-
వ్యాపార వైవిధ్యంపై ఎల్ఐసీ దృష్టి
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగంలోని దిగ్గజ సంస్థ ఎల్ఐసీ సెప్టెంబర్ 1వ తేదీకి 66 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, తన వ్యాపార వైవిధ్యంపై దృష్టి సారించింది. నాన్ పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకోవాలని అనుకుంటున్నట్టు సంస్థ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. జీవిత బీమా రంగంలో ఎల్ఐసీకి సుమారు 65 శాతం మార్కెట్ వాటా ఉన్న విషయం తెలిసిందే. 17 ఇండివిడ్యువల్ పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్లు 17 ఇండివిడ్యువల్ (వ్యక్తుల విభాగంలో) నాన్‌పార్టిసిపేటింగ్ ఉత్పత్తులు, 11 గ్రూపు ప్లాన్లను ఎల్ఐసీ ఆఫర్ చేస్తోంది. నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లలో బోనస్‌లు రావు. పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే పరిహారాన్నిచ్చే అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లుగా చెబుతారు. తమ ఏజెంట్లు ఇక ముందూ ఉత్పత్తుల పంపిణీకి మూలస్తంభాలుగా కొనసాగుతారని కుమార్ తెలిపారు. ఇండివిడ్యువల్ బీమా ఉత్పత్తుల వ్యాపారంలో 95 శాతం ప్రీమియం తమకు ఏజెన్సీల ద్వారానే వస్తున్నట్టు చెప్పారు. ఎల్ఐసీకి దేశవ్యాప్తంగా 13.3 లక్షల ఏజెన్సీలు ఉండడం గమనార్హం. బ్యాంకు అష్యూరెన్స్ (బ్యాంకుల ద్వారా) రూపంలో తమకు వస్తున్న వ్యాపారం కేవలం 3 శాతంగానే ఉంటుందని కుమార్ తెలిపారు. ‘‘జీవితావసరాలకు బీమా కావాలన్న అవగాహన గరిష్ట స్థాయికి చేరింది. కస్టమర్ల మారుతున్న అవసరాలకు తగ్గట్టు కొత్త విభాగాల్లోకి ప్రవేవిస్తాం’’అని వెల్లడించారు. నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లను మరిన్ని తీసుకురావడం ద్వారా తాము అనుసరించే దూకుడైన వైవిధ్య విధానం తగిన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. బ్యాంక్ అష్యూరెన్స్‌ను మరింత చురుగ్గా మారుస్తామన్నారు. -
మొబైల్‌తోనే బీమా క్లెయిమ్!
ఫాస్ట్ ఫార్వర్డ్ యుగమిది. ఇంట్లో డ్రెస్ నుంచి రోడ్డు మీది రెస్టారెంట్ వరకు.. దేన్నీ వెతుక్కోవటం ఈ తరానికి అస్సలు నచ్చటం లేదు. శోధించి సాధించడం కాదు.. సిద్ధంగా ఉంటే సంతోషిస్తారంతే!! అందుకే రెస్టారెంట్లను వెదికిపెట్టడం దగ్గర్నుంచి ప్రతిదానికీ మొబైల్ యాప్‌లు తయారవుతున్నాయి. ఇపుడీ యాప్‌లు బీమా కంపెనీలకూ పాకాయి. ప్రీమియం చెల్లింపుల నుంచి క్షణాల్లో పాలసీ క్లెయిమ్ చేయటం వరకూ అన్నిటినీ మొబైల్ నుంచే చేయడానికి వీలు కల్పిస్తున్నాయివి. ⇒ ఒక్క క్లిక్‌తోనే క్లెయిమ్ చేసేందుకు వీలు ⇒ యాప్స్‌ను అందుబాటులోకి తెస్తున్న బీమా సంస్థలు ⇒ సమగ్ర సమాచారంతోపాటు పాలసీ చెల్లింపులు సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం: ప్రస్తుతం దాదాపు ప్రతి బీమా కంపెనీ తన సొంత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. యాప్ వినియోగంతో బీమా చెల్లింపుల్లో చాలా మార్పులు వచ్చినట్లు ఇటీవల బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నిర్వహించిన సర్వేలో సైతం తేలింది. ‘‘యాప్స్ వినియోగం వల్ల బీమా సంస్థల విషయంలో కస్టమర్ల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో రెండేళ్ల కిందటిదాకా ఆన్లైన్లో పాలసీ చెల్లింపులు 5 శాతంగా ఉంటే.. యాప్స్‌ను వినియోగించటం మొదలుపెట్టాక ఇవి 15 శాతానికి పెరిగాయి’’అని బీసీజీ సర్వే తెలియజేసింది. బీమా అంతా యాప్స్‌లోనే.. పాలసీ తీసుకోవటం చాలామందికి ఓకే. కానీ నెలనెలా చెల్లించాలంటే కష్టమే. తేదీలు గుర్తుపెట్టుకోవటం, కంపెనీలకు వెళ్లటం, అక్కడ చెల్లించటం ఇవన్నీ కాస్త ఇబ్బందితో కూడుకున్నవే. అలాంటి అవసరమేదీ లేకుండా నేరుగా యాప్ ద్వారానే చెల్లించడాన్ని కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అంతేకాక ఎప్పుడు చెల్లించాలో... పాలసీ ఎప్పుడు పూర్తవుతుందో... ఒకవేళ ఏవైనా క్లెయిమ్‌లు చేసుకోవాల్సి ఉన్న పక్షంలో... సదరు పాలసీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆ వినియోగదారులకు ఎప్పటికప్పుడు మొబైల్‌కే చేరవేస్తున్నాయి. కొత్త పాలసీలు ఏవి అందుబాటులోకి వచ్చినా ఆ వివరాలు కూడా యాప్స్‌లో సిద్ధం చేస్తున్నాయి. ఒకరకంగా బీమా యాప్‌ను వినియోగించే వారు తమ చెల్లింపు తేదీలను, రెన్యువల్ తేదీలను మిస్ అయ్యే అవకాశం ఉండదన్న మాట. వీటితో పాటు ఫండ్ విలువలు, బ్రాంచ్‌లు, నెట్వర్క్ ఆసుపత్రులు, గ్యారేజీ స్టేషన్లు ఇలా బీమా సంస్థలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని యాప్‌లోనే చెబుతున్నాయ్. కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండవు... యాప్స్ వినియోగంతో అటు బీమా సంస్థలు, ఇటు పాలసీదారులు ఇద్దరూ ఎల్లవేళలా సత్సంబంధాలు కొనసాగించొచ్చు. ప్రీమియం, పాలసీల విషయంలో పాలసీదారులకు తలెత్తే సవాలక్ష ప్రశ్నలను క్షణాల్లో నివృత్తి చేయడంలో అటు బీమా సంస్థలకు, ఎలాంటి జాప్యాల్లేకుండా వేగంగా పాలసీని క్లెయిమ్ చేసుకోవటంలో ఇటు పాలసీదారులకూ ఇద్దరికీ ఈ యాప్స్ అక్కరకొస్తున్నాయి. ఒక్క క్లిక్‌తో క్లెయిమ్.. బీమా చేయటమే కాదు వాటిని క్లెయిమ్ చేసేటపుడే అసలైన సమస్యలు ఎదురవుతాయి. అయితే యాప్స్ వినియోగంతో ఈ చిక్కులేవీ ఉండవంటున్నాయి బీమా సంస్థలు. పాలసీ వివరాలు ముందుగానే యాప్‌లో నిక్షిప్తమై ఉంటాయి కనక.. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే పాలసీ గురించి, కస్టమర్ సర్వీస్ నంబర్ గురించి మనం అదే పనిగా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్క క్లిక్‌తో క్లెయిమ్ తాలూకా వివరాలు క్షణాల్లో సంబంధిత బీమా సంస్థకు చేరుతాయి. సంఘటన జరిగినప్పుడే కాదండోయ్.. ఎప్పుడైనా.. ఎక్కడైనా క్లెయిమ్ తాలూకు వివరాలను మనం తెలుసుకునే వీలుంటుంది. అలాగే అత్యవసర సమయాల్లో బీమా సంస్థలకు సంబంధించిన ఆసుపత్రులు, సర్వీస్ స్టేషన్ల సేవలనూ పొందవచ్చు. సరే! మీ మొబైల్లో మీ బీమా కంపెనీ యాప్ ఉందా? లేకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి మరి!!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement