మంచు కురిసే వేళ... | MANCHU KURISE VELALO picture released by December | Sakshi
Sakshi News home page

మంచు కురిసే వేళ...

Oct 29 2018 1:25 AM | Updated on Oct 29 2018 1:25 AM

MANCHU KURISE VELALO picture released by December - Sakshi

ప్రనాలి, రామ్‌ కార్తీక్

‘అభినందన’ సినిమాలోని ‘మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో’ పాట ఎంత సూపర్‌ హిట్‌ అయిందో తెలిసిందే. తాజాగా ఈ పాట పల్లవి ‘మంచు కురిసె వేళలో’ పేరుతో ఓ సినిమా రూపొందింది. రామ్‌ కార్తీక్, ప్రనాలి జంటగా నటించారు. దర్శకుడు దేవాకట్టా వద్ద ‘ప్రస్థానం’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. 

నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. దర్శక– నిర్మాత బాల మాట్లాడుతూ– ‘‘మంచు కురిసె వేళలో’ చిత్రం పేరుకు తగ్గట్టుగానే ప్యూర్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌. వైజాగ్, కూర్గ్, ఊటీ, అరకు, హైదరాబాద్‌లలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. కథ, కథనాలతో పాటు టెక్నికల్‌గా కూడా ది బెస్ట్‌ వర్క్‌ ఈ సినిమాలో చూస్తారు. ‘మళ్ళీరావా’ ఫేం శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతం మా సినిమాకు ఎస్సెట్‌గా నిలుస్తుంది. త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement