ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
థ్రిల్లర్స్ అనగానే చాలామందికి ఓటీటీలే గుర్తొస్తాయి. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలన్నీ థియేటర్లలో రిలీజ్ అవుతాయి. క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని రకరకాల మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు అలానే 'పాతాళ్ లోక్' మేకర్స్ నుంచి మరో థ్రిల్లర్ సిరీస్ రెడీ అయింది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టిన రష్మిక!)'రాఖ్' పేరుతో తీసిన ఈ సిరీస్‌లో అలీ ఫజల్, సోనాలి బింద్రే, రాకేశ్ బేడీ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. వచ్చే శుక్రవారం(జూన్ 12) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే ఆర్మీ అధికారికి చెందిన కొడుకు, కూతురు కనిపించకుండా పోతారు. వీళ్లని ఎవరో హత్య చేసేస్తారు. తర్వాత ఇదే క్రమంలోనే ఢిల్లీలో వరస హత్యలు జరుగుతాయి. ఇంతకీ వీటిని చేస్తుంది ఎవరు? పోలీసులు హంతకుల్ని పట్టుకున్నారా? లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది.ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే ఇందులో తల్లి పాత్ర చేసింది. 'ధురంధర్' ఫేమ్ రాకేశ్ బేడీ కూడా కీలక పాత్ర చేశారు. మరి ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)