breaking news
pullalacheruvu
-
స్కూల్ బస్సు,బైక్ ఢీ: యువకుడి మృతి
పుల్లలచెరువు (ప్రకాశం జిల్లా): పుల్లలచెరువు మండలం సుద్దపురవతండా వద్ద శనివారం ఓ స్కూలు బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న విజయ్‌కుమార్(17) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గిరి పుత్రుల ‘రాజన్న’
న్యూస్‌లైన్, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, సమాజానికి దూరంగా.. అడవి తల్లిని నమ్ముకుని అంధకారంతో సావాసం చేస్తూ.. ఒంటిపై కనీసం దుస్తులు కూడా కరువై.. పౌష్టికాహార లోపంతో.. డొక్కలు బయటపడి.. వ్యాధులతో రోజులు లెక్కపెట్టుకొనే గిరిజనుల వెతలు వర్ణనాతీతం. అటవీ ఉత్పత్తులతోనే పొట్ట నింపుకుంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న గిరిజనుల గురించి వైఎస్‌కు పూర్వం ఏ నాయకుడూ ఆలోచించలేదంటే అతిశయోక్తికాదు. ఆయన సీఎం అయ్యాక చెంచులు ఇతర తెగల సాధికారత కోసం ఆయన విశేష కృషి చేశారు. తమకు చేసిన సేవలకు గుర్తుగా పుల్లల చెరువు మండలం గారపెంటలో వైఎస్ దేవాలయం నిర్మించారంటే ఆయనపై గిరిపుత్రులకున్న ప్రేమాభిమానాలు అర్థం చేసుకోవచ్చు. చెంచుల అభ్యున్నతికి వైఎస్ చేసిన కార్యక్రమాలు - ప్రకాశం జిల్లాలో పెద్దారవీడు, దోర్నాలు, అర్ధవీడు, యర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాలతో పాటు మార్కపురం మండంలోని రెండు గ్రామాలు కలుపుకుని 82 చెంచు గూడేలున్నాయి. వీటన్నింటికీ వైఎస్ హయాంలో మంచినీటి సౌకర్యం, తారురోడ్లకు సుమారు 5-6 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. - భూమి కొనుగోలు పథకానికి *1 కోటి రూపాయలు మంజూరు చేశారు. దీని ద్వారా దాదాపు అన్ని చెంచు గూడేల్లోని గిరిజనులకు భూమి పట్టాలు లభించాయి. - టీబీ వ్యాధిగ్రస్తుల కోసం పౌష్టికాహారం మంజూరు చేశారు. ఆయన అనంతరం ఈ పథకం మూలన పడింది. - ఉపాధి హామీ పథకం కింద చెంచులకు పనులను కల్పించి వారి భూములను సాగులోకి వచ్చేలా చేశారు. - ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. - ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలి ముందుగానే చెల్లించారు. కూలి కింద కొన్ని నెలలపాటు నిత్యావసర వస్తువులు, నగదు చెల్లించే పద్ధతి అమలు చేశారు. - పింఛన్ అనే పదం తెలియని చెంచులకు.. ఆయన హయాంలో పింఛన్ అందేవిధంగా చర్యలు తీసుకున్నారు. - పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి చెంచు మహిళల్లో చైతన్యం తీసుకొని వచ్చారు. ఆర్భాట ప్రకటనలకే పరిమితమైన కిరణ్ - గత ఏడాది అక్టోబరు 9వ తేదీన నాటి సీఎం కిరణ్‌కుమార్ త్రిపురాంతకంలోని కోల్డు స్టోరేజీలో చెంచులతో ముఖాముఖి నిర్వహించగా గిరిజనులు ఉత్సాంగా ఆ సమావేశానికి వెళ్లారు. - రోడ్లు కావాలని వారు అడగడంతో ఆ మేరకు ఆదేశించారు. - పాలుట్లకు వెళ్లే 40 కిలోమీటర్ల మేర మెటల్ రోడ్డు వేయటానికి *39 కోట్లతో ఐటీడీఏ అధికారులతో అంచనాలు తయారు చేశారు. - అయితే అడవిలో రోడ్డు వేయటానికి ఎటువంటి పరిస్థితిలో అనుమతి ఇవ్వమని ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు. - ప్రస్తుతం చెంచులకు కాలిబాట కూడా లేక అల్లాడిపోతున్నారు. - వైఎస్ పంపిణీ చేసిన భూముల్లో కొన్ని చోట్ల వ్యవసాయ బోర్లు లేవు. - ఆర్భాటంగా ఇందిర జల ప్రభ ప్రారంభించారే కానీ బోరు బావుల అనుమతి లభించలేదు. - అలాగే బోడిరెడ్డిపల్లె వద్ద సీఎం కిరణ్ సమావేశం నిర్వహించినప్పుడు గారపెంట వాసులు తాటి భయమ్మ.. వ్యవసాయం చేసుకొనేందుకు ట్రాక్టర్ కావాలని కోరగా.. హామీ ఇచ్చిన కిరణ్‌కుమార్ రెడ్డి ఆ తర్వాత బుట్ట దాఖలు చేశారు. - యర్రగొండపాలెం మండలంలోని బావిపెంట, సుద్దకుంట, పెద్దమ్మతల్లి, బక్కచింతపెంట, నారుతడికల, పొన్నలబయలు, గుట్టలచేను, పాలుట్ల, నెక్కంటి, ఇష్టకామేశ్వరి, మంతనాల, ఆలాటం, బూరుగుండాల, పెద్దదోర్నాల మండలంలోని మర్రిపాలెం, పెద్దచామ, పెద్దారూట్ల, చెరువుగూడెం, బంధంబావి, పనుకోమడుగు, అయ్యనకుంట, పోతన్నగూడేల్లో ఎలాంటి వసతులు లేక వారంతా ఆవేదన చెందుతున్నారు. వైఎస్ మా దేవుడు సానా కాలం భూమి ఏందో మాకు తెలవదు. ఎట్టా వ్యగసాయం చేత్తారో కూడా తెలవదు. అసుంటుది వైఎస్ మా అందరికీ పొలాలిచ్చేడు. రైతులుగా మార్చేడు. గిప్పుడందరం బాగుండాం. ఆయనలాగా మంచి సేసే ఆయన బిడ్డ జగనన్నను బాగా సూసుకుంటాం. - తాటి అంకాలు ఏడుపొత్తంది అడవుల్లో తిరిగేటోళ్లం. బువ్వ కూడా దొరికేదిలే. మా దేవుడు రాజన్న వచ్చాక రోడ్లు గీడ్లూ వచ్చినాయి. ఆ సామి ఇప్పుడు లేడంటే ఏడుపొత్తుంది. ఆయన పోయాక.. ఆయన ఇంటోళ్లను ఏడిపించారు. ఇప్పుడు జగన్‌కు ఓటేసి కసి తీర్చుకుంటాం. - ఉడతల గంగమ్మ -
స్లాబ్ కూలి విద్యార్థి మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లా పుల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విషాదం నెలకొంది. పాఠశాల బాత్రూమ్ స్లాబ్ కూలి ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు. వాటర్ ట్యాంక్ కోసం విద్యార్థి ఇటుకలు మోస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్లాబ్ కూలిన సమయంలో ఇటుకలు మోస్తున్న ఆరో తరగతి విద్యార్థి మేడికొండ నరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థులతో పనులు చేయించడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.