breaking news
Post nominated replacement
-
మళ్లీ కసరత్తు
నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఢిల్లీ పెద్దల సూచన నివేదిక కోరిన దిగ్విజయ్ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా హైకమాండ్ ముందస్తు చర్యలు బెంగళూరు: మండళ్లు, కార్పోరేషన్లకు సంబంధించి అధ్యక్షులు, ఉపాధ్యక్షుల (నామినేటెడ్ పోస్టుల) భర్తీ వల్ల ఏర్పడిన అసమ్మతిని తగ్గించే చర్యలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముమ్మరం చేసింది. అందులోభాగంగా చాలా ఈ సంస్థల డెరైక్టర్ పోస్టులతోపాటు పాలనాపరమైన సభ్యుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించాల్సిందిగా ఢిల్లీ పెద్దలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్లకు సూచించినట్లు సమాచారం. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో చాలా మంది పదవులపై కన్నేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో తీవ్ర అసమ్మతి చెలరేగింది. ఈ క్రమంలోనే ఆయన గుల్బర్గాలో జరిగిన మంత్రి మండలి సమవేశానికి మంత్రి అంబరీష్ డుమ్మాకొట్టారు. మరికొంతమంది నాయకులు బహిరంగంగానే తమ అసమ్మతిని వెళ్లగక్కగా కొంతమంది కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో పార్టీలో అసమ్మతి ఇలాగా ఉంటే భవిష్యత్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి తిరిగి మొదటికి వస్తుందని భావించిన పార్టీ హైకమాండ్ చక్కదిద్దే కార్యక్రమాలను ప్రారంభించింది. అందులో భాగంగా బీడీఏ, గృహ మండలి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, మురికివాడల అభివృద్ధి మండలి తదితర సంస్థల డెరైక్టర్ స్థానాలకే కాకుండా సాధారణ సభ్యుల స్థానాలకు కూడా చాలా మంది పోటీపడుతున్నారు. దీంతో ఆయా పోస్టుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించాలని రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై చివరి వారంలోపు తనకు నివేదిక అందజేయాలని ఆయన ఇరువురునాయకులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. మార్చిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే హైకమాండ్ రాష్ట్ర నాయకులకు ఈ రకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ... ‘డెరైక్టర్ పోస్టుతోపాటు సాధారణ సభ్యుల ఎంపిక ప్రక్రియను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించాలనేది సీఎం సిద్ధు ఆలోచన, అయితే హైకమాండ్ ఇందుకు ఒప్పుకోలేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీలో ఏర్పడిన అసమ్మతిని కనిష్టానికి తగ్గించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.’ అని పేర్కొన్నారు. -
నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమివ్వాలి
సీఎంకు గంగపుత్ర సంఘం వినతి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల నియూవుకంలో గంగపుత్రులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గంగపుత్రసంఘం సీఎం కేసీఆర్‌ను కోరింది. సంఘ అధ్యక్షుడు దీటి మల్లయ్య ఆధ్వర్యంలో కార్యవర్గసభ్యులు ఆదివారం సీఎం కేసీఆర్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షలకు పైగా గంగపుత్రులు ఉన్నా.. ప్రస్తుత శాసనసభలో గానీ, శాసనమండలిలోగాని ఒక్కరికీ ప్రాతినిధ్యం లేదని వారు పేర్కొన్నారు. అదేవిధంగా వచ్చే బడ్జెట్లో గంగపుత్రుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని, తెలంగాణ ఫిషరీస్ అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేయాలని వారు వినతిపత్రంలో కోరారు. చెరువుల పరిరక్షణలో ప్రభుత్వం జారీచేస్తున్న ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడంతో రామంతాపూర్, కాప్రా చెరువులు నిరాటకంగా కబ్జాకు గురవుతున్నాయని సీఎం దృష్టికి తెచ్చామని సంఘ నాయుకులు తెలిపారు. సీఎంకి వినతిపత్రం సమర్పించిన వారిలో సంఘ రాష్ట్ర కార్యదర్శి గడప దేవేందర్, ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ, శీలం రాజ్‌కుమార్, పూస నర్సింహ్మ తదితరులున్నారు.