breaking news
pranale
-
మంచు కురిసే వేళ...
‘అభినందన’ సినిమాలోని ‘మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో’ పాట ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. తాజాగా ఈ పాట పల్లవి ‘మంచు కురిసె వేళలో’ పేరుతో ఓ సినిమా రూపొందింది. రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా నటించారు. దర్శకుడు దేవాకట్టా వద్ద ‘ప్రస్థానం’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. దర్శక– నిర్మాత బాల మాట్లాడుతూ– ‘‘మంచు కురిసె వేళలో’ చిత్రం పేరుకు తగ్గట్టుగానే ప్యూర్ లవ్ ఎంటర్టైనర్. వైజాగ్, కూర్గ్, ఊటీ, అరకు, హైదరాబాద్‌లలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. కథ, కథనాలతో పాటు టెక్నికల్‌గా కూడా ది బెస్ట్ వర్క్ ఈ సినిమాలో చూస్తారు. ‘మళ్ళీరావా’ ఫేం శ్రావణ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకు ఎస్సెట్‌గా నిలుస్తుంది. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
కృష్ణా పుష్కర కవితోత్సవం 18న
డాబాగార్డెన్స్: రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ, తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో కృష్ణా పుష్కర కవితోత్సవం, కవి సమ్మేళనం, కృష్ణా పుష్కర పురస్కార ప్రదాన కార్యక్రమం ఈ నెల 18న నిర్వహించనున్నట్టు అమరావతి విశ్వసాహితి అధ్యక్షుడు కవి ప్రనాలే తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు శతాధిక కవి సమ్మేళనం, కృష్ణా పుష్కర పురస్కార ప్రదానం, కృష్ణాపుష్కర కవితోత్సవం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి అధికార భాషా సంఘం అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవానీ పలువురు ప్రముఖులు పాల్గొని కవులను సత్కరించనున్నారని తెలిపారు. ఔత్సాహికులైన కవులు, రచయితలు, వివిధ సాహితీ సంస్థలు వారి పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ నెల 18 మధ్యాహ్నం 12 గంటల్లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9885354867, 9441662716 నంబర్లలో సంప్రదించవచ్చు. ఈ సమావేశంలో కొల్లూరి కృష్ణ పాల్గొన్నారు.