెంగాలీ టీవీ షో ‘దీదీ నంబర్‌వన్’కు హోస్ట్‌గా అలరిస్తూ రచన దీదీ నంబర్‌వన్ అయ్యారు. తృణమూల్ నుంచే రాజకీయ అరంగేట్రమూ చేస్తున్నారు...!నటిగా ప్రయాణం.. 1974 అక్టోబర్ 2న కోల్‌కతాలో జన్మించిన రచన అసలు పేరు ఝుంఝుమ్ బెనర్జీ. కోల్‌కతా సౌత్ సిటీ కాలేజీలో డిగ్రీ చేశారు. 1990లో సెకండియర్‌లో ఉండగానే మిస్ కలకత్తా టైటిల్ గెలుచుకున్నారు. 1994లో మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆకర్షణీయమైన ముఖం, అందమైన చిరునవ్వు ఆమెకు బోలెడు సినీ అవకాశాలు తెచి్చపెట్టాయి. బెంగాలీ చిత్రం ‘డాన్ ప్రొటిడాన్’తో తొలిసారి వెండితెరపై కనిపించారు. బెంగాలీతో పాటు దక్షిణాదిలోనూ వరుసగా సినిమాలు చేశారు. కన్యాదానం సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, మిథున్ చక్రవర్తి వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ఒరియా నటుడు సిద్ధాంత మహాపాత్రతో కలిసి ఏకంగా 40 సినిమాలు చేశారు. ప్రసేన్‌జిత్ ఛటర్జీతోనూ 35 బెంగాలీ సినిమాల్లో నటిస్తే వాటిలో 32 సూపర్ డూపర్హిట్లే! సినిమాలు చేస్తూనే వ్యాపారవేత్తగానూ ఎదిగారు. సామాజిక మాధ్యమాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్స్టాగ్రాం, ఎక్స్‌లో రచనకు లక్షల్లో ఫాలోవర్లున్నారు. రాజకీయాల్లోకి... సినిమాలకు గుడ్‌బై చెప్పాక రచన టీవీపై దృష్టి సారించారు. సూపర్‌హిట్ బెంగాలీ టీవీ షో దీదీ నంబర్‌వన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీని కలిశారు. రాజకీయాల్లోకి వెళ్తారని అప్పుడే ప్రచారం జరిగినా కొట్టిపడేశారు. బీజేపీకి బెంగాల్లో బలం పెరుగుతుండటం, పలువురు టీఎంసీ నేతలపై ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బలమైన కొత్త ముఖాన్ని తెరపైకి తేవాలని మమత భావించారు. ఆ మేరకు భారీ ర్యాలీలో రచనను హుగ్లీ నుంచి లోక్‌సభ అభ్యరి్థగా ప్రకటించారు. అక్కడి బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీ కూడా సినీ నటే. పైగా రచనకు మంచి స్నేహితురాలు కూడా. అదంతా వ్యక్తిగతమని, పోటీ పోటీయేనని అంటున్నారు రచన.వంద శాతం ఇస్తా...తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా మమత అడిగినప్పుడు కాస్త ఆలోచించి అంగీకరించినట్టు చెప్పారు రచన. ‘‘దీదీ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. జీవితంలో ప్రతి దశలోనూ కొత్త అవకాశం వస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవాలి. అందుకే లోక్‌సభకు దీదీ నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు పొంగిపోయా. నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడు. నా నిర్ణయంతో అమ్మ సంతోషంగా ఉంది. గతంలో లైవ్ స్టేజ్ షోల కోసం రెండు మూడుసార్లు హుగ్లీ వెళ్లా. ఇక నుంచి అదే నా అడ్డా. జీవితంలో ఏం చేసినా 100 శాతం చిత్తశుద్ధితో కష్టపడ్డా. అదే స్ఫూర్తితో నాయకురాలిగానూ రాణించి దీదీ నమ్మకం నిలబెడతా’’ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లోక్‌సభ ఎన్నికల బరిలో టాలీవుడ్ హీరోయిన్.. ఆ స్థానంలో పోటీ?
తెలుగులో ఒకప్పుడు హీరోయిన్గా చేసి, ఇప్పుడు సీరియల్స్‌లో నటిస్తున్న నటికి లోక్‌సభ ఎన్నికల్లో సీటు దక్కింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు సంబంధించిన హడావుడి మొదలైపోయింది. తాము రాష్ట్రంలో ఒంటరిగానే బరిలో దిగుతున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. మొత్తం 42 స్థానాలకు గానూ ఎవరెవరు పోటీ చేస్తున్నారనే విషయమై క్లారిటీ ఇచ్చేశారు. ఇందులోనే ప్రముఖ నటికి అవకాశం దక్కడం చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: పూనమ్ కౌర్ ట్వీట్.. సీఎం జగన్ సాయం మరోసారి తెరపైకి) తెలుగులో 'బావగారు బాగున్నారా!', 'కన్యాదానం', 'మావిడాకులు' చిత్రాల్లో నటించిన రచన బెనర్జీ.. తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు ఈమెకే మమతా బెనర్జీ టికెట్ కేటాయించారు. హుగ్లీ నుంచి నటి రచనా బెనర్జీ బరిలోకి దిగనున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో బసిర్హాట్ నుంచి గెలిచిన హీరోయిన్ నుస్రత్ జహాన్‌కు ఈసారి మొండిచేయి ఎదురైంది. సందేశ్ ఖాలీ వివాదమే ఇందుకు కారణం. (ఇదీ చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్)


