breaking news
Prostitutes Arrested
-
విజయవాడ: స్పా పేరిట హైటెక్ వ్యభిచారం..
పటమట(విజయవాడతూర్పు): మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్ నిర్వాహకులను సోమవారం పటమట పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కల్యాణమండపం సమీపంలో ఉన్న కె.సూ్టడియోలో మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని, దీనిపై తమకు అందిన సమాచారంతో తాము దాడి చేసి ఇద్దరు నిర్వాహకులను, ఎనిమిది మంది యువతులను, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నామని సీఐ కాశీనాథ్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. -
కవ్విస్తున్న వ్యభిచారిణుల అరెస్ట్
హైదరాబాద్: అసభ్యకర చేష్టలు, సైగలతో విటులను ఆకర్షించేందుకు యత్నిస్తున్న నలుగురు వ్యభిచారిణులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం...గౌలిగూడలోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో విటులను ఆకర్షించేందుకు ఉప్పల్‌కు చెందిన నలుగురు వ్యభిచారిణులు ఆ దారిన వెళ్తున్న ప్రయాణికులకు సైగలు చేస్తూ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వారు ఎంజీబీఎస్ ప్రాంగణంలో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న వ్యభిచారిణులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.