breaking news
Rabindranath Tagore birth anniversary
-
రవీంద్రనాథ్ ఠాగూర్‌కు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘దేశ స్వాతంత్ర్య పోరాటంలో జన గణ మనతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన విశ్వకవి, భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఆయన. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.దేశ స్వాతంత్ర్య పోరాటంలో జన గణ మనతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన విశ్వకవి, భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి రవీంద్ర నాథ్ ఠాగూర్ గారు. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఆయన. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2026 -
రవీంద్రుడికి అంజలి ఘటించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : విశ్వకవి, నోబెల్ అవార్డు గ్రహీత, రవీంద్రనాథ్ ఠాకూర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఘనంగా అంజలి ఘటించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 155వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. 'గురుదేవ్ ఠాకూర్‌కు అభివాదం చేస్తున్నా. ఆయన రచనలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయి' అని మోదీ ట్విట్ చేశారు. కాగా, రవీంద్రనాథ్ ఠాగూర్ మే 7, 1861న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కటాలోజన్మించారు. 1941, ఆగస్టు 7న పరమపదించారు. ఠాగూర్ సాహిత్యానికి చేసిన సేవకు గుర్తింపుగా ఆయనకు 1931లో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు.


