breaking news
Power interrupted
-
భారీ వర్షాలతో ఢిల్లీ ఆగమాగం.. ఆరుగురి మృతి
న్యూఢిల్లీ: భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన హస్తీనా వాసులకు చల్లగాలులు, వర్షంతో ఉపశమనం లభించినప్పటికీ.. ఊహించని స్థాయిలో పడిన కుండపోత వర్షాలు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. దేశ రాజధానిలో శుక్రవారం ఒక్క రోజే 228.1 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఢిల్లీలో ఒక్కరోజులో ఈ స్థాయిలో వర్షం కురవడం 88 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.అయితే మరో రెండు రోజులు(జూన్ 1) భారీ వర్షాలు, అయిదు రోజులు తేలికపాటి వానలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షంతో విద్యుత్తు సరఫరాకు, మంచి నీటి సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. వర్షం, వరదలు కారణగా దేశ రాజధానిలో ఇప్పటి వరకు ఆరుగురు మృత్యువాత పడ్డారు.వీరిలో 8, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో వర్షపు నీరు నిండిన కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వసంత్ విహార్‌లో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు కూలీలు మరణించారు. వీరి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది శనివారం బయటకు తీశారు. షాలిమార్‌బాగ్ ప్రాంతంలోని అండర్‌పాస్‌లో ఓ వ్యక్తి మునిగిపోయాడు.“दिल्ली की जनता को थोड़ी तमीज़ होनी चाहिए, यें कोई जगह है गाड़ियाँ पार्क करने की।”😏 pic.twitter.com/qOBE6r8HxC— Dr. Atishi || AAP || CM, Delhi 2024 || Parody || (@atishi_maarlena) June 28, 2024 ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న పైకప్పు కూలిన టెర్మినల్-1ను నేడు కూడా మూసివేశారు. శుక్రవారం పైకప్పు కూలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలసిందే. మరో నలుగురురికి గాయాలయ్యాయి. ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఓ అండర్‌పాస్‌లో వరద నీటిలో బస్సు చిక్కుకుపోయింది.గత మూడు నెలలుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన దేశరాజధాని ఢిల్లీ నగరం.. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. ఈ వర్షంతో రాజధాని మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయిందిఇక నేడు (శనివారం) ద్వారకా, పాలం, వసంత్ విహార్, వసంత్ కుంజ్, గుర్గావ్, ఫరీదాబాద్, మనేసర్‌తో సహా ఢిల్లీ-ఎన్సీఆర్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
ఇటు భానుడు.. అటు వరుణుడు
కొత్తకోట/గోపాల్పేట/వనపర్తిటౌన్ : ఓ వైపు భానుడు నిప్పులు చెరుగుతూ తన ప్రతాపం చూపుతున్నాడు. సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. తానేమీ తక్కువ కాదన్నట్లుగా వరుణుడు బుధవారం సాయంత్రం విరుచుకుపడ్డాడు. కొత్తకోట, గోపాల్పేట, వనపర్తి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురవడంతో చెల్లు విరిగిపడ్డాయి.. ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.. విద్యుత్‌స్తంభాలు ఒరిగిపడ్డాయి. కొత్తకోట పట్టణ కేంద్రంలో 25చెట్లు విరిగిరోడ్డుపై పడటంతో ట్రాఫిక్ తీవ్రఅంతరాయం కలిగింది. గోపాల్‌పేటలో కోళ్లషెడ్లు నేలమట్టమయ్యాయి. తాడిపర్తి సమీపంలో నిర్మాణంలో ఓ పౌల్ట్రీఫాం పూర్తిగా నేలమట్టమైంది. గోడలు, ఇనుపపైపులు కూలిపోగా, సిమెంటు రేకులు గాలుల తాకిడికి చెల్లాచెదురుగా పడిపోయాయి. రూ.ఐదు లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు మల్లేష్ వాపోయాడు. మండలకేంద్రంలో సాయంత్రం కొద్దిసేపు వడగండ్ల వర్షం కురిసింది. ఉరుములతో కూడిన చిలుజల్లులతో వాతావరణం చల్లబడింది. ఎండదెబ్బ, వడగాలులు, ఉక్కపోత నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. వనపర్తి పట్టణంలో గాలివాన బీభత్సవం సృష్టించింది. గాలివానతో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. భారీవర్షానికి వనపర్తిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బ్రహ్మంగారి వీధి, వెంకటేశ్వర దేవాలయం, పాత బస్టాండ్, ఏరియా ఆస్పత్రి ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపారాయి.