ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా? | Tollywood actress Rachana Benerjee life at Present in her career | Sakshi
Sakshi News home page

ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. ఈమెను గుర్తుపట్టారా?

Jun 29 2026 9:24 PM | Updated on Jun 29 2026 9:42 PM

Tollywood actress Rachana Benerjee life at Present in her career

సినీ ఇండస్ట్రీలో రాణించడం అంతా ఈజీ కాదు. స్టార్‌డమ్‌ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం కత్తిమీద సాములాంటిదే. అలా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. సక్సెస్ అయినవాళ్లు చాలా తక్కువమందే ఉన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే చాలా అరుదని కూడా చెప్పొచ్చు. ఇండస్ట్రీలోకి అలా వచ్చి.. ఇలా వెళ్లిన వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు తెలుగు రాణించి.. ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్‌ ఒకప్పటి హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1997లో నేను ప్రేమిస్తున్నాను అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బెంగాలీ బ్యూటీ రచన బెనర్జీ. ఈ ముద్దుగుమ్మ రెండో సినిమా కన్యాదానంతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మామిడాకులు మూవీలో మెరిసింది. అంతేకాకుండా ఓకే ఏడాదిలో నాలుగు సినిమాలు చేసి తెలుగులో సత్తా చాటింది. తెలుగులో ఆమె  చివరిసారిగా 2002లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీలో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమైనప్పటికీ ఇతర భాషల్లోనూ మెప్పించారు.

కోల్‌కతాకు చెందిన రచన 1991లో మిస్‌ కోల్‌కతా కిరీటాన్ని అందుకుంది. 1992 మిస్‌ ఇండియా పోటీల్లోనూ పాల్గొంది. అలా తన అందంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ 1993లో దాన్‌ ప్రతిదాన్‌ అనే బెంగాలీ సినిమాతో తెరంగేట్రం చేసింది.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.

ఎంపీగా పార్లమెంట్‌కు..

సినిమాల్లో తెచ్చుకున్న క్రేజ్‌తో ఈ ముద్దుగుమ్మ పార్లమెంట్‌లో ఎన్నికల్లో పోటీ చేశారు. వెస్ట్ బెంగాల్‌లోని హుగ్లీ లోక్‌సభ నుంచి పోటీచేసి గెలుపొందారు.  ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఒరియా అగ్ర నటుడు సిద్ధాంత్ మహాపాత్రను పెళ్లాడింది. అయితే 2004లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. రచనా బెనర్జీ ఒరియాలో యాభైకి పైగా సినిమాలలో నటించారు. ఆ తర్వాత రచన బెనర్జీ 2005లో ప్రొబల్‌ బసుని రెండవ వివాహం చేసుకుంది. అతనితో విభేదాలు రావడంతో 2016లోనే విడిపోయింది. ప్రస్తుతం ఎంపీగా రాజకీయాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement