breaking news
Premier League cricket tournament
-
ధనాధన్‌కు వేళాయె...
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను ఇప్పటి వరకు మూడుసార్లు నిర్వహించారు. ముంబై రెండుసార్లు, బెంగళూరు ఒకసారి విజేతగా నిలిచాయి. అయితే గతానికి, 2026 సీజన్‌కు ప్రధాన తేడా ప్లేయర్ల ‘గుర్తింపు’. టీమిండియా వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన తర్వాత జరుగుతున్న తొలి డబ్ల్యూపీఎల్ ఇదే కావడంతో అన్ని వైపుల నుంచి సహజంగానే అదనపు ఆసక్తి పెరిగింది. టోర్నీ మొదలైనప్పుడు మహిళా క్రికెటర్ల గురించి ఒక పరిచయ కార్యక్రమంలాగా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు! నాడు ఉచితంగా అభిమానులను అనుమతించగా, తక్కువే అయినా ఇప్పుడు డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లకు టికెట్ ఉండటం లీగ్ స్థాయి పెరిగిందనేందుకు సంకేతం. ఐపీఎల్ తరహాలోనే వేలం, ప్రతిభాన్వేషణ, ప్రత్యేకంగా టీమ్ స్పాన్సర్లతో లీగ్ ఇప్పుడు స్వతంత్రంగా నిలబడింది. ఈ నేపథ్యంలో లీగ్ నాలుగో సీజన్ వచ్చేసింది. ఐదు జట్ల మధ్య జరిగే సమరంలో తుది విజేత ఎవరో 22 మ్యాచ్‌ల తర్వాత తేలనుంది. ముంబై: హర్మన్‌ప్రీత్ బృందం ముచ్చటగా మూడోసారి టైటిల్ సాధిస్తుందా? భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన టీమ్‌ను రెండోసారి విజేతగా నిలుపుతుందా? లేక కెపె్టన్‌గా కొత్త పాత్రలో మరో టాప్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ తన జట్టుకు తొలిసారి టైటిల్ అందిస్తుందా? ఈ నేపథ్యంలో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మరోసారి ప్రపంచ మహిళా క్రికెటర్ల ప్రదర్శన చూసేందుకు సమయం ఆసన్నమైంది. నేడు ప్రారంభం కానున్న నాలుగో సీజన్ ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. టోర్నమెంట్‌ను ఈసారి రెండు మైదానాలకే పరిమితం చేశారు. ఫ్రాంచైజీలు ఐపీఎల్ తరహాలో సొంత, ప్రత్యర్థి వేదికలపై మ్యాచ్‌లు ఆడాలని ఆశించినా... ప్రధాన వేదికలన్నీ టి20 వరల్డ్ కప్, రంజీ ట్రోఫీల కోసం కేటాయించడంతో బీసీసీఐ దానికి అనుమతించలేదు. రెండు తొలి 11 మ్యాచ్‌లకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక కాగా, తర్వాతి 11 మ్యాచ్‌లు వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరుగుతాయి. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. తొలి మూడు సీజన్ల పాటు డబ్ల్యూపీఎల్ ఫిబ్రవరి–మార్చిలలో జరిగినా ... కొత్త ఎఫ్టీపీలో డబ్ల్యూపీఎల్, ఉమెన్ బిగ్‌బా‹Ù, హండ్రెడ్ టోరీ్నలకు ప్రత్యేకంగా తేదీలను కేటాయించారు. ఇకపై జనవరి–ఫిబ్రవరిలోనే ఈ లీగ్ జరుగుతుంది. డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి ‘డబుల్ హెడర్’లు ఉండబోతున్నాయి. జనవరి 10, 17 తేదీల్లో ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. కొత్త కోచ్‌లతో... లీగ్‌లో ఎప్పటిలాగే ఐదు జట్లు బరిలోకి దిగుతుండగా... హర్మన్, స్మృతి, జెమీమాతో పాటు మెగ్ లానింగ్, యాష్లీ గార్డ్నర్ మరో రెండు జట్లకు సారథులుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు జెమీమా రూపంలో కొత్త కెప్టెన్ వచ్చింది. గత సీజన్ వరకు ఢిల్లీకి సారథిగా ఉన్న మెగ్ లానింగ్ ఈ ఏడాది యూపీ వారియర్స్ కెపె్టన్‌గా బరిలోకి దిగుతోంది. లానింగ్ నాయకత్వంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ మూడు సీజన్లలో కూడా ఫైనల్‌కు చేరింది. దురదృష్టవశాత్తూ మూడుసార్లు ఆ జట్టు రన్నరప్‌గానే నిలిచింది. ఈ సీజన్ కోసం మూడు జట్లు కొత్త కోచ్‌లను ఎంచుకున్నాయి. ముంబై కోచ్‌గా చార్లెట్ ఎడ్వర్డ్స్ స్థానంలో లిసా కీట్లీ, ఆర్సీబీ కోచ్‌గా ల్యూక్ విలియమ్స్ స్థానంలో మలోలన్ రంగరాజన్, యూపీ కోచ్‌గా జాన్ లూయిస్ స్థానంలో అభిషేక్ నాయర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వ్యక్తిగత కారణాలతో ఎలీస్ పెరీ, అనాబెల్ టోర్నీ నుంచి తప్పుకోగా... గుర్తింపు ఉన్న ప్లేయర్లలో అలీసా హీలీ, చమరి అటపట్టు, హీతర్ నైట్లను వేలంలో ఎవరూ ఎంచుకోలేదు. ఎవరి సత్తా ఎంత? లీగ్‌లో ఐదు జట్ల బలాబలాలను చూస్తే ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే పటిష్టంగా కనిపిస్తోంది. మూడో సారి టైటిల్ గెలవకుండా జట్టును నిలువరించడం అంత సులువు కాదు. హర్మన్‌ప్రీత్, హేలీ మాథ్యూస్, నాట్ సివర్, బ్రంట్, అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్‌లతో బలంగా ఉంది. తాజా సంచలనం కమలినిని కూడా టీమ్ ఎంచుకుంది. స్మృతి నాయకత్వంలో బెంగళూరు రెండో ట్రోఫీపై గురి పెట్టింది. అయితే టీమ్‌లో బెస్ట్ ప్లేయర్ ఎలీస్ పెరీ ఈ సీజన్‌కు దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బ. ఆమె లేని లోటును ఆర్సీబీ పూరించాల్సి ఉంది. స్మృతి ఎప్పటిలాగే ముందుండి నడిపించనుండగా... రిచా ఘోష్, పూజ వస్త్రకర్, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు. ఇటీవల వరల్డ్ కప్‌లో చెలరేగిన దక్షిణాఫ్రికా బ్యాటర్ డి క్లెర్క్ ఇదే టీమ్‌లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధానంగా టాపార్డర్‌పై ఆధారపడుతోంది. వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా కెపె్టన్ లారా వోల్వార్ట్, షఫాలీ వర్మ, జెమీమా, మరిజాన్ కాప్ టాప్–4లో కీలకం. బౌలింగ్‌లో నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ్ రాణావంటి స్పిన్నర్లు ఉన్నా జట్టు పేస్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో కలిపి 16 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లో గెలిచి 2025లో చివరి స్థానంలో నిలిచిన యూపీ వారియర్స్ ఈసారి తమ అదృష్టం మారుతుందని భావిస్తోంది. వరల్డ్ కప్ స్టార్ దీప్తి శర్మపై మరోసారి పెద్ద భారం ఉండగా... మెగ్ లానింగ్ కెపె్టన్సీ, నాయర్ కోచింగ్‌ను జట్టు నమ్ముకుంది. ధాటిగా ఆడే కిరణ్ నవ్‌గిరే, వరల్డ్ కప్ సభ్యురాలు హర్లీన్ డియోల్, లిచ్‌ఫోల్డ్ ఇతర కీలక ప్లేయర్లు. పేసర్లు క్రాంతి గౌడ్, శిఖా పాండేలతో స్పిన్నర్ ఎకెల్స్టోన్లపై బౌలింగ్ భారం ఉంది. వేలంలో సోఫీ డివైన్, రేణుకా సింగ్, డానీ వ్యాట్‌లను తీసుకొని గుజరాత్ జెయింట్స్ తమ జట్టును కాస్త పటిష్టంగా మార్చుకుంది. గార్డ్నర్, బెత్ మూనీ, వేర్హామ్ టీమ్ ప్రధాన బలం. యువ ఆటగాళ్ళలో టిటాస్ సాధు, కాశ్వీ గౌతమ్, తనూజ కన్వర్ రాణించడం ముఖ్యం.ఈసారి డబ్ల్యూపీఎల్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు క్రికెటర్లు బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నల్లపురెడ్డి శ్రీచరణి (ఢిల్లీ), తెలంగాణ నుంచి అరుంధతి రెడ్డి (బెంగళూరు), గొంగడి త్రిష (యూపీ), మమత మదివాలా (ఢిల్లీ), నల్లా క్రాంతి రెడ్డి (ముంబై) పోటీపడనున్నారు. -
తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ రద్దు.. విజేత ఎవరంటే..?
వర్షం కారణంగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ రద్దైంది. దీంతో ఫైనలిస్ట్‌లు చెపాక్ సూపర్ గిల్లీస్ (సీఎస్జీ), లైకా కోవై కింగ్స్ (ఎల్‌కేకే) జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఆటను 17ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (42 బంతుల్లో 65; 8ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఎల్‌కేకే ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గంగ శ్రీధర్ రాజు (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్), షారుక్ ఖాన్ (17 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించారు. సీఎస్జీ బౌలర్లలో సందీప్ వారియర్ (4/29), సాయి కిషోర్ (3/26), సోనూ యాదవ్ (2/29) సత్తా చాటారు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన సీఎస్జీ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ కౌశిక్ గాంధీ (1), ఎన్ జగదీషన్ (2) పరుగులకే ఔటవ్వగా.. ఎస్ రాధాకృష్ణన్ (11 బంతుల్లో 9; ఫోర్), రాజగోపాల్ సతీశ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ దశలో (4 ఓవర్లలో 14/2) మొదలైన వర్షం ఎంతకీ ఎడతెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సందీప్ వారియర్ దక్కించుకోగా.. సంజయ్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. చదవండి: బట్లర్ సేనకు చుక్కలు చూపించిన షంషి.. మరో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ -
బీసీసీఐ బెట్టు.. ఆ టోర్నీపై నీలి నీడలు?
కశ్మీర్ ప్రీమియర్ లీగ్ టోర్నీ నిర్వహణపై నెమ్మదిగా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కేపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. భారత్-పాక్ ‘కశ్మీర్’ వివాదాల నడుమ తలదూర్చడం తనకు ఇష్టం లేదని పనేసర్ ఓ ట్వీట్ కూడా చేశాడు. దీంతో పనేసర్ దారిలో మరికొందరు ఆటగాళ్లు పయనించే అవకాశం ఉందని, టోర్నీ జరగడం అనుమానమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం ఓ భారత మీడియా హౌజ్‌తో మాట్లాడిన పనేసర్.. బీసీసీఐ తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. రాజకీయాలు-ఆటలు ఒక్కటి కాదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించాడు. ‘ఆడడం ఆడకపోవడం ఆటగాళ్ల ఇష్టం. నాకు ఈసీబీ(ఇంగ్లండ్ బోర్డు) నుంచి స్పష్టమైన సందేశాలు వచ్చాయి. అయితే ఆడితే తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటారో ఆ ఆటగాళ్లకు తెలుసు’ అంటూ పనేసర్ వ్యాఖ్యలు చేశాడు. I have decided not to participate in the KPL because of the political tensions between India and Pakistan over kashmir issues. I don't want to be in the middle of this , it would make me feel uncomfortable. #KPL2021 #Kashmir #india #Cricket #Pakistan #ENGvIND #TheHundred — Monty Panesar (@MontyPanesar) August 1, 2021 ఇక దాయాది దేశాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తలు కొనసాగుతున్న టైంలో.. పీవోకేలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఈ లీగ్‌ను నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహణకు గుర్తింపు ఇవ్వొద్దని, జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని ఐసీసీకు నిన్న ఒక లేఖ రాసింది కూడా. దీంతో పాక్ ప్లేయర్లు, రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో బీసీసీఐపై మండిపడ్డారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో టోర్నీ నిర్వహణ ఆగదని స్పష్టం చేసింది. మరోవైపు పీవోకే లీగ్‌లో ఆడబోయే ఆటగాళ్లపై బీసీసీఐ బెదిరింపులకు పాల్పడుతోందనే, ఈ మేరకు భవిష్యత్తులో జరగబోయే టోర్నీల్లో నిషేధం విధిస్తామని ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ హర్షల్ గిబ్స్ బీసీసీఐని తప్పుబడుతూ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించాడు. కేపీఎల్ ఆడితే.. ఇక తనను ఏ టోర్నీలకు తీసుకోమని బీసీసీఐ బెదిరిస్తోందని ఆరోపించాడు. అయితే బీసీసీఐ మాత్రం ఆ ఆరోపణల్ని ఖండించింది. కాగా ఆగస్టు 6 నుంచి మొదలుకానున్న కేపీఎల్ టోర్నీలో ఓవర్సీస్ వారియర్స్, ముజఫర్బాద్ టైగర్స్, రావల్కోట్ హాక్స్, బాగ్ స్టాలియన్స్, మీర్పూర్ రాయల్స్, కోట్లీ లయన్స్ టీమ్‌లుగా ఉన్నాయి. ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాహిద్ అఫ్రిది, షాబాద్ ఖాన్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్‌లు ఈ ఆరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇక ఈ టోర్నీ నిర్వహణకు మరో నాలుగు రోజుల టైం ఉండగా.. బంతి ఇప్పుడు ఐసీసీ కోర్టులోనే ఉంది. -
హోరాహోరీగా సాగిన క్రికెట్ టోర్నీ
నర్సాపూర్(జి)(దిలావర్పూర్) : మండల కేంద్రమైన నర్సాపూర్(జి) గ్రామంలో స్థానిక గ్రామస్తులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో గత మూడురోజులుగా జరిగిన ప్రీమియర్‌లీగ్ క్రికెట్‌టోర్ని సోమవారంతో ముగిసింది. ఈ లీగ్ టోర్నీలో పలు గ్రామాల జట్లతోపాటు స్థానికంగా ఉన్న క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌కు చేరిన అజ్జుకాలనీ జుట్టు, ఫ్రెండ్‌్సజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌ను సోమవారం ఉదయం స్థానిక ఎస్సై రాం నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో అజ్జుకాలనీ జట్టు విన్నర్‌గా నిలిచింది, ఫ్రెండ్‌్సజట్టు రన్నర్‌గా నిలిచింది. విన్నర్ టీం సభ్యులకు రూ. 3వేల రూపాయలతో పాటు షీల్డ్‌ను, రన్నర్ టీం సభ్యులకు రూ.2వేల తోపాటు బహుమతిని అందజేశారు. నగదును స్థానిక సర్పంచ్ కొండ్రు రమేశ్ అందించగా ట్రోఫీలను బీజేపీ నేత సమరాజేశ్వర్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ బర్కుంట నరేందర్, నాయకులు గంగారాం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


