హోరాహోరీగా సాగిన క్రికెట్‌ టోర్నీ | Cricket tournament in Narsapur | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా సాగిన క్రికెట్‌ టోర్నీ

Jan 17 2017 10:01 PM | Updated on Sep 2 2018 3:43 PM

హోరాహోరీగా సాగిన క్రికెట్‌ టోర్నీ - Sakshi

హోరాహోరీగా సాగిన క్రికెట్‌ టోర్నీ

మండల కేంద్రమైన నర్సాపూర్‌(జి) గ్రామంలో స్థానిక గ్రామస్తులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో గత మూడురోజులుగా జరిగిన ప్రీమియర్‌లీగ్‌ క్రికెట్‌టోర్ని సోమవారంతో ముగిసింది.

నర్సాపూర్‌(జి)(దిలావర్‌పూర్‌) : మండల కేంద్రమైన నర్సాపూర్‌(జి) గ్రామంలో స్థానిక గ్రామస్తులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో గత మూడురోజులుగా జరిగిన ప్రీమియర్‌లీగ్‌ క్రికెట్‌టోర్ని సోమవారంతో ముగిసింది. ఈ లీగ్‌ టోర్నీలో పలు గ్రామాల జట్లతోపాటు స్థానికంగా ఉన్న క్రికెట్‌ జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌కు చేరిన అజ్జుకాలనీ జుట్టు, ఫ్రెండ్‌్సజట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ను సోమవారం ఉదయం స్థానిక ఎస్సై రాం నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోరాహోరీగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో అజ్జుకాలనీ జట్టు విన్నర్‌గా నిలిచింది, ఫ్రెండ్‌్సజట్టు రన్నర్‌గా నిలిచింది.

విన్నర్‌ టీం సభ్యులకు రూ. 3వేల రూపాయలతో పాటు షీల్డ్‌ను, రన్నర్‌ టీం సభ్యులకు రూ.2వేల తోపాటు బహుమతిని అందజేశారు. నగదును స్థానిక సర్పంచ్‌ కొండ్రు రమేశ్‌ అందించగా ట్రోఫీలను బీజేపీ నేత సమరాజేశ్వర్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్‌ బర్కుంట నరేందర్, నాయకులు గంగారాం, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement