breaking news
	
		
	
  public talk
- 
  
      OG సినిమా హిట్టా..! ఫట్టా..!
- 
  
      మా ఓట్లు దోచేసి సిగ్గు లేకుండా గెలిచామని చెప్పుకుంటున్నారు
- 
  
      ఏడాది పాలన.. గందరగోళం.. రఫ్పాడించిన ఏపీ ప్రజలు
- 
  
      బీసీలను టార్గెట్ చేయడం దుర్మార్గం
- 
  
      Valentines Day: జాగ్రత్త భయ్యా... ప్రేమిస్తే..!
- 
  
      పుష్ప -2 లో ఈ సీన్ లో పూనకాలే..! జాతర ఎపిసోడ్ కు జాతీయ అవార్డు పక్కా..
- 
  
      Watch Live: పుష్ప 2 మూవీ పబ్లిక్ టాక్
- 
  
      అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై పబ్లిక్ టాక్
- 
  
      100 రోజుల పాలనపై పబ్లిక్ టాక్.. చంద్రబాబు వింటే ఏమైపోతాడో..!
- 
  
      మంచి ప్రభుత్వం కాదు.. ఏపీని ముంచేసిన ప్రభుత్వం
- 
  
      చంద్రబాబు పాలనపై పబ్లిక్ టాక్
- 
  
      చియాన్ విక్రమ్ తంగలన్ పబ్లిక్ టాక్
- 
  
      బాక్సాఫీస్ రారాజు.. బాహుబలి రికార్డ్స్ బద్దలే..
- 
  
      Watch Live: ‘కల్కి 2898 ఏడీ’ పబ్లిక్ టాక్
- 
  
      ఇవిగో ఒరిజినల్ డాక్యూమెంట్లు..ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై పబ్లిక్ రియాక్షన్
- 
  
      హిందూపురం అభివృద్ధిపై ప్రజలు ఏమంటున్నారు ?
- 
  
      యాత్ర 2 చూసి పవన్ కళ్యాణ్ ని ఏకి పారేసిన మహిళ
- 
  
      న్యూజెర్సీలో యాత్ర 2 మూవీ పబ్లిక్ టాక్
- 
  
      యాత్ర 2 మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      సలార్ మూవీ పబ్లిక్ టాక్
- 
  
      ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’మూవీ పబ్లిక్ టాక్
- 
  
      సత్ఫలితాలు ఇస్తున్న వలంటీర్ వ్యవస్థ
- 
  
      SPY Public Talk: స్పై మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      సినిమా ఏం లేదు...ప్రభాస్ లేకపోతే..
- 
  
      ఆదిపురుష్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      Adipurush Public Talk: ఆదిపురుష్ మూవీ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఏమన్నారంటే...
- 
  
      అమెరికాలో ఆదిపురుష్ మూవీ పబ్లిక్ టాక్
- 
  
      టక్కర్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      మళ్ళీ పెళ్లి మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      బిచ్చగాడు 2 మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      అన్నీ మంచి శకునములే మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      ఒక్కోక్కడికి ఇచ్చి పడేసారు వామ్మో మామూలుగా రెచ్చిపోలేదుగా
- 
  
      ఉగ్రం మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      రామబాణం మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      ఏజెంట్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      విరూపాక్ష మూవీ పబ్లిక్ టాక్
- 
  
      మీటర్ మూవీ పబ్లిక్ టాక్
- 
  
      రావణాసుర మూవీ పబ్లిక్ టాక్
- 
  
      దసరా థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి
- 
  
      దసరా మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      దాస్ కా ధమ్కీ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      పలానా అబ్బాయి పలానా అమ్మాయి మూవీ పబ్లిక్ టాక్ వీడియో
- 
  
      టాప్ గేర్ మూవీ పబ్లిక్ టాక్
- 
  
      లక్కీ లక్ష్మణ్ మూవీ పబ్లిక్ టాక్
- 
  
      " ధమాకా " మూవీ పబ్లిక్ టాక్
- 
  
      " 18 పేజెస్ " మూవీ పబ్లిక్ టాక్
- 
  
      RGV డేంజరస్ మూవీ పబ్లిక్ టాక్
- 
  
      ‘గుర్తుందా శీతాకాలం’మూవీ పబ్లిక్ టాక్
- 
  
      చెప్పాలని ఉంది మూవీ పబ్లిక్ టాక్
- 
  
      హిట్-2 మూవీ పబ్లిక్ టాక్
- 
  
      ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ పబ్లిక్ టాక్
- 
  
      గాలోడు మూవీ పబ్లిక్ టాక్
- 
  
      PS 1 మూవీ పబ్లిక్ టాక్
- 
  
      కృష్ణ వ్రింద విహారి మూవీ పబ్లిక్ టాక్
- 
  
      రంగ రంగ వైభవంగా సినిమా పబ్లిక్ టాక్
- 
  
      లైగర్ సినిమా పబ్లిక్ టాక్
- 
  
      సీతారామం సినిమా పబ్లిక్ టాక్
- 
  
      బింబిసార సినిమా పబ్లిక్ టాక్
- 
  
      థ్యాంక్యూ మూవీ పబ్లిక్ టాక్
- 
  
      రామ్ పోతినేని - వారియర్ మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్
- 
  
      గాడ్సే మూవీ పబ్లిక్ టాక్
- 
  
      విరాటపర్వం పబ్లిక్ టాక్
- 
  
      కిరోసిన్ మూవీ పబ్లిక్ టాక్
- 
  
      విక్రమ్ మూవీ పబ్లిక్ టాక్
- 
  
      మేజర్ మూవీ పబ్లిక్ టాక్
- 
  
      ఎఫ్ 3 మూవీ పబ్లిక్ టాక్
- 
  
      సర్కారు వారి పాట మూవీ పబ్లిక్ టాక్
- 
  
      విద్యా వ్యవస్ధలో నవోదయం
- 
  
      ప్రేక్షకుల నుంచి విశేష స్పందన
- 
  
      ఇది చాలా శుభపరిణామం
- 
      
                   
                                 వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపై జనస్పందన
 వైఎస్సార్సీపీ మేనిఫెస్టో అన్నివర్గాల ప్రజలకూ మేలు చేసేదిగా ఉంది. యువత, నిరుపేద ప్రజలకు అండగా ఉండే అంశాలు పేద ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. మాటమీద నిలబడే జగన్ ఖచ్చితంగా తన హామీలు నిలబెట్టుకుంటారని జనం విశ్వసిస్తున్నారు. పలు పథకాలు అమలు చేసి రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తానంటున్న జగన్మోహన్రెడ్డికి మద్దతు పలికేందుకు అన్నివర్గాలూ ముందుకు వస్తున్నాయి.
 
 పర్యావరణానికి ప్రాధాన్యం శభాష్
 
 పర్యావరణ అంశాలను రాజకీయ పార్టీ ఎజెండాలో పొందుపరచడం శుభపరిణామం. శుభ్రమైన వాతావరణం, స్వచ్ఛమైన తాగునీరు కోరుతున్నారు. ఆరోగ్యకరమైన పరిసరాలను అందించాలని రాజకీయ పార్టీలుముందుకు రావడం మంచి ఆలోచన. నగరాభివృద్దికి అవసరమైన బ్లూప్రింట్‌ను ముందుగా నిర్ణయించుకోవాలి. దీనిలో భాగంగా నివాస ప్రాంతాలకు దూరంగా నిర్ణీత ప్రదేశంలో పరిశ్రమలు ఏర్పాటుచేయడం, కాలుష్యాన్ని నియంత్రించే విధానాలు సక్రమంగా అమలు జరపడం అవసరం. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తూ, కాలుష్యాన్ని నివారించే ప్రతి పాదనలు పర్యావరణవేత్తలు ఆహ్వానిస్తారు. నవతరం ప్రతినిధిగా వైఎస్ జగన్ ఆలోచన చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 
 -ఆచార్య ఇ.యు.బి రెడ్డి, పర్యావరణ శాస్త్ర విభాగం, ఏయూ
 
 రాజన్న రాజ్యం వస్తుంది
 అప్పట్లో రాజశేఖరరెడ్డి అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టి డ్వాక్రా మహిళల కుటుంబాలకు ఆసరా ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు తీసుకున్న అప్పులు తీర్చలేక ఇబ్బందుల్లో ఉన్న డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేయడానికి వైఎస్సార్సీపీ హామీ ఇవ్వడం ఆనందంగా ఉంది. డ్వాక్రా మిహ ళలకు ఏదైనా మేలు జరిగిందంటే అది వైఎస్ వల్లే నని చెప్పొచ్చు. జగన్మోహనరెడ్డితో మళ్లీ మాకు మంచి రోజులు వస్తాయి
 - రెడ్డి వరలక్ష్మి, డ్వాక్రామహిళ, లక్కవరం.
 
 పేదలకు మేలు చేస్తుంది
 వైఎస్సార్సీపీ అధినేత జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోను స్వాగతిస్తున్నాం. పేదలు, మహిళలు, వృద్ధుల సంక్షేమం ఇందులో కనిపిస్తోంది. వైఎస్ ప్రభుత్వం మాదిరిగా పరిపాలన ఉంటుందని మేమునమ్ముతున్నాం.వైఎస్ ప్రభుత్వ హాయంలో ఉద్యోగులకు న్యాయం జరిగింది. ఇప్పుడు కూడా జగన్ న్యాయం చేస్తారు. అందుకే ఆయనకు మద్దతు నిస్తున్నాం.
 - సత్యనారాయణ, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి,అరకులోయ.
 
 ప్రజారోగ్యానికి ప్రాముఖ్యం
 ప్రజల ఆరోగ్యం ప్రధాన ఎజెండాగా వైసీపీ పార్టీ నిలవడం ఆహ్వానించదగిన ఆంశం. విశాఖను కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచన రావడం ఎంతో హర్షదాయకం. ప్రజల ఆరోగ్యమే పరమావధిగా నేతలు పనిచేయాలని, ఇతర పార్టీలకు చెప్పపెట్టుగా ఈ నిర్ణయం నిలుస్తుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ వస్తున్న విశాఖ కాలుష్యపరంగానూ అంతే వేగంగా పెరిగింది. దీన్ని నివారించాలని, ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం అందించాలని తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం. విశాఖ వాసులంతా దీన్ని స్వాగతిస్తారు
 -షేక్ ఖాదర్‌బాబా, ఏయూ ఉద్యోగి
 
 మత్స్యకారులకు భరోసా లభించింది
 మత్స్యకారులు వేటసాగిస్తూ సముద్రంలో గల్లంతైతే ఆకుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం ఆనందదాయకం. మత్స్యకార కుటుంబాల్లో మగవాడి సంపాదనపైనే అధారపడతారు. ఏసమయంలో ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. నష్టపరిహారం త్వరితగతిని ఆ కుటుంబానికి అందజేసే మార్గదర్శకాలను జగన్ విడుదల చేయడం చాలా బాగుంది. అమ్మఒడి పథకంతో మత్స్యకార కుటుంబాల్లో విద్యావంతుల సంఖ్య పెరుగుతుంది. 
 -మేరుగు చినరాజులు, పూడిమడక
 
 రైతులకు మంచి రోజులు వస్తాయి
 వ్యవసాయానికి మళ్లీ మంచిరోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. వైఎస్ వచ్చాక రైతులకు చాలా మేలు జరిగింది. ఇప్పుడు జగన్మోహరెడ్డి రైతుల కోసం మేనిఫెస్టోలో పలు అంశాలు పొందుపర్చారు. పగటిపూటే వ్యవసాయానికి 7గంటలు విద్యత్ ఇస్తే చాలా మంచిది. రైతులు రాత్రి జరుగుతున్న ప్రమాదాల నుంచి రక్షణ పొందుతారు. అంతేకాకుండా రైతుల సంక్షేమం కోసం నిధి ఏర్పాటుచేస్తానని చెప్పడం కూడా మంచి పరిణామమే. 
 - శానాపతి నాగేశ్వరరావు, రైతు, ఖండిపల్లి
 
 పెట్రోవర్సిటీ ఏర్పాటు యోచన భేష్
 విశాఖలో పెట్రో వర్సిటీ ఏర్పాటుచేయాలన్న అంశాన్ని మేనిఫెస్టోలో పేర్కొనడం చా లా మంచి పరిణామం. ఇది ఉపాధి, పరిశోథనా రంగాలకు బాగా ఉపకరిస్తుంది. ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న రంగం కూడా ఇదే.
 -ఆచార్య ఎం.జగన్నాథరావు, ఏయూ
 
 రుణాల మాఫీతో లబ్ధి
 డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని జగన్ చెబుతున్నారు. ఆయన చెప్పారంటే చేస్తారనే అర్థం. దీంతో మహిళాసంఘాలకు చాలా లబ్ధి చేకూరుతుంది. జగన్ ముఖ్యమంత్రి అయితే మహిళలకు మంచి జరుగుతుంది. ఆయన పథకాలు పేదల పాలిట వరాలు. 
 - లాలం కృష్ణవేణి, చిప్పాడ
 
 పెట్రో వర్సిటీ ఆహ్వానించదగినది..
 దేశంలో ఇంధన పరిశ్రమలు గణనీయంగా మన దేశంలో పెరుగుతున్నాయి. ఈ తరుణంలో దీని ప్రాధాన్యాన్ని జగన్ గుర్తించారు. ముఖ్యంగా కేజి బేసిన్లో ఆంధననిక్షేపాల వెలికితీత దశాబ్దాలుగా సాగుతోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగి, ఉపాధి అవకాశాలలను అందించే పరిశ్రమల పట్ల యువతరం ఆసక్తిచూపుతోంది. ఆసక్తి కలగిన యువతను ఈ దిశగా అడుగులు వేయించేందుకు పెట్రో వర్సిటీ ఉపకరిస్తుంది.
 -డాక్టర్ మోహన్‌బాబు, ఏయూ
 
 మద్యంపై ఆంక్షలు శుభసూచిక...
 జగన్మోహన్రెడ్డి వెల్లడించిన మ్యానిఫెస్టోలో మద్యంపై విధించిన ఆంక్షలను మహిళలంతా స్వాగతిస్తారు. నియోజకవర్గానికి ఒక చోటే మద్యం దుకాణం ఏర్పాటు, బెల్ట్‌షాప్‌ల ఎత్తివేత మహిళలకు ఎంతగానో ఊరటనిస్తాయి. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం పల్లెల్లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చాలా మంచిది. నగరంలో మెట్రోరైలు ప్రాజెక్ట్, అన్నిచోట్ల రేడియల్ రోడ్స్ ఏర్పాటుచేస్తానని హామీ ఇవ్వడం అభినందనీయం. 
 -ఆడారి శ్రీనివాస్, గాజువాక
 
 వృద్ధులకు మంచి ఆసరా
 జగన్మోహన్రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టో అందరూ స్వాగతించేలా ఉంది. ప్రతి మండలంలోనూ వృద్ధాశ్రమం ఏర్పాటుచేయాలనే ఆలోచన చాలా బాగుంది. డ్వాక్రా సంఘాల మహిళల రుణాల మాఫీ చేస్తామని చెప్పడం మరింత బాగుంది. మహిళా సంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని సూచిస్తోంది. 
 -డాక్టర్ జగదీష్ ప్రసాద్, గాజువాక
 
 విశాఖపై ఎంతో ప్రేమ చూపారు
 విశాఖనగరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దుతానని జగన్మోహన్రెడ్డి చెప్పారు. దీన్ని ప్రజలంతా హర్షిస్తున్నారు. కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇపుడు కాలుష్యం లేని నగరంగా జగన్మోహన్రెడ్డి చేస్తానని మ్యానిఫెస్టోలో పొందుపర్చడం సంతోషకరం.
 -ఆకుల వెంకటేశ్వరరావు, గాజువాక
 
 జగన్ చెబితే చేసినట్లే..
 విశాఖను కాలుష్యరహితంగా మారుస్తానన్న జగన్ మ్యానిఫెస్టోను మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. దశాబ్దాలుగా కాలుష్యంతో నరకయాతన అనుభవిస్తున్నాం. మా తాతలు, తండ్రులు, చివరకు మా పిల్లలకూ ఈ అవస్థ తప్పలేదు. రోగాలతో ఇక్కడే బతకలేక.. జన్మస్థలాన్ని వదలిపెట్టి వెళ్లలేక బాధపడుతున్నాం. రాజన్న బిడ్డగా జగన్ మాటలను మేమంతా నమ్ముతున్నాం.
 -గద్దేపల్లి రాము, చిలకపేట, ఓల్డ్‌టౌన్.
 
 వైఎస్ హయాం స్వర్ణయుగం
 వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చాకే ఉద్యోగులకు మృచి పిఆర్సీ వచ్చి జీతభత్యాలు పెరిగాయి. ఆయన హయాంలో ఉద్యోగుల కుటుంబాలన్నీ బాగుపడ్డాయి. మళ్లీ ఆయన తనయుడు జగన్మోహనరెడ్డి ఉద్యోగుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో పిఆర్సీపై హామీ ఇవ్వడంతో ఉద్యోగ వర్గాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఆయన హామీ ఇచ్చారంటే అమలు చేస్తున్నట్లే లెక్క.
 - వంటాకు సన్నిబాబు, ఉపాధ్యాయుడు, చోడవరం.


