breaking news
public hearing
-
పెల్లుబికిన విద్యుదావేశం
సాక్షి,అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చరిత్రలో ఎన్నడూ ఇలా ఒకే ఒక సభ్యుడు వేదికపై ఉండి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం చూడలేదు. ప్రతిసారీ చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండి బహిరంగ విచారణ చేపట్టేవారు. ఈసారి ఒక్కరే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే.’’ అంటూ ప్రజలు, నాయకులు ఏకిపారేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమరి్పంచిన 2026–27 ఆదాయ, అవసరాల నివేదికలు,టారిఫ్ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ మంగళవారం తిరుపతిలో మొదలైంది.ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీఈఆర్సీ సభ్యుడైన పీవీఆర్ రెడ్డి, ఇన్చార్జ్ చైర్మన్ హోదాలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. వేదికపై ఆయన ఒక్కరే కూర్చుని సమస్యలను, సూచనలను వినడంపై అక్కడికి వచ్చిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గడిచిన 20 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని తాము చూడలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ చైర్మన్‌ను, సభ్యుడిని నియమించే తీరిక ఎందుకు లేదని వారంతా ప్రశ్నించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రజలను లోనికి అనుమతించకపోవడంతో ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి ప్రజలను అనుమతించకుండా, అంతా అధికారులే ఉండి విచారణ జరపడం ఏమిటని వారు నిలదీశారు. దీంతో చైర్మన్(ఇన్చార్జి) కల్పించుకుని అందరినీ లోనికి అనుమతించాల్సిందిగా ఆదేశించారు. చార్జీలు పెంచేశారు.. ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వరు 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏపీఈఆర్సీ సాధించిన లక్ష్యాలను, ఇచ్చిన ఆదేశాలను చైర్మన్(ఇన్చార్జి) పీవీఆర్ రెడ్డి వివరించారు. ఆ వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యుత్ వినియోగదారుల నుంచి వినతులను స్వీకరించారు. పలువురు నేతలు పేదల గుడిసెలకు విద్యుత్ సర్విసులు మంజూరు చేయడం లేదని, మీటర్ల కోసం నిరీ్ణత రుసుమును కూడా కట్టించుకున్నారని ఫిర్యాదు చేశారు. అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టబోమని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు బలవంతంగా పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వ్యవసాయ విద్యుత్ సర్విసు కోసం దరఖాస్తు చేస్తే నెలలు, సంవత్సరాలు కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకపోవడం వల్ల పంటలు కోల్పోయి రూ.లక్షలు నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీలు భారీగా పెంచేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.4495 కోట్ల భారం ప్రజలపై పడకుండా చేశామని, ఇప్పుడు వసూలు చేస్తున్న ట్రూ అప్ చార్జీలు త్వరలోనే పూర్తవుతాయని, భవిష్యత్తులో ఇక ఉండవని చైర్మన్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడొస్తున్న చార్జీ గతంలో వాడిన దానిపై వేస్తున్నారని వివరించారు. అభిప్రాయసేకరణకు ముందు మూడు డిస్కంల ప్రగతి నివేదికలను సీఎండీలు పి.పుల్లారెడ్డి, ఐ.పృథ్వీతేజ్, శివశంకర్ లోతేటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.యూనిట్ రూ.2.49 ఎక్కువని రూ.4.60కి ఎలా కొంటారు? గత ప్రభుత్వం సెకీతో యూనిట్ రూ.2.49 కి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటే అది తప్పని సీఎం చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో మాట్లాడి యాక్సిస్ నుంచి రూ.4.60కి యూనిట్ చొప్పున కొనడానికి ఏవిధంగా ఒప్పందం చేసుకుంటారంటూ సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యుడు కందరాపు మురళి ప్రశ్నించారు. ట్రూ డౌన్ చేశామంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.17 వేల కోట్లు విద్యుత్ భారాలు ప్రజలపై వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టైమ్ ఆఫ్ డే విధానంలో మార్పుల వల్ల 12 శాతం విద్యుత్‌పై అధిక ధరలు పడతాయని, దానిని మరోసారి పరిశీలించాలని పారిశ్రామిక వేత్త కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. అసలు ఆదాయ లోటు ఎందుకు వస్తోందని, లోపం ఎక్కడుందని విద్యుత్ రంగ నిపుణులు ఎం.వేణుగోపాలరావు ప్రశ్నించారు. అందరి అభిప్రాయాలనూ ఇన్చార్జ్ చైర్మన్ నమోదు చేసుకున్నారు. -
‘నీరు’గార్చేస్తున్నారు!
నీరు–చెట్టు అక్రమాల గుట్టు బట్టబయలైనా కానరాని చర్యలు సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్‌కు మోకాలడ్డు ఇరిగేషన్ జేఈ, డీఈఈ సస్పెండ్ చేయాలన్న కలెక్టర్ ఉత్తర్వులు భేఖాతర్ ఫోర్జరీ సంతకాలపై కొరవడిన విచారణ రాజకీయ అండతో తప్పించుకుంటున్న అక్రమార్కులు ఇరిగేషన్ అధికారులు చేపడుతున్న విచారణపై కలగని నమ్మకం సాక్షి ప్రతినిధి, విజయనగరం: అక్రమాలు జరుగుతున్నా... పట్టించుకోరు. ఆరోపణలు వినిపిస్తున్నా... చర్య తీసుకోరు. నిబంధనలు అతిక్రమిస్తున్నా... కిమ్మనరు. ఇదంతా అస్మదీయుల వరకే. పరాయివారైతే వెంటనే చర్యలకు ఉపక్రమించే పాలకులు తమవారు తప్పు చేస్తే వెనకేసుకు వస్తారు. వాటిని నీరుగార్చేవరకూ నిద్రపోరు. తమవారి అక్రమాలకు సహకరించేవారినీ పరిరక్షిస్తుంటారు. ఇందుకు ఉదాహరణే జిల్లాలో జరిగిన నీరు–మీరు చెట్టులో జరిగిన అక్రమాలపై చర్యల్లో జాప్యం. ఒకసారి స్టేట్ రీసోర్స్టీమ్ పర్యటించి... అక్రమాల నిగ్గు తేల్చింది. వాటిపై పబ్లిక్ హియరింగ్‌ను మాత్రం వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. కాలయాపన చేసి నీరుగార్చే యత్నం చేస్తున్నారు. మరోసారి ఇరిగేషన్ అధికారులు జరుపుతున్న పరిశీలనలు తమను తప్పుదారి పట్టించేందుకేనని ప్రజలు నిర్ధారణకు వచ్చేశారు. రామభద్రపురం మండలం కోట శిర్లాం గ్రామంలోని జంటిగెడ్డ వద్ద నిర్మించిన చెక్‌డామ్. నాసిరకంగా నిర్మించడం వల్ల ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీని కోసం రూ. 11లక్షల 65వేల మేరకు బిల్లులు చెల్లించేశారు. ఇక్కడ జరిగిన అవినీతి భాగోతాన్ని ఇరిగేషన్ అధికారులు గురువారం కళ్లారా చూశారు. నాసిరకం నిర్మాణాలు చేపట్టిన వారి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇదే కాదు ఏడొంపుల గెడ్డపై రూ. 11లక్షల 35వేల 200తో నిర్మించిన చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది. దీన్నీ పరిశీలించారు. సిమాలు మట్టిగెడ్డపై చెక్‌డామ్ నిర్మించినట్టు రికార్డుల్లో చూపించి రూ. 11లక్షల 83వేల 145 కాజేసిన ప్రాంతాన్నీ చూశారు.దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా అక్రమాలు జరిగిన ఇన్నాళ్లకు ఇరిగేషన్ అధికారులు విచారణ చేపడుతున్నారు. బిల్లులు పూర్తిగా డ్రా చేశాక ఫిర్యాదులు వెల్లువెత్తడంవల్లే అదైనా చేస్తున్నారు. ముందే విచారణ చేపట్టినట్టయితే అక్రమార్కుల అవినీతి భాగోతమంతా బయటపడేది. ఏదైతేనేమి ఇప్పటికైనా విచారణకు వచ్చారు. బుధ, గురువారాల్లో ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వి.రమణమూర్తి, ఈఈ జి.వి.రమణ, పలువురు జేఈలు విచారణపేరుతో పరిశీలన చేశారు. కాకపోతే, గత అనుభవాల దష్ట్యా చర్యలపై అనుమానాలు నెలకున్నాయి. అక్రమార్కులకు పాలకుల అండ నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనుల్లో రామభద్రపురం మండలంలోనే రూ. 3కోట్ల మేర అక్రమాలు జరిగాయి. సోషల్ ఆడిట్లో ఈ విషయం రుజువైంది కూడా. స్లూయిజ్, మదుములు, తూముల నిర్మాణాల పేరిట దోపిడీకి పాల్పడ్డారనీ, అసలు పనులు చేపట్టకుండా బిల్లుల చేసుకున్నారనీ... పైపై మెరుగులు దిద్ది పెద్ద ఎత్తున పనులు చేసినట్టు బిల్లులు డ్రా చేసుకున్నారనీ.. కొన్నిచోట్ల నాసిరకం పనులు చేపట్టి నిధులు మింగేశారనీ దాదాపు నిర్థారణకు వచ్చారు. అయితే దాదాపు అధికార పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడటంతో సోషల్ ఆడిట్‌పై పబ్లిక్ హియరింగ్ జరగకుండా, తక్షణ చర్యలు లేకుండా నేతలు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్ అవినీతి అక్రమాలకు సంబంధం ఉన్న ఇరిగేషన్ జేఈ, డీఈలను సస్పెండ్ చేయాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రామభద్రపురం ఎంపీడీఓ, ఏపీఓ సస్పెండ్ చేసిన రోజునే ఈ ఉత్తర్వులు ఇచ్చారు దాదాపు నెల రోజులు కావస్తోంది. కానీ ఇంతవరకు ఆ ఉత్తర్వులు అమలు కాలేదు. కారణం టీడీపీ నేతలకు ఆ ఇంజినీర్లు సంపూర్ణ సహకారం అందించినందుకే. పనులు ఎలా చేసినా బిల్లులు ఇచ్చేశారు. ఎంబుక్‌ల్లో ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇష్టారీతిన కొలతలు నమోదు చేసేశారు. నచ్చినంతకు బిల్లు తయారు చేసి పాస్ ఆర్డర్ జారీ చేసుకున్నారు. మరికొన్నిచోట్ల కొలతల పుస్తకాలు(ఎంబుక్) తారుమారు చేసి నిధులు డ్రా చేసేశారన్న వాదనలూ ఉన్నాయి. దీనిపై రామభద్రపురం పోలీసు స్టేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.వి.రమణ ఏకంగా కేసు పెట్టారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసేశారని ఆయన ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా విచారణ చేపట్టలేదు. ఎవరా ఘనులన్నది నేటికీ తేల్చలేదు. దీని వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే వాదనలు ఉన్నాయి. -
స్కూల్ ఫీజులపై ఏమైనా చెప్పాలనుకుంటున్నారా...
హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్లు విచ్చిలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులపై మరో పోరుకు స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం ఏర్పాటైన జేఏసీ కార్యాచరణ రచించింది. ఇప్పటికే పలు రూపాల్లో అధిక ఫీజుల వసూళ్ల తీరును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. తాజాగా బహిరంగ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి మాజీ చైర్ పర్సన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎం. బుల్గయ్య తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆ జేఏసీ చైర్ పర్సన్ అరవింద జటా, సెక్రటరీ జనరల్ నాగటి నారాయణ పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఇష్టారాజ్యంగా జరుగుతున్న ఫీజు వసూలును నియంత్రిస్తామని ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని వారు పేర్కొన్నారు. చివరకు అసెంబ్లీలో సైతం మాటిచ్చినా ఇంతవరకు కదలిక లేదన్నారు. దీంతో స్కూళ్లు ఫీజులను మరింత పెంచాయని, తల్లిదండ్రులపై తీవ్ర భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ బహిరంగ విచారణ చేపట్టామని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థలు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ వాణి వినిపించాలని పిలుపునిచ్చారు. -
కలెక్టర్ ఆధ్వర్యంలో NTPC ప్రజాభిప్రాయ సేకరణ
-
ఉద్రిక్తంగా మారిన భూసేకరణ సభ
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం గుంటూరు ప్రాంతంలో మంత్రివర్గ ఉపసంఘం చేపట్టిన అభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. ల్యాండ్ పూలింగ్‌కు తీసుకున్న భూములకు ప్రత్యామ్నాయ భూములు ఎక్కడ ఇస్తారో ముందుగానే చెప్పాలని రైతులు నిలదీశారు. కొంతమంది రైతులు నేరుగా తమ భూములు ఇవ్వలేమని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వం ఇవ్వజూపుతున్న పరిహారం తమకు సరిపోదన్నారు. ప్రత్యామ్నాయాలపై మంత్రులను నిలదీశారు. ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది.


