breaking news
Quran Reading
-
మానవ హితమే ‘ఈద్’ అభిమతం
రమజాన్ నెల ముగిసిన తర్వాత ముస్లిం సమాజం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం ఈదుల్ ఫిత్ర్. ఏకధాటిగా నెలరోజులపాటు సాగిన ఆధ్యాత్మిక సాధన స్పూర్తితో, మానవీయ విలువలకు నూతన ఆరంభం. ఉపవాసం ద్వారా శరీరాన్ని మాత్రమే కాదు, తన ఆలోచనలను, ప్రవర్తనను కూడా శుద్ధి చేసుకున్న మనిషి ఆ అనుభూతిని సమాజంతో పంచుకునే రోజు ఈద్. అందుకే ఈ పండుగలో కనిపించే ఆనందం కేవలం ఉత్సవపు ఉల్లాసం కాదు; అది ఆధ్యాత్మికత, దానం, సహోదరత్వం, సామాజిక బాధ్యతల సమ్మేళనం. అందుకే ఈ నెలను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం పాటించడం, రాత్రిళ్లు ప్రత్యేక ప్రార్థనలు చేయడం, ఖుర్ ఆన్ పఠనం, దానం వంటి ఆచారాలు విశ్వాసుల జీవితంలో ఒక శుద్ధి ప్రక్రియలా మారుతాయి. ఉపవాసం ద్వారా ఆకలి, దాహం అనుభూతిని స్వచ్ఛందంగా స్వీకరించడం ద్వారా మనిషి తన కోరికలను నియంత్రించుకోవడం నేర్చుకుంటాడు. అదే సమయంలో పేదసాదల కష్టాలను అర్థం చేసుకునే సానుభూతి కూడా అతనిలో పెరుగుతుంది.ఈ పండుగలోని ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి జకాతుల్ ఫిత్ర్ లేదా ఫిత్రా. ప్రతి ముస్లిం కుటుంబం తమ శక్తికి తగ్గట్టు పేదలకు దానం చేయడం సంప్రదాయం. దీని వెనుక ఉన్న భావం ఎంతో గొప్పది. సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే మానవీయ బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. పండుగ ఆనందం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలనే భావన ఇస్లాం లోని సామాజిక న్యాయ భావనను ప్రతిబింబిస్తుంది.ఈద్ రోజూ ఉదయం మసీదులు, ఈద్ గాహ్‌లలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు సమాజంలోని ఐక్యతను ప్రతిబింబిస్తాయి. వేలాదిమంది ఒకేస్థలంలో చేరి, ధనిక, పేద, పెద్ద, చిన్న అనే తేడాలు లేకుండా ఒకే వరుసలో నిలబడి ప్రార్థన చేయడం సమానత్వానికి ప్రతీక. ప్రార్థన అనంతరం ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ అని శుభాకాంక్షలు తెలుపుకోవడం పరస్పర ప్రేమను, క్షమాభావాన్ని వ్యక్తపరుస్తుంది.ఈదుల్ ఫిత్ర్ తాత్వికంగా కూడా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. రమజాన్ నెలలో మనిషి తనలోని స్వార్థాన్ని తగ్గించి దయ, సహనం, నియంత్రణ వంటి విలువలను పెం΄పొందించుకుంటాడు. ఈ విలువలు కేవలం ఒక నెలకు మాత్రమే పరిమితం కాకుండా జీవితాంతం కొనసాగాలని ఈద్ మనకు గుర్తు చేస్తుంది. నిజమైన ఈద్ అంటే కేవలం ఒక రోజు సంబరం కాదు; రమజాన్ ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక మార్పును జీవితంలో నిలబెట్టుకోవడం.సామాజికంగా కూడా ఈ పండుగ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకచోట చేరి ఆనందాన్ని పంచుకోవడం ద్వారా బంధాలు మరింత బలపడతాయి. చాలా సందర్భాల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న అపార్థాలు, విభేదాలు కూడా ఈ సందర్భంలో పరిష్కారమవుతాయి. పరస్పరం క్షమించుకోవడం, మళ్లీ దగ్గరవడం ఈ పండుగకు ప్రత్యేకమైన లక్షణం.నిజమైన ఈద్ కొత్త బట్టలు ధరించడంలో కాదు; కొత్త మనసుతో జీవించడంలో ఉంది. ద్వేషం స్థానంలో ప్రేమను, స్వార్థం స్థానంలో దానాన్ని, విభేదాల స్థానంలో ఐక్యతను పెం΄పొందించడమే ఈదుల్ ఫిత్ర్ అసలు ఆత్మ. ఈ ఆత్మను మన జీవితంలో నిలబెట్టగలిగితేనే ఈ పండుగ ఆధ్యాత్మిక, తాత్విక, సామాజిక సందేశం సార్థకమవుతుంది. దైవం మనందరికీ ఈ పర్వదినం స్ఫూర్తిని అందిపుచ్చుకొనే అవకాశం అనుగ్రహించాలని కోరుకుందాం.రమజాన్ నెల మనిషికి ఒక ఆత్మపరిశీలన సమయం. తన జీవితంలోకి ఒకసారి తొంగిచూసుకుని, తన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసే కాలం. ఈద్ ఆ ప్రయాణానికి ఒక ఆనందకర ముగింపు. అదే సమయంలో ఒక కొత్త సంకల్పానికి ఆరంభం కూడా. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే చెందిన పండుగ కాదు; అది మానవత్వానికి సంబంధించిన పండుగ. ఉపవాసం ద్వారా నేర్చుకున్న నియంత్రణ, దానం ద్వారా పెరిగిన దయాగుణం, ప్రార్థన ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక బలం – ఇవన్నీ కలిసి సమాజంలో ప్రేమ, న్యాయం, సామరస్యం స్థాపించడానికి మార్గం చూపుతాయి. అందుకే ఈ పండుగ మనకిచ్చే అసలు సందేశం ఎంతో సరళం, కానీ చాలా గొప్పది.– మదీహా అర్జుమంద్ -
8 గంటల్లో ఖురాన్ పఠనం
మరిపెడ (డోర్నకల్): మదర్సాలో ఓ విద్యార్థి ఏకధాటిగా 8 గంటలపాటు ఖురాన్ మొత్తం పఠనం చేశాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడుకి చెందిన సయ్యద్ ఆసిఫ్ మహబూబాబాద్ జిల్లా మరి పెడ మండల కేంద్రంలోని మదర్సాలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఖురాన్‌ను కంఠస్థం చేసేందుకు సాధారణంగా మూడేళ్లు పడుతోందని, ఆసిఫ్ 15 నెలల్లో పూర్తి చేశాడని మదర్సా బోధకుడు మౌలానా తెలిపారు. మంగళవారం ఆసిఫ్‌ను ముస్లిం మత పెద్దలు సన్మానించారు. -
మక్కా.. లుక్కేద్దాం ఎంచక్కా
రంజాన్‌కు ముస్తాబవుతున్న మక్కా మసీదు నగరాన్ని చరిత్ర పుటల్లో నిలిపిన అద్భుత కట్టడం దేశంలోని పురాతన మసీదుల్లో ప్రత్యేక గుర్తింపు చార్మినార్: రంజాన్ మాసం ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది. రంజాన్ ఉపవాస దీక్షల ప్రారంభానికి ఇక రెండు వారాలే మిగిలి ఉంది. రంజాన్ మాసానికి ముందు వచ్చే షబ్-ఏ-బరాత్ భక్తి శ్రద్ధలతో ముగిసింది. దీంతో ఈ నెల 30నుంచి రంజాన్ మాసం ప్రారంభం కావచ్చునని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. సామూహిక ప్రార్ధనలు, ఖురాన్ పఠనంతో పాటు ఉపవాస దీక్షలను సైతం మక్కా మసీదు ప్రాంగణంలో ముగిస్తారు. రంజాన్ ఉపవాస దీక్షల అనంతరం చేసే ఇఫ్తార్ విందులకు మక్కా మసీదు వేదికగా మారుతుంది. రంజాన్ మాసంలో మక్కా మసీదు విద్యుత్ దీప కాంతులతో కళకళలాడుతుంది. సాధారణ రోజుల కంటే రంజాన్ మాసంలో మసీద్‌కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నగరంతోపాటు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో మక్కా మసీదు సందర్శించి ప్రార్ధనలు నిర్వహిస్తారు. దీనికోసం మక్కా మసీదు అందంగా ముస్తాబవుతోంది. అవసరమైన అన్ని హంగులను ఏర్పాటు చేస్తున్నారు. మక్కా నుంచి రాళ్లు తెప్పించి కట్టినందుకే... దేశంలో గల అతి పెద్ద పురాతన మసీదుల్లో నగరంలో ఉన్న మక్కా మసీదు ఒకటి. చారిత్రాత్మకమైన చార్మినార్ కట్టడానికి అతి సమీపంలో దక్షిణం వైపున సుమారు 100 గజాల దూరంలో మక్కా మసీదు ఉంది. మహ్మద్ ప్రవక్త మక్కాలో నిర్మించిన మసీదు నుంచి కొన్ని రాళ్లు తీసుకొచ్చి ఈ మసీదు నిర్మాణానికి ఉపయోగించారని చెబుతుంటారు. అందుకే దీనికి మక్కా మసీదని పేరొచ్చినట్లు చరిత్రకారుల అభిప్రాయం. మక్కా మసీదులోని ఆవరణలో ఎడమ వైపు ఉన్న బల్లపై ఒకసారి కూర్చుంటే మక్కా మసీదు సందర్శన కోసం మళ్లీ వస్తారనేది నమ్మకం. నిర్మాణంలో మట్టికి బదులు రాళ్ల పొడి... మక్కా మసీదు నిర్మాణంలో ఎక్కడా మట్టిని వాడలేరు. రాళ్ల పొడిని మాత్రమే ఉపయోగించారు. మక్కా మసీదు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లను మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలోని ఓ పెద్ద రాతి కొండను ఎంపిక చేశారు. కొండను తొలిచి తెచ్చిన ఎత్తై రాళ్లతో మక్కా మసీదు నిర్మాణం జరిగింది. ఆ రాళ్లను ఎండ్ల బండ్ల ద్వారా మక్కా మసీదుకు తీసుకొచ్చారు. ఒకేసారి 3వేల మందికి ప్రార్థన చేసుకునే విధంగా... దాదాపు ఒకేసారి 3 వేల మంది ఈ హాల్లో ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. మక్కా మసీదు ఎత్తు 176 అడుగులు, మక్కా మసీదు లోపల 67 మీటర్ల పొడవు, 54 మీటర్ల వెడల్పు, 23 మీటర్ల ఎత్తు గల విశాలమైన ప్రార్థనా మందిరం ఉంది. మక్కా మసీదు నిర్మాణం 1617లో ప్రారంభమై 1690 నాటికి పూర్తి నిర్మాణం రూపుదిద్దుకుంది. మసీదుకు దక్షిణంలో ఐదుగురు ఆసఫ్జాహీ రాజులు, వారి కుటుంబ సభ్యుల సమాధులు 14 ఉన్నాయి.


