priya singh
-
శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్ భార్య ఆత్మహత్య
సాక్షి, తిరుపతి: శ్రీహరికోటలో మరో విషాదం నెలకొంది. సీఐఎస్ఎఫ్ జవాన్ వికాస్ సింగ్ భార్య ప్రియా సింగ్ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రోజున ఆత్మహత్యకు పాల్పడిన వికాస్‌సింగ్‌ని చూసేందుకు.. భార్య ప్రియా సింగ్ ఉత్తర ప్రదేశ్ నుంచి షార్కు వచ్చారు. విగతజీవిగా పడిఉన్న భర్తను చూసి మనస్తాపంతో షార్‌లోని నర్మదా అతిథి గృహంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వికాస్‌సింగ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి, తండ్రి ఆత్మహత్యతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. కాగా, తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో 24 గంటలో వ్యవధిలోనే సీఐఎస్ఎఫ్ ఎస్ఐ వికాస్‌సింగ్, కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య చేసుకున్నారు. షార్ మొదటిగేటు వద్ద సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వికాస్‌సింగ్ (33) సోమవారం రాత్రి తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బిహార్‌కు చెందిన వికాస్‌సింగ్ సెలవు కావాలని కొద్దిరోజులుగా అడుగుతున్నారని, అందుకు పైఅధికారులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని సహచర సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. షార్‌లోని జీరోపాయింట్ రాడార్ సెంటర్‌కు సమీపంలోని అటవీప్రాంతంలో ఆదివారం రాత్రి చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్ చింతామణి (29) ఆత్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మహషముండ్ జిల్లా శంకర విలేజ్ అండ్ తాలూకాకు చెందిన చింతామణి ఈ నెల 10న కానిస్టేబుల్‌గా ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. చదవండి: (షార్‌లో విషాదం.. సీఐఎస్ఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య) -
‘రంగు’ మూవీ రివ్యూ
టైటిల్ : రంగు జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : తనీష్, ప్రియా సింగ్, పరుచూరి రవి, షఫీ, పోసాని కృష్ణమురళి, పరుచూరి వెంకటేశ్వర్రావు తదితరులు సంగీతం : యోగేశ్వర్ శర్మ దర్శకత్వం : కార్తికేయ నిర్మాత : పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్నాయుడు బాలనటుడిగా సక్సెస్ అయిన తనీష్.. హీరోగా సక్సెస్ కావడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. తనీష్ తెరపై హీరోగా కనపడి చాలా కాలమే అయింది. ఇటీవలె బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన తనీష్.. రంగు సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. విజయవాడ రౌడీ షీటర్ లారా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన రంగు చిత్రం.. తనీష్‌ను హీరోగా నిలబెట్టిందా?.. అసలు ‘రంగు’ వెనుక కథేంటి? అన్నది ఓసారి చూద్దాం.. కథ : బెజవాడ రౌడీయిజం చుట్టూ రంగు కథ తిరుగుతుంది. లారా అనే వ్యక్తి జీవితంలో సంఘటనల ఆదారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. లారా పాత్రను తనీష్ పోషించాడు. పవన్ కుమార్ అలియాస్ లారా(తనీష్) అనే కుర్రాడు చదువుల్లో స్కూల్ ఫస్ట్. అయితే కాలేజ్‌లో గొడవలు, కొన్ని పరిస్థితుల వల్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం.. అటుపై రౌడీ షీటర్‌గా మారతాడు. అక్కడినుంచి సెటిల్మెంట్లు చేస్తూ.. ఎదుగుతూ ఉంటాడు. ఈ గొడవల మధ్యే తనకు పూర్ణ (ప్రియా సింగ్) అనే అమ్మాయితో ప్రేమా తరువాత పెళ్లి జరుగిపోతాయి. దీంతో జీవితంపై ఇష్టం ఏర్పడుతుంది. మళ్లీ మాములు మనిషిలా మారాలానుకుంటాడు. మరి అనుకున్నట్టుగా లారా మంచి వాడిగా మారిపోయాడా..? ఈ ప్రయత్నంలో లారాకు ఎదురైన సమస్యలేంటి..? ఈ కథలో ఏసీపీ రాజేంద్రన్ (పరుచూరి రవి), మణి (షఫీ)ల పాత్ర ఏంటీ? అసలు చివరకు ఏమైంది.. అనేదే ‘రంగు’ కథ. నటీనటులు : లారా పాత్రలో తనీష్ బాగానే నటించాడు. కొన్ని సన్నివేశాల్లో తడబడ్డట్టు అనిపించినా.. ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. ఇక ఏసీపీ రాజేంద్రన్ పాత్రలో పరుచూరి రవి నటన గుర్తుండిపోతుంది. ఆ పాత్రకు కావల్సిన బాడీలాంగ్వేజ్‌తో బాగానే నటించాడు. ఇక ఈ సినిమాలో తనీష్ తరువాత ఎక్కువగా కనిపించేది, గుర్తుండేది పరుచూరి రవి పాత్రే. నటుడిగా అతను ఇంకా బిజీ అయ్యే అవకాశం ఉంది. రౌడీయిజం వదిలేసి సాధుజీవిలో బతుకుతున్న పాత్రలో షఫీ నటన బాగుంది. పూర్ణ తెరపై కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. ఇక మిగిలిన పాత్రల్లో పోసాని కృష్ణమురళీ, పరుచూరి వెంకటేశ్వర్రావు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. విశ్లేషణ : ఓ వ్యక్తి రౌడీగా మారడానికి దారితీసే కారణాలు.. ఆవేశంలో చేసే పనులు.. ఆలోచన లేకుండా భవిష్యత్తును నాశనం చేసుకోవడం, తిరిగి సాధారణ జీవితాన్ని గడపాలనుకోవడం అయినా గతం వెంటాడటం లాంటి సంఘటనల్లో సినిమా కావాల్సినంత కమర్షియల్ కంటెంట్ ఉంది. కానీ రంగు విషయంలో ఇలాంటి అంశాలు చాలా ఉన్నా కూడా.. వాటిని దర్శకుడు సరిగ్గా వినియోగించుకోలేదనిపిస్తుంది. ఈ కథకు పరుచూరి బ్రదర్స్ మాటలు రాయడం ప్లస్ పాయింట్. వారి మాటలు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా అదే సమయంలో ఆలోచింపచేసేలా ఉన్నాయి. యోగేశ్వర్ శర్మ అందించిన సంగీతం ఫర్వాలేదు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. ప్లస్ పాయింట్స్ ; కథ కొన్ని పాత్రలు మైనస్ పాయింట్స్ ; నిర్మాణ విలువలు సినిమా నిడివి కథనం బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
ఏ పాత్ర చేయడానికైనా రెడీ
‘‘నేను ఇండస్ట్రీకి నటుడిగానే పరిచయమయ్యా. హీరోగా రాలేదు. హీరోనా.. విలనా..? అన్నది ఆలోచించను. నాకు ఎగై్జటింగ్‌గా అనిపిస్తే ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే’’ అని హీరో తనీశ్ అన్నారు. తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య పాత్రల్లో కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. తనీశ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి మనిషిలో చాలా రంగులు, భావోద్వేగాలు ఉంటాయి. అందుకే ‘రంగు’ అని టైటిల్ పెట్టాం. విజయవాడకు చెందిన లారా (పవన్ కుమార్) అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో లారా పాత్ర చేశా. కాలేజ్‌లో స్టేట్ ర్యాంకర్ అయిన లారాపై రౌడీషీటర్ అనే ముద్ర ఎలా పడింది. 27ఏళ్లకే ఆయన ఎందుకు చంపబడ్డారు? అనే విషయాలతో పాటు ఆయన గురించి ప్రజలకు తెలియని ఎన్నో అంశాలను ‘రంగు’లో చూపించాం. లారా కుటుంబ సభ్యులు తలెత్తుకుని తిరిగేలా ఈ సినిమా ఉంటుంది. చివరి 30 నిమిషాలు హైలైట్‌గా ఉంటుంది. కృష్ణవంశీగారి ‘నక్షత్రం’లో విలన్‌గా చేసినందుకు గర్వంగా ఉంది. ఆ సినిమా తర్వాత ఎవరూ విలన్ పాత్ర కోసం నన్ను సంప్రదించలేదు. హీరో పాత్ర కోసమే కథలు వినిపిస్తున్నారు’’ అన్నారు. -
హీరోలు లేరు... విలన్లు లేరు!
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయ్యింది. నేను నటించిన తొలి సినిమా (బాలనటుడు) ‘ప్రేమంటే ఇదేరా’ హిట్ అయిన రోజు చాలా ఆనందమేసింది. చాలా ఏళ్ల తర్వాత ‘రంగు’ సినిమాతో మళ్లీ ఇంత ఆనందంగా ఉంది’’ అని తనీష్ అన్నారు. తనీష్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య తారలుగా కార్తికేయ.వి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తనీష్ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత మా అమ్మగారు నా కోసం ఈ ఫంక్షన్‌కు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో హీరోలు, విలన్లు లేరు.. అన్నీ పాత్రలే’’ అన్నారు. ‘‘ఓ ఫ్రెండ్ ద్వారా లారా గురించి విన్నాను. ఆయన స్నేహితులను కలిసి కథను తయారు చేసుకున్నాను. పరుచూరి బ్రదర్స్ ఈ కథని కమర్షియల్ ఫార్మాట్లోకి మార్చి అద్భుతంగా మలిచారు’’ అన్నారు కార్తికేయ. ‘‘ఓ కొత్త బ్యానర్ పెట్టుకుని కొత్తవారితో సినిమాలు చేయాలనుకుంటున్నాం. మా సినిమా వల్ల ఎవరికీ నష్టం రాదు.. రానివ్వను. నేను చాలా సినిమాలు తీస్తున్నాను. తక్కువ ఖర్చులో సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నా. ‘రంగు’ సినిమా బాగుంటుంది’’ అని పద్మనాభరెడ్డి అన్నారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రియా సింగ్, నిర్మాతలు మల్కాపురం శివకుమార్, రవి, రామసత్యనారాయణ, రాజ్‌కందుకూరి తదితరులు పాల్గొన్నారు. -
‘రంగు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
రంగు పడనివ్వం
తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య తారలుగా కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. విజయవాడకు చెందిన లారా (పవన్ కుమార్) అనే వ్యక్తి జీవితం ఆధారంగా ‘రంగు’ సినిమా తెరకెక్కించారు. లారా కుటుంబ సభ్యుడైన దిలీప్, స్నేహితులు సందీప్, ధనుంజయ్ ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిలీప్ (లారా బావ మరిది) మాట్లాడుతూ– ‘‘లారా గురించి సమాచారం సేకరించడానికి దర్శకుడు కార్తికేయ ఏడాది క్రితం విజయవాడ వచ్చినప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. పది రోజుల క్రితం సినిమా ట్రైలర్, ప్రెస్‌మీట్ చూశాం. లారా అనే రౌడీషీటర్.. అనే వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. లారా మీద రౌడీషీట్ అన్యాయంగా తెరిచారు. ఇప్పుడు ఆయన పిల్లలు చదువుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే వాళ్ల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించాలి. సినిమా ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ‘రంగు’ దర్శక, నిర్మాతలను కలవాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. సినిమాని ముందుగా మాకు చూపించి, మా అంగీకారంతోనే విడుదల చేయాలి. లేదంటే సినిమా విడుదలని లీగల్‌గా అడ్డుకుంటాం. విజయవాడలో పోస్టర్ పడనీయం’’ అన్నారు. లారా స్నేహితులు సందీప్, ధనుంజయ్ పాల్గొన్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విద్యార్థిని అదృశ్యం
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విద్యార్థిని అదృశ్యం
శంషాబాద్: కోల్‌కతాకు చెందిన డిగ్రీ విద్యార్థిని ప్రియా సింగ్ శంషాబాద్ విమానాశ్రయంలో అదృశ్యమైంది. కోల్‌కతా నుంచి ఇండిగో(6ఈ836) విమానంలో శంషాబాద్ వచ్చిన ప్రియా సింగ్ ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీసీ కెమెరాలను ఎయిర్‌పోర్టు పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రియాసింగ్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత అదృశ్యమైందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆమె ఆచూకి కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.