breaking news
pro-Pakistani separatists
-
పాకిస్తాన్ క్రికెట్ జట్టు దుస్తులు ధరించి..
పాట్నా : మొహర్రం పర్వదినం సందర్భంగా బిహార్లోని బెట్టయ్య ప్రాంతంలో పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేసిన 21 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ధరించే దుస్తులు వేసుకుని, చేతిలో లాఠీలు ఇతర ఆయుధాలు పట్టుకుని ఈ నినాదాలు చేశారని అధికారులు చెబుతున్నారు. మొహర్రం-దుర్గా పూజల సందర్భంగా మత ఘర్షణలకు తావిచ్చేలా నినాదాలు చేశారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎఫ్ఐఆర్లో పొందుపరిచామని పోలీసులు ప్రకటించారు. పాకిస్తాన్ క్రికెట్ దుస్తులు ధరించిన యువకుల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు పోలీస్ అధికారి వివేక్ కుమార్ జైస్వాల్ తెలిపారు. సోదాల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ధరించే టీ షర్టులు, వివాదాస్పద పుస్తకాలు, మరికొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదైన 21 మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారని జైస్వాల్ తెలిపారు. పరారీలో ఉన్న వారిలో కొందరిని గుర్తించామని చెప్పారు. పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేసినవారిలో నజీర్, ఆఫ్తాబ్, సర్ఫరాజ్, సల్మాన్, అజార్, గుహార్, అజుఖ్, ఇమ్రాన్, సలావుద్దీన్, నసీరుద్దీన్ తదితరులు ఉన్నట్లు చంపారన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినయ్ కుమార్ చెప్పారు. నిందితులను వీలైనంత తొందరగా అదుపులోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
'పాక్ జెండాలు ఎగరేసిన వారిని షూట్ చేయాలి'
రాజకోట్: పాకిస్థాన్ అనుకూల కశ్మీర్ వేర్పాటు వాదులపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా విమర్శించారు. కశ్మీర్ లో పాకిస్థాన్ జెండాలు ఎగురవేసిన వారిని కాల్చి పారేయాలని అన్నారు. 'కశ్మీర్ లో పాక్ ఎండాలు ఎగురవేయడం ఆందోళన కలిగించే పరిణామం. రొమ్ము విరుచుకుని పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆ దేశపు పతాకాలు ఎగురవేసే వారిని షూట్ చేయాల్సిన అవసరముంది' అని తొగాడియా పేర్కొన్నారు. కచ్ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వేర్పాటువాదులపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని తొగాడియా అసంతృప్తి వ్యక్తం చేశారు.