breaking news
PM Surya Ghar Yojana
-
రూ.28 వేల కోట్ల సబ్సిడీ.. 50 లక్షల కుటుంబాలకు లబ్ది!
ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) పథకం కింద ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా 50.06 లక్షల గృహాలు లబ్ధి పొందాయి. ప్రారంభం నుంచి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో గణనీయమైన పెరుగుదల కనిపించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేవలం రెండేళ్లలోనే ఈ పథకం పతాకస్థాయిలో ఆదరణ పొందినట్లు పేర్కొంది.పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కోసం.. కేంద్ర ప్రభుత్వం రూ.75,021 కోట్ల భారీ నిధులను కేటాయించింది. అయితే ఈ పథకం అమలు చేయడానికి ముందు పదేళ్లలో.. దేశవ్యాప్తంగా కేవలం 7.94 లక్షల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు మాత్రమే ఏర్పాటు అయ్యాయి. కానీ ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిన రెండేళ్లలోనే 50 లక్షలకు పైగా కుటుంబాలు సోలార్‌ను స్వీకరించాయి. దీన్నిబట్టి చూస్తే.. ప్రజల్లో అవహగాన పెరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది.ఒక్క నెలలోనే 5.06 లక్షలుప్రస్తుతం ప్రతి ఆరు రోజులకు లక్ష మంది కొత్త లబ్ధిదారులు ఈ పథకంలో చేరుతున్నట్లు సమాచారం. గత తొమ్మిది నెలల్లో సోలార్ వ్యవస్థల ఏర్పాటు వేగం మూడు రెట్లకు పైగా పెరిగింది. ముఖ్యంగా 2026 జూలైలో ఒక్క నెలలోనే 5.06 లక్షల ఇళ్లలో సోలార్ ప్యానెల్లు ఏర్పాటు కావడం ఒక కొత్త రికార్డు. రోజుకు సగటున 16 వేలకుపైగా ఇళ్లలో సోలార్ వ్యవస్థలు అమర్చడం ఈ కార్యక్రమం ఎంత వేగంగా ముందుకు సాగుతోందో తెలియజేస్తోంది.ఈ పథకం వల్ల ప్రజలకు నేరుగా ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.28,024 కోట్ల సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఫలితంగా సుమారు 19 లక్షల కుటుంబాలు విద్యుత్ బిల్లు లేకుండానే జీవిస్తున్నాయి.అదనపు ఆదాయం కూడా..అంతేకాదు.. అవసరానికి మించి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా 12 లక్షలకు పైగా కుటుంబాలు అదనపు ఆదాయం కూడా సంపాదిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కుటుంబాలు కలిపి రూ.421 కోట్ల ఆదాయం పొందగా, ఒక్కో కుటుంబానికి సగటున ఏడాదికి రూ.3,500 వరకు అదనపు ఆదాయం వచ్చింది.ఇదీ చదవండి: UPI యూజర్లకు అలర్ట్.. డబ్బులు పంపే ముందు కొత్త స్టెప్!దరఖాస్తు నుంచి సబ్సిడీ విడుదల వరకు మొత్తం ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా ఆన్లైన్ చేసింది. దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా సేవలు పొందుతున్నారు. కాగా.. ఈ పథకం వల్ల ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి.A people-powered solar revolution is transforming India. Under Hon'ble PM Shri @narendramodi ji’s @PMSuryaGhar Muft Bijli Yojana, 50 lakh families are harnessing the power of the sun for cleaner energy, lower electricity bills, and a brighter tomorrow. #50LakhPMSuryaGhar pic.twitter.com/dhRgyDvnhI— Ministry of New and Renewable Energy (MNRE) (@mnreindia) August 4, 2026 -
పీఎం–కిసాన్.. మరో ఐదేళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతన్నలకు ఆర్థిక మద్దతును పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు ప్రతిఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) పథకాన్ని 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించాలని నిర్ణయించింది. రాబోయే ఐదేళ్లలో ఈ పథకం అమలుకు రూ.3.15 లక్షల కోట్లు కేటాయించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ శుక్రవారం సమావేశమైంది. 2026–2031 కాలానికి సంబంధించి వ్యవసాయంతోపాటు పునరుత్పాదక ఇంధనం, చమురు అన్వేషణకు భారీగా నిధులు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాల వివరాలు, పథకాల గణాంకాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. పీఎం–కిసాన్తో సత్ఫలితాలు పీఎం–కిసాన్ పథకంలో ఆశించిన ఫలితాలు వస్తున్నట్లు గుర్తించారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని డెవలప్మెంట్ మానిటరింగ్, ఎవాల్యుయేషన్ ఆఫీస్(డీఎంఈఓ) నివేదిక ప్రకారం.. 92 శాతం మంది లబి్ధదారులు ఈ నగదును నేరుగా వ్యవసాయ పనులకు వినియోగించారు. 85 శాతం రైతులు తమ వ్యవసాయ ఆదాయం పెరిగిందని, ప్రైవేట్ అప్పులపై ఆధారపడటం తగ్గిందని చెప్పారు. పీఎం–కిసాన్ పథకం అమలుతో 2020–21 నుంచి 2025–26 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 9.65 శాతం, ఉత్పాదకత 10.53 శాతం మేర పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫలితంగా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 21.18 శాతం వృద్ధి నమోదైంది. చమురు అన్వేషణకు ‘సముద్ర మంథన్’ దేశీయంగా చమురు, సహజ వాయువుల అన్వేషణ, ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో జాతీయ ఆఫ్‌షోర్ అన్వేషణ పథకం ‘సముద్ర మంథన్’కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుకు రూ.84,084 కోట్లు కేటాయించారు. సముద్రగర్భ అన్వేషణల ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను వెలికితీయవచ్చని అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆఫ్‌షోర్ టెక్నాలజీ పెంపు, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుంది. దీర్ఘకాలిక ఇంధన భద్రత సాధన దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సౌర విద్యుత్‌కు ‘పీఎం సూర్య సరోవర్’ జలాశయాలపై తేలియాడే సౌర విద్యుత్ (ఫ్లోటింగ్ సోలార్ ఫొటోవోల్టాయిక్) ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ‘ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన(పీఎం–ఎస్ఎస్వై)’ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి రూ.5,070 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. 2026–27 నుంచి 2030–31 మధ్య ఈ ప్రాజెక్టులను మంజూరు చేస్తారు. 2032–33 వరకు ఆర్థిక సాయం కొనసాగిస్తారు. పూర్తయిన ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ.కోటి చొప్పున కేంద్ర ఆర్థిక సాయం(సీఎఫ్ఏ) కింద అందజేస్తారు. ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల అధ్యయనానికి గరిష్టంగా రూ.50 లక్షల వరకు అందజేస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఈ) అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా జలాశయాలపై 102.18 గిగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ప్రస్తుతం 700 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త ప్రాజెక్టుల వల్ల భూమి కొరత సమస్యను అధిగమించవచ్చు. ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గడంతోపాటు 16 వేల నుంచి 17 వేల వరకు పూర్తిస్థాయి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. -
ఇది హరిత విద్యుత్ శకం
సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణ హిత ఇంధన వనరుల (క్లీన్ ఎనర్జీ) వినియోగం దిశగా దేశం శరవేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే కాలంలో పూర్తిగా పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఆధారపడేలా కేంద్రం ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా శనివారం ’ఇంధన వనరుల పరిణామ క్రమం’పేరిట విడుదల చేసిన ప్రత్యేక నివేదికలో దేశ ఇంధన రంగ ముఖచిత్రాన్ని సమగ్రంగా వివరించింది.సౌరవిద్యుత్ వెలుగులుసౌర విద్యుత్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ’పీఎం సూర్య ఘర్’పథకం అద్భుత ఫలితాలు సాధిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 23.9 లక్షల ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏకంగా 7 గిగావాట్ల స్వచ్ఛమైన విద్యుత్ సామర్థ్యం అదనంగా సమకూరింది. ఈ పథకం వల్ల సామాన్యులకు కరెంటు బిల్లుల భారం తగ్గడంతో పాటు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోంది.పెట్టుబడుల వెల్లువక్లీన్ ఎనర్జీ రంగంలో వస్తున్న మార్పులతో దేశంలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. విద్యుత్ రంగంలో సరికొత్త సంస్కరణల కారణంగా సుమారు రూ. 8 లక్షల కోట్లకు పైగా భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ సఫలమైంది. పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు తగినట్లుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూనే, కాలుష్య రహిత ఇంధన రంగం వైపు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో ఈ పెట్టుబడులు కీలకంగా మారనున్నాయి.గ్రీన్ హైడ్రోజన్.. మిషన్ లైఫ్భవిష్యత్ ఇంధనంగా భావిస్తున్న గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటి పోర్ట్ ఆధారిత (ఓడరేవు) గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా ప్రారంభించింది. దీనితో పాటు నీతి ఆయోగ్, ఆర్థిక శాఖల సమన్వ యంతో ’మిషన్ లైఫ్’ద్వారా పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకునేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. విద్యుత్ పొదుపు, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి చర్యలతో వాతావరణ మార్పులను అడ్డుకోవచ్చని ఆ నివేదిక స్పష్టం చేసింది. మొత్తమ్మీద బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరుల నుంచి కాలుష్య రహిత హరిత ఇంధనం వైపు భారత్ చేస్తున్న ప్రయాణం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే దిశగా ఇది ఒక చారిత్రక ముందడుగుగా అభివర్ణించింది. -
PMSGMBY: పూచీకత్తు లేకుండా రూ.2 లక్షల లోన్
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన (PMSGMBY) కింద ఇప్పటికే 10 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అందించింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ సంఖ్యను 20 లక్షలకు పెంచాలనే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి మొత్తం కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.2024 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన.. ఈ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన కింద 10 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ 'ప్రహ్లాద్ జోషి' వెల్లడించారు.డాక్యుమెంట్స్ అవసరం లేకుండా రూ.2 లక్షల లోన్ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన పథకం కింద.. ఇళ్లలో సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తారు. దీనికోసం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.75 శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రూ. 2 లక్షల వరకు లోన్ అందిస్తాయి. ఇందులో రూ. 78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది.ఏడాదికి 6.75 శాతం వడ్డీ రేటుతో.. రూ. 6 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే రూ. 2 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. సోలార్ ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చులో 90 శాతం వరకు బ్యాంక్ ఫైనాన్సింగ్ సదుపాయం ఎంచుకోవచ్చు.ఎవరు అప్లై చేసుకోవచ్చు➤భారతీయ పౌరుడై ఉండాలి.➤సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి అనువైన పైకప్పు ఉన్న ఇంటిని కలిగి ఉండాలి.➤చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండాలి.➤ఇప్పటివరకు సౌర ఫలకాలను సంబంధించిన ఎలాంటి ఇతర సబ్సిడీలను పొంది ఉండకూడదు.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్.. వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!ఎలా అప్లై చేసుకోవాలి?➤అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, అక్కడే కనిపిస్తున్న కన్స్యూమర్ ట్యాబ్‌కి వెళ్లి, అందులో 'అప్లై నౌ' ఎంచుకోండి.➤లాగిన్ డ్రాప్‌డౌన్ మెనుని ఓపెన్ చేసి కూడా కన్స్యూమర్ లాగిన్ ఎంచుకోవచ్చు.➤మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయి.. ద్రువీకరించండి. పేరు, రాష్ట్రం మరియు ఇతర వివరాలను అందించండి. ➤మీ ఈమెయిల్ ఐడీని ధ్రువీకరించిన తరువాత.. మీ ప్రొఫైల్‌ను సేవ్ చేయండి. ➤విక్రేత కోసం, మీ అవసరాన్ని బట్టి అవును లేదా కాదు సెలక్ట్ చేసుకోండి.➤'సోలార్ రూఫ్‌టాప్ కోసం అప్లై చేసుకోండి'పై క్లిక్ చేసి.. రాష్ట్రం, జిల్లా డిస్కామ్ వంటి ఇతర వివరాలను అందించండి.➤అన్ని పూర్తి చేసిన తరువాత విక్రేతను ఎంపిక చేసుకుని మీ బ్యాంక్ వివరాలను అందించండి.➤మీ సబ్సిడీ మంజూరైన తర్వాత సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.


