breaking news
property datails
-
భూముల రక్షణకు ‘స్వామిత్వ’
న్యూఢిల్లీ: ‘గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసే ‘స్వామిత్వ’ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది గ్రామీణ భారతాన్ని మార్చే విప్లవాత్మక కార్యక్రమం అని, ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా కీలక ముందడుగు అని పేర్కొన్నారు. ఈ కార్డులను ఉపయోగించి పల్లె ప్రజలు బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చన్నారు. అలాగే, దీంతో గ్రామస్తుల మధ్య భూ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తి తగాదాలు తొలగిపోతాయన్నారు. ఈ ‘సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వామిత్వ)’ కార్యక్రమంలో వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. ఆస్తిపై యాజమాన్య హక్కు దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెప్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఆస్తులకు సంబంధించి చట్టబద్ధమైన రికార్డులు ఉన్నవారు మూడింట ఒక వంతు మాత్రమేనని ప్రధాని వెల్లడించారు. ‘గ్రామాల్లోని యువత ఈ ప్రాపర్టీ కార్డులను హామీగా పెట్టి, స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. ఆస్తిపై చట్టబద్ధ హక్కును కలిగి ఉండడం వల్ల యువతలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. తద్వారా స్వావలంబన సాధించగలుగుతారు’ అన్నారు. ప్రజలు తమ ఆస్తులపై స్పష్టమైన యాజమాన్య హక్కులు కలిగి ఉండటం అవసరమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీతో భూముల మ్యాపింగ్ చేయాలని యోచిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని వెనుకవైపు ఆదివారం జయంతి ఉన్న సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్, ఆరెస్సెస్ దిగ్గజం నానాజీ దేశ్‌ముఖ్‌ల ముఖచిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆ మహనీయుల సిద్ధాంతాలను ప్రధాని వివరించారు. గ్రామాల్లోని ప్రజలు తరచు ఆస్తికి సంబంధించిన వివాదాల్లో చిక్కుకుపోతే.. వారే కాకుండా, సమాజమూ అభివృద్ధి చెందబోదని నానాజీ దేశ్‌ముఖ్ భావించేవారిని వివరించారు. ఆ సమస్యను అంతం చేసే దిశగానే ఈ ఆస్తి కార్డుల విధానాన్ని ప్రారంభించామన్నారు. ఆస్తి కార్డుల ద్వారా బ్యాంక్ ఖాతాలను, విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, పక్కా ఇల్లు తదితర సౌకర్యాలు పొందవచ్చన్నారు. ప్రస్తుతం యూపీ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరా ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 763 గ్రామా ల్లో ఈ స్వామిత్వను ప్రారంభించారు. ఈ గ్రామా ల్లోని ప్రజలు తక్షణం అవసరమనుకుంటే తమ ఫోన్లకు అధికారులు ఎస్ఎంఎస్ చేసిన లింక్ ద్వారా ప్రాపర్టీ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆస్తి కార్డుల పంపిణీని త్వరలో ప్రారంభిస్తాయి. ప్రతీ కార్డుకు ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. రానున్న మూడు, నాలుగేళ్లలో ప్రతీ కుటుంబానికి ప్రాపర్టీ కార్డులను అందజేస్తామని మోదీ తెలిపారు. వ్యవసాయ బిల్లులను వారే వ్యతిరేకిస్తున్నారు దళారి వ్యవస్థ బాగుపడాలని కోరుకునేవారే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారని ప్రధాని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. మధ్యవర్తులు, దళారులు అందించిన అధికారంతోనే వారు రాజకీయాలు చేశారన్నారు. వారి కుయుక్తులకు రైతులు మోసపోరని వ్యాఖ్యానించారు. గత ఆరు దశాబ్దాల్లో విపక్ష ప్రభుత్వాలు చేయలేని గ్రామీణాభివృద్ధిని గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. ‘దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంటుందని చెబుతుంటారు. కానీ గత ప్రభుత్వాలు గ్రామీణ భారతాన్ని పట్టించుకోకుండా వదిలేశాయి’ అని విమర్శించారు. ‘గ్రామాలు, పేదలు, రైతులు, కూలీలు స్వావలంబన సాధించడం చాలా మందికి ఇష్టం ఉండదు. మా సంస్కరణలు రైతుల పొట్టకొడ్తున్న దళారుల అక్రమ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే మా సంస్కరణలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు’ అని ప్రధాని ఆరోపించారు. ‘ఆ మధ్యవర్తులు, దళారుల వల్ల బలపడిన కొందరు కూడా ఈ వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు’ అని విపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు. -
కనకపు సింహాసనమున!!
రాజభవంతిలాంటి భవనం.. సార్ వస్తున్నారహో..ఇంట్లో పనోడి అరుపు.. టైలు కట్టుకుని లైనులో నిల్చున్న పెద్ద పెద్ద ఉద్యోగులంతా అలర్ట్ అయ్యారు..ఇంతలో సార్ రానేవచ్చారు.. మందీమార్బలంతో.. అక్కడ ఉన్న సింహాసనంలాంటి కుర్చీమీద ఆసీనులయ్యారు.. అంతా సార్ ఏం చెబుతారా అని ఆసక్తిగా చూస్తున్నారు..అంతా నిశ్శబ్దం..ఇంతలో సార్ గంభీరంగా అన్నారు.. భౌ.. భౌ.. భౌభౌ.. వెంటనే విషయం అర్థమైనట్లుగా అందరూ హర్షధ్వానాలు చేశారు.. వినడానికి విచిత్రంగా ఉందా.. ఇదంతా నిజమేనండోయ్. అందుకే ఇక కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి.. అన్న సుమతీ శతకాన్ని పక్కనపెట్టేయండి.. చీ కుక్క బతుకు అనీ చీప్‌గా చూడటం మానేయండి.. ఎందుకంటే.. ఈ వార్తంతా చదివాక ఆహా కుక్క బతుకు అని అనాల్సిందే.. జంతువుల లగ్జరీ లైఫ్‌ను చూసి కుళ్లుకోవాల్సిందే.. ఇది 2018లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన జంతువుల జాబితా మరి.. ఓసారి చూసేద్దామా.. 1 గుంథర్–4 దేశం: జర్మనీ ఆస్తి: 2,600 కోట్లు ఈ జర్మన్ షెపర్డ్‌కు ఈ ఆస్తి తన తండ్రి గుంథర్–3 నుంచి వారసత్వంగా సంక్రమించింది.గుంథర్–3 యజమాని కర్లోటా లీబెన్స్టీన్ 1991లో చనిపోయింది. యావదాస్తి తన పెంపుడు కుక్క పేరిట రాసిపోయింది. ఆ సమయంలో ఆమె ఆస్తి 740 కోట్లే. అయితే.. గుంథర్ పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టులోని ట్రస్టీలు ఆ సొమ్మును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టారు. అది పెరిగి ఈ స్థాయికి చేరింది. 2 గ్రంపీ క్యాట్ దేశం: అమెరికా ఆస్తి: 700 కోట్లు గుంథర్లాగా దీనికి వారసత్వంగా ఆస్తి రాలేదు. ఆ పిల్లి తన సొంత కాళ్లపై తాను నిలబడింది.కోటీశ్వరురాలైంది. దాని ముఖమే దానికి మనీ తెచ్చిపెట్టింది. ముఖం ముడుచుకున్నట్లు పెట్టే సీరియస్ లుక్ వల్ల బోలెడన్ని యాడ్లు వచ్చాయి. మోడలింగ్ చేసింది. సినిమాల్లోనూ నటించింది. 3 ఒలీవియా బెన్సన్ దేశం: బెన్సన్, అమెరికా ఆస్తి: 680 కోట్లు ప్రముఖ పాప్‌గాయని టేలర్ స్విఫ్ట్ పెంపుడు మార్జాలం. దాంతో ఆవిడలాగే దీనికీ క్రేజ్ వచ్చేసింది. తన యజమానితో కలిసి పలు యాడ్లలో నటించింది.ఇలా నాలుగు కాళ్లా సంపాదిస్తోంది. 4 శాడీ సన్నీ లారెన్ లేలా, ల్యూక్ దేశం: అమెరికా ఆస్తి: 210 కోట్లు టాక్‌షో క్వీన్ ఓప్రా విన్ఫ్రే బయటివాళ్లకే భారీ భారీ బహుమతులను ఇస్తూ ఉంటుంది. అలాంటిది తన ‘పంచ’ప్రాణాలకు ఇంకెంత ఖరీదైన బహుమతి ఇచ్చిందబ్బా అని చూస్తే.. ఏకంగా ఇదిగో ఇన్ని కోట్లు వాటికి రాసిచ్చేసి.. ట్రస్టును ఏర్పాటు చేసింది. ఈ మేరకు వీలునామా రాసేసింది. 5 గిగూ దేశం: బ్రిటన్ ఆస్తి: 105 కోట్లు నిజం.. చివరికి కోడిపెట్ట కూడా కోటీశ్వరురాలే. ఎందుకంటే.. దీన్ని పెంచుకుంది బ్రిటీషు సంపన్నుడు మైల్స్ బ్లాక్ వెల్. 2011లో తాను చనిపోయే ముందు వీలునామా రాస్తూ.. దీన్ని కూడా కోటీశ్వరురాలిని చేసి పోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా జంతువులు మనుషులతో పోలిస్తే... మనీ విషయంలో ముందున్నాయి.మహారాజుల్లా బతికేస్తున్నాయి. టాప్–10 జాబితాలో బార్ట్ అనే ఎలుగుబంటి కూడా ఉంది.బార్ట్ నటుడు. ఆస్తి దాదాపు 50 కోట్లు.. అలాగే.. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ పెంపుడు చింపాంజీ కూడా కాస్తో కూస్తో ఆస్తిపరురాలే. దాని ఆస్తి రూ.14 కోట్లు. ఈ మధ్య సొంతంగా కూడా సంపాదిస్తోందట. బొమ్మలు వేసి.. ఒక్కోటి లక్ష చొప్పున అమ్ముతోందట!! ఇప్పటికే వీటి ఆస్తుల వివరాలు చూసి.. మన మనసు అదో రకంగా అయిపోయి ఉంటుంది.. అందుకే ఈ ఆస్తిపాస్తుల చిట్టాకు ఫుల్స్టాప్ పెట్టేద్దామా మరి.. బై.. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
అభ్యర్థుల ఆస్తులివే..!
శాసన సభ ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. అభ్యర్థులంతా తమ నామినేషన్ల పత్రంతో పాటు ఆస్తులు, అప్పుల వివరాలు అధికారులకు అందజేశారు. అభ్యర్థితోపాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలనూ వాటిలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. నాగార్జున సాగర్ : జానారెడ్డి : కుందూరు జానారెడ్డి తన వద్ద రూ.4.25 లక్షలు, ఆయన సతీమణి సుమతి చేతిలో నగదు రూ.3.50లక్షలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ.2,73,80,000 విలువైనవి ఉండగా, చరాస్తులు రూ.58,29,361 విలువైని ఉన్నట్లు చూపించారు. అయన సతీమణి సుమతి పేరుతో ప్రస్తుత రూ.9,61,24,333 విలువైన స్థిరాస్తులు, చరాస్తులు రూ.4,05,80,592 విలువైన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరి పేరుతో అప్పులు ఏమీ లేనట్లు పేర్కొన్నారు. నర్సింహయ్య : టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య పేరుతో రూ.43లక్షలు విలువైన స్థిరాస్తి, ఆయన సతీమణి నోముల లక్ష్మి పేరుతో కోటీ నాలుగు లక్షల 90వేల విలువైన స్థిరాస్తి ఉన్నది. చరాస్తులు నోముల నర్సింహ్మయ్య పేరుతో రూ.23,47,000 ఉండగా, ఆయన భార్య పేరుమీద రూ.17,63,000 విలువైనవి ఉన్నవి. నర్సింహయ్య చేతిలో 15వేలు, లక్ష్మి చేతిలో రూ.3వేలు ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు. నివేదిత: కంకణాల నివేదిత పేరుతో 29ఎకరాల వ్యవసాయ పొలం (విలువ చూపలేదు), రూ.3,28,50,843విలువై చరాస్తి, చేతిలో నగదు రూ.30 వేలు ఉండగా.. 30లక్షల అప్పు ఉన్నట్లు తెలిపారు. ఆమె భర్త కంకణాల శ్రీధర్‌రెడ్డి పేరుమీద రూ.6,08,34,090 విలువైన చరాస్థి, చేతిలో రూ.25వేలు ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు. వారి కూతురు కంకణాల కావ్యకు కోటీ 20వేల రూపాయల విలువైన చరాస్థి, 2.06 ఎకరాల స్తిరాస్థి ఉండగా.. చేతిలో నగదు ఏమీ లేకపోగా రూ.4కోట్ల50లక్షల అప్పు ఉన్నట్లు చూపించారు. హుజూర్ నగర్.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి: టీపీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆస్తులు గత ఎన్నికల కంటే ప్రస్తుతం తగ్గాయి. 2014 ఎన్నికల సమయంలో అఫిడవిట్లో తన వద్ద రూ. 34,04,152 డిపాజిట్లు ఉన్నట్లుగా చూపించారు. ప్రస్తుతం తనకు సొంత కారు కూడా లేదని, తన చేతిలో కేవలం రూ.18 వేలు, తన సతీమణి పద్మావతిరెడ్డి వద్ద రూ.5 వేలు ఉన్నాయని ప్రకటించారు. ఉత్తమ్ ఆస్తి విలువ రూ.2 కోట్లు కాగా, ఆయన భార్య పేరు మీద కారు, వ్యవసాయ భూమితో సహా రూ.28.29 లక్షల స్థిర, చరాస్థులు ఉన్నట్లు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఉత్తమ్ వార్షికాదాయం రూ.30లక్షల మేర పడిపోయిందని ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. 2014లో తన పేరు మీద రూ.34.04,152 డిపాజిట్లు ఉన్నట్లుగా చూపించగా.. ప్రస్తుతం అవి రూ.8.94 లక్షలకు పడిపోయాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ. 2.04లక్షలుగా చూపించారు. ఎస్.సైదిరెడ్డి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి తన చేతిలో రూ.15 వేలు. తన భార్య రజితారెడ్డి చేతిలో రూ.10 వేల ఉన్నట్లుగా చూపించారు. తన పేరు మీద రూ.12,50,000 విలువ చేసే కారు, రూ.9 లక్షల విలువైన బంగారం, తన సతీమణి పేరు మీద రూ.50 లక్షల విలువైన బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. సూర్యాపేట మండలం దురాజ్‌పల్లి వద్ద, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో రూ.5,25,83,600 విలువైన భూములు, స్థలాలు, తన సతీమణి రజితారెడ్డి పేరు మీద అనంతగిరి మండలం మొగలాయికోట, కోదాడ తదితర ప్రాంతాల్లో రూ.1,83,81,000 విలువైన వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు ఉన్నట్లు చూపించారు. సూర్యాపేట : గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి : టీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మొత్తం చరాస్తుల విలువ రూ.58,77,625, స్థిరాస్తుల విలువ రూ.66,95,320 ఉన్నట్లుగా అఫిడవిటిలో చూపారు. చేతిలోనగదు రూ.1,39,873, బ్యాంకు ఖాతాలో రూ.25,47,564, బాండ్స్ రూపంలో పెట్టుబడి రూ.95,948, పోస్టల్ సేవింగ్ రూ.11,37,131 ఉన్నట్లుగా పేర్కొన్నారు. రూ.15,52,960 విలువైన ఇన్నోవా, రూ.66,000 విలువ చేసే 20 గ్రాముల బంగారం ఇలా మొత్తం చరాస్తులు రూ.58,77,615 ఉన్నట్లు చూపించారు. రూ.9,50,000 అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. భార్య సునీత చేతిలో నగదు రూ.4,68,787, బ్యాంకు ఖాతాలో రూ.8,22,208, బాండ్స్ రూపంలో పెట్టుబడి రూ.31,67,911, పోస్టల్ సెవింగ్ అండ్ ఎల్ఐసీ పాలసీల్లో రూ.8,85,527, అడ్వాన్ల రూపంలో రూ.58,94,400, రూ.1,40,786 విలువ చేసే రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం, రూ.17,31,250 విలువ చేసే 500 గ్రాముల బంగారం, మొత్తం చరాస్తి విలువ రూ.1,31,06,871 ఉన్నట్లుగా పేర్కొన్నారు. అదే విధంగా రూ.96,79,523 విలువ చేసే స్థిరాస్తులు అయితే ఇందులో రూ.87,00,000ల అప్పులు ఉన్నట్లు చూపారు. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి రూ.48,03,228 విలువ గల చరాస్థులు, కోటి విలువగల స్థిరాస్థులు, రూ.34,86,157 అప్పులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. హ్యాండ్ క్యాష్ రూ.25,000, బ్యాంకు ఖాతాలో రూ.20,81,228, రూ.16 లక్షల విలువ చేసే సఫారి వాహనం, రూ.3లక్షల విలువ చేసే జీప్, రూ.7,65,000 విలువ చేసే 250 గ్రాముల బ్రాస్లెట్, రూ.32వేల విలువ గల 10 గ్రాముల ఉంగరం ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం చరాస్తి విలువ రూ.48,03,228 కాగా రూ.కోటి విలువ చేసే స్థిరాస్తులు ఉండగా ఇందులో రూ.34,86,157ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. సంకినేని వెంకటేశ్వర్రావు : బీజేపి అభ్యర్థిగా పోటీలో ఉన్న సంకినేని వెంకటేశ్వర్రావు రూ.39,35,382 విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తన భార్య పేరుమీద రూ.13,64,018 విలువగల చరాస్థులు ఉన్నట్లు చూపారు. హ్యాండ్ క్యాష్ రూపంలో రూ.3,25,856 బ్యాంకు ఖాతాలో రూ.36,09,526 ఉండగా రూ.20,53,100 అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇతర వాహనాలు, ఆస్తులు లేనట్లు పేర్కొన్నారు. తన భార్య వద్ద హ్యాండ్ క్యాష్ రూపంలో రూ.11,50,640, బ్యాంక్ ఖాతాలో రూ.9,378, రూ.2,04,000 విలువ గల 512 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపారు. రూ.9,95,056 అప్పు ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా ఇతర కుటుంబ సభ్యుల వద్ద హ్యాండ్‌క్యాష్ రూపంలో రూ.1,26,085, బ్యాంక్ ఖాతాల్లో రూ.40,14,367 ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.3,16,46,000 విలువగల స్థిరాస్తులు ఉన్నట్లు లెక్క చూపారు. భువనగిరి : పైళ్ల శేఖర్‌రెడ్డి : భువనగిరి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన పైళ్ల శేఖర్‌రెడ్డి చరాస్తులు 2014తో పోలిస్తే పెరిగాయి. స్థిరాస్తులు తగ్గాయి. 2014లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఉన్న చరాస్తులతో పోలిస్తే ప్రస్తుతం రూ.38,09,32,639 పెరిగాయి. అలాగే చరాస్తులు రూ.25,96,08,677కు తగ్గాయి. ప్రస్తుతం ఆయన పేరున చరాస్తులు రూ. 69,00,80,939, స్థిరాస్తులు రూ.1,59,25,323 ఉన్నట్లు పేర్కొన్నారు. భార్య పేరున చరాస్తులు రూ.5,39,68,923, స్థిరాస్తులు రూ.15,03,18,620 ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి చరాస్తులు రూ. 45,23,75,582, స్థిరాస్తులు రూ. 65,09,03,000, ఆయన భార్య పేరున చరాస్తులు రూ.9,72,15,813, స్థిరాస్తులు రూ.13,17,43,750 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మునుగోడు : కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి : టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తనకు రూ.9.36 కోట్లు ఉన్నట్టుగా చూపించారు. ప్రస్తుత అఫిడవిట్లో సుమారు రూ.12.40 కోట్లుగా చూపించారు. తన భార్య అరుణరెడ్డి పేరు మీద సుమారు రూ.1.92 కోట్లు ఆస్తులు ఉన్నట్టుగా చూపించారు. ప్రభాకర్‌రెడ్డి మీద అప్పులు రూ.74,98,000 చూపించారు. గంగడి మనోహర్‌రెడ్డి : బీజేపీ అభ్యర్థి డాక్టర్ గంగడి మనోహర్‌రెడ్డి 2014 ఎన్నికల్లో రూ.2.40కోట్లు ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత అఫిడవిట్లో సుమారు రూ.2.97 కోట్లుగా చూపించారు. రూ.90లక్షలు అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున భార్య రూ.24లక్షలు ఆస్తులు ఉండగా, ఎటువంటి అప్పులు లేవు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి : కాంగ్రెస్ ఆభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అఫిడవిట్లో సుమారు ఆస్తులు రూ.7.00 కోట్లుగా చూపించారు. తన భార్య లక్ష్మి పేరు మీద సుమారు రూ.288 కోట్లు ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి మీద అప్పులు రూ.18 లక్షల చూపించారు. లక్ష్మి మీద రూ.6.50లక్షలు చూపించారు. సొంత ఇల్లు కూడా లేదని, కుటుంబ సభ్యులు పేరుమీద ఎటువంటి వాహనం లేదని చూపించారు. నకిరేకల్ : వేముల వీరేశం : వీరేశం పేరు మీద చర ఆస్తులు రూ.30లక్షలు ఉండగా ఆయన సతీమణి పుష్పలత పేరు మీద రూ.20లక్షలు చూపారు. స్థిరాస్తులు ఆయన పేరు మీద రూ.36లక్షలు, భార్య పేరు మీద రూ.90 లక్షలు చూపారు. నకిరేకల్ మండలం కడపర్తి శివారులో రూ.35లక్షల విలువ చేసే 10.26 ఎకరాల భూమి వీరేశం పేరుమీద ఉండగా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో 4.18 ఎకరాల భూమి ఉంది. బ్యాంక్ డిపాజిట్లో వీరేశం పేరుమీద రూ.లక్ష, భార్య పుష్పలత పేరుమీద రూ.లక్ష ఉన్నాయి. అప్పుల విషయానికి వస్తే వీరేషం పేరు మీద రూ.3.20లక్షలు, భార్య పుష్పలత పేరు మీద రూ.6.12లక్షలు అప్పులు ఉన్నట్లు వారి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. చిరుమర్తి లింగయ్య : కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీని విలువ రూ.44లక్షలు, ఇదే గ్రామంలో అతని భార్య పార్వతమ్మ పేరు మీద 3.33 ఎకరాల భూమి దీని విలువ రూ.13లక్షలు ఉన్నట్లు చూపారు. చిరుమర్తి చేతిలో రూ.30వేలు, ఆయన భార్య చేతిలో రూ.15వేలు చూపారు. బ్యాంక్ డిపాజిట్లో అతని పేరు మీద రూ.1.50లక్షలు, భార్య పేరు మీద రూ.15వేలు ఉన్నట్లు చూపించారు. చిరుమర్తి వద్ద రూ.75వేల విలువైన బంగారం, ఆయన భార్య వద్ద రూ.5లక్షలు విలువ చేసే 200 గ్రాముల బంగారం, కుమారుడి వద్ద రూ.25వేల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నట్లు చూపారు. చరాస్థులు రూ.3లక్షలు లింగయ్య పేరు మీద, రూ.5లక్షలు పార్వతమ్మ పేరు మీద చూపారు. లింగయ్య పేరు మీద రూ.8లక్షలు, పార్వతమ్మ పేరు మీద రూ.5లక్షల అప్పులు చూపారు. తుంగతుర్తి : గాదరి కిశోర్‌కుమార్ : టీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్ తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. నగదు రూ.25వేలు, భార్య వద్ద రూ.5వేలు, వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ రూ.7,45,251 బీమా, జాతీయ పొదుపు పత్రాలు రూ.7,30,325, భార్య పేరున రూ.33,601 బీమా, జాతీయ పొదుపు పత్రాలు రూ.5లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.22వేల విలువ గల ద్విచక్ర వాహనం, రూ.9లక్షల విలువగల ఇన్నోవా ఉన్నట్లు తెలిపారు. తన వద్ద రూ.3లక్షల విలువైన 100 గ్రాముల బంగారం, భార్య వద్ద రూ.9లక్షల విలువగల 300 గ్రాముల బంగారం, నల్లగొండ సమీపంలోని బుద్దారంలో రూ.13.80లక్షల విలువ గల 13.32 ఎకరాల భూమి, వేములవాడలో భూమి, రాయగిరి, మాలిపురం, సమతాపురి కాలనీ, శాంతినగర్, నల్లగొండలో తన పేరుపై రూ.26లక్షలు, భార్య పేరున రూ.1,18,013 విలువ గల స్థలాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం. తన పేరున రూ.53,01,250, భార్య కమల పేరున రూ.15,31,946 లక్షల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. కోదాడ : నలమాద పద్మావతి : కాంగ్రెస్ కోదాడ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎన్.పద్మావతిరెడ్డి ఆస్తులు 2014 కన్నా స్పల్పంగా పెరిగాయి. చరాస్తుల విషయంలో ఆమె చేతిలో రూ.15 వేల, భర్త ఉత్తమ్ వద్ద రూ.18 వేలు నగదు మాత్రమే ఉన్నాయి. బ్యాంకులలో డిపాజిట్లు, బంగారు ఆభరణాలు, కారు విలువ కలిపి రూ.70,01,146 పేర్కొన్నారు. తన భర్త ఉత్తమ్ పేరు మీద మొత్తం చరాస్తులు రూ.8,94,164 ఉన్నట్లు తెలిపారు. స్థిరాస్తులు మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో 14 ఎకరాల 47 సెంట్ల వ్యవసాయభూమి, హూజూర్‌నగర్‌లో రెండు ప్లాట్లు, కోదాడలో 28 లక్షల 29 వేల విలువైన ఒక ఇల్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భర్త పేరుతో స్థిరాస్తులు జూబ్లిహిల్స్‌లో ఇల్లు, బొగ్గులకుంటలో అపార్టుమెంట్ ప్లాట్, 2025 గజాల స్థలం, మరో రెండు ప్లాట్లు కలిపి 2 కోట్ల 646 రూపాయల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన ఆస్తులు గతంలో కన్నా రూ.20 లక్షలు పెరిగినట్లు ఆమె అఫిడవిట్లో చూపారు. ఆలేరు : గొంగిడి సునీత : ఆలేరు టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత తన పేరుమీద రూ.40 వేలు, పార్చూన్ కారు విలువ రూ.38 లక్షలు, రూ.6.76లక్షల విలువైన బంగారం, రాజపేట మండలం రఘునాథపురంలో 15.07 ఎకరాల భూమి, ఘట్కేసర్ మండలం కొర్రెంలలో 200 చదరపు గజాత స్థలం, వంగపల్లిలో భనవం, మొత్తం దీని విలువ రూ.1,15,05,000. అప్పులు రూ.80వేలు. (పంట రుణం) ఉంది. ఆమె భర్త మహేందర్‌రెడ్డి పేరు మీద నగదు రూ.49 వేలు, ఇన్నోవా కారు విలువ రూ.16 లక్షలు. రూ.2.64లక్షల విలువైన బంగారం, రూ. 3,02,70000 విలవైన ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. అప్పులు, బ్యాంక్ రుణాలు రూ.62,85,00,000 ఉన్నాయి. కూతురు హర్షిత పేరిట రూ.10వేలు. రూ.2.64లక్షల విలువైన బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పులు ఎడ్యుకేషన్ కోసం బ్యాంకులో తీసుకున్న రుణం రూ.25లక్షలు ఉన్నట్లు తెలిపారు. భిక్షమయ్యగౌడ్ : కాంగ్రెస్ ఆలేరు అభ్యర్తి బూడిద భిక్షమయ్యగౌడ్ తన పేరుమీద ఉన్న ఆస్తులు వెల్లడించారు. రూ. 2,00,000, బ్యాంకు డిపాజిట్లు రూ.1.7లక్షలు, రూ.60,000 విలువైన బంగారం, 3 వాహనాలు వాటి విలువ రూ.44 లక్షలు. గుండాల మండలం పారుపల్లి, బుజిలాపూర్లో 55.39 ఎకరాల భూమి ఉందని.. రూ.52 లక్షల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. భార్య సువర్ణ పేరిట.. రూ.79,000, రూ.6లక్షల వివువైన బంగారం, రూ.6,47,847 విలువైన వాహనం. గుండాల మండలం పారుపల్లి, ధర్మాపురంలలో 33.36 ఎకరాల భూమి, ఉప్పల్‌లో 211 చదరపు గజాల ఇల్లు, రూ.16లక్షల విలువైన ఇన్నోవా, రూ.48,13,850 లప్పులు ఉన్నట్లు తెలిపారు. కుమారుడు ప్రవీన్‌కుమార్ పేరిట రూ.15000, రూ. 27,500 డిపాజిట్లు, షేర్లు రూ.70,95,000, రూ.60వేల విలువైన బంగారం, రూ.43లక్షల విలువైన రెండు వాహనాలు, రాంపల్లి, నాగిరెడ్డిగూడ, దర్మాపురంలో 24.30 ఎకరాల భూమి, ఉప్పల్‌లో 266 చదరపు గజాల ఇల్లు ఉంది. అప్పులు రూ.1.97కోట్లు ఉన్నట్లు తెలిపారు. కూతురు ప్రసన్నవాణి పేరిట నగదు రూ.15,000, డిపాజిట్లు రూ.2వేలు, రూ.3లక్షల విలువైన బంగారం, కొరటికల్‌లో 5 ఎకరాల భూమి ఉంది. -
ప్రధానికి ఆస్తులు, అప్పుల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ కేబినెట్లోని మంత్రులందరూ రెండు నెలల్లోగా తమ ఆస్తులు, అప్పులు, వ్యాపారాల వివరాలను ప్రధానమంత్రికి సమర్పించాలి. తమతో పాటు కుటుంబసభ్యుల పేరిట ఉన్న స్థిరాస్తులు, షేర్లు.. డిబెంచర్ల పూర్తి విలువ సుమారుగా ఎంత, నగదు, ఆభరణాల నిల్వకు సంబంధించిన వివరాలన్నిటినీ వెల్లడించాలి. అంతేకాదు మంత్రులుగా నియూమకం కాకముందు ఏవైనా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంటే వాటితో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలి. వ్యాపార సంస్థల యూజమాన్యం, నిర్వహణ నుంచి వైదొలగాలి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం మంత్రుల కోసం హోం మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన నియమావళిలో ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఈ నియమావళి అమలును స్వయంగా ప్రధానమంత్రి పర్యవేక్షిస్తారు. పౌర సేవల విషయంలో రాజకీయ నిష్పాక్షికతను కాపాడాల్సిందిగా ఇందులో మంత్రులకు సూచించారు. ఉన్నతాధికారుల విధులు, బాధ్యతలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు వారిపై ఒత్తిడి తేరాదని ఆదేశించారు. మంత్రుల కుటుంబసభ్యులు ప్రభుత్వానికి సేవలందించడం లేదా వస్తువులు సరఫరా చేయడానికి సంబంధించిన ఎలాంటి వ్యాపారాన్నైనా ప్రారంభించడం కానీ లేదా ఆ వ్యాపారంలో పాల్గొనడం కానీ చేసేందుకు వీల్లేదు. కేంద్ర మంత్రులతో పాటు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ / కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు.. తమ భర్త లేదా భార్య, తమపై ఆధారపడినవారు దేశంలో లేదా విదేశంలో ఏ విదేశీ ప్రభుత్వ ఉద్యోగంలోనైనా చేరేందుకు అనుమతించకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం సేకరించినప్పుడు మినహా సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి స్థిరాస్తులను కొనడం కానీ లేదా ప్రభుత్వానికి అమ్మడం కానీ చేయరాదు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పదవిలో కొనసాగే వరకు ప్రతి ఏటా ఆగస్టు 31లోగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రధానికి సమర్పించాలని నియమావళి స్పష్టం చేస్తోంది.