breaking news
Prohibition Bill
-
బహు భార్యత్వం నిషేధం బిల్లుకు అసోం అసెంబ్లీ ఆమోదం
గౌహతి: బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ అసోం అసెంబ్లీ గురువారం ఒక బిల్లును ఆమోదించింది. ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహమాడిన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇందుకు కొన్ని మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, రాష్ట్రంలో ఆరో షెడ్యూల్ అమల్లో ఉన్న గిరిజన ప్రాంతాలకు ఇది వర్తించదని తెలిపింది. అసోం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమీ బిల్లు–2025ను గురువారం హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రవేశపెట్టారు. ఇందులో మతంతో సంబంధం లేదని, ఇస్లాంకు వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలతోపాటు ఇతర అన్ని వర్గాలకు ఇది వర్తిస్తుందన్నారు. ఈ బిల్లున ఉమ్మడి పౌర స్మృతి దిశగా పడిన ముందడుగుగా అభివర్ణించారు. -
ముహూర్తం కలిసి రాలేదు !
మూఢాఛారాల నిషేధ బిల్లుపై మంత్రి వర్గంలో కుదరని ఏకాభిప్రాయం ముసాయిదా బిల్లుపై వెనక్కు తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు: మూఢాచారాల నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లుపై మంత్రి వర్గంలో ఏకాభిప్రాయం కుదరలేదు. రాష్ట్రంలో నరబలి, చేతబడులు వంటి వాటి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మూఢాచారాల నిషేధ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశల్లో చట్టసభల్లో ప్రవేశపెట్టాలని భావించింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై శుక్రవారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో చర్చించగా, మంత్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మంత్రి వర్గంలోనే బిల్లుపై ఏకాభిప్రాయం కుదరక పోవడంతో, ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూఢాచారాల నిరోధక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలన్న నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఇక శుక్రవారం జరిగిన మంత్రి మండలి భేటీలో మూఢాచారాల నిషేధానికి రూపొందించిన ముసాయిదా బిల్లుపై చర్చించారు. ఇప్పటికే ఈ బిల్లుపై పలువురు మఠాధిపతులు, కొన్ని సంఘాలు, కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ బిల్లుపై కొంతమంది మంత్రులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతేకాక ఈ బిల్లులోని అంశాలను మరింత క్షుణ్ణంగా వివరించాలని సైతం కొంత మంది మంత్రులు సీఎం సిద్ధరామయ్యను కోరారు. దీంతో ఇప్పటికి ఈ బిల్లును ప్రవేశపెట్టే విషయాన్ని పక్కనపెట్టాలని సీఎం సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి మండలి పూర్తి సమ్మతితోనే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావించిన సీఎం సిద్ధరామయ్య ఈ ముసాయిదా బిల్లులోని అంశాలను మరింత క్షుణ్ణంగా వివరించాల్సిందిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయకు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశం అనంతరం సీఎం సిద్ధరామయ్య తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ...‘మూఢాచారాల నిషేధ బిల్లుపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించాం, మంత్రి వర్గ సభ్యులెవరూ ఈ బిల్లుపై వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు, కేవలం ఈ బిల్లును మరింత క్షుణ్ణంగా తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు, అందువల్ల మూఢాచారాల నిషేధ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని కొంతకాలం వాయిదా వేస్తున్నాము’ అని తెలిపారు. ఇక ఇదే విషయంపై మంత్రి ఆంజనేయ మాట్లాడుతూ.....‘మూఢాచారాల నిషేధ బిల్లుకు సంబంధించిన సాదక, బాధకాలపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని కొంతమంది మంత్రులు అభిప్రాయపడ్డారు. రానున్న మంత్రి మండలి సమావేశంలో ఈ బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చిస్తాం’ అని పేర్కొన్నారు.


