breaking news
Pindiprolu
-
సంక్రాంతి ఘుమ ఘుమలు
నేతి అరిసెలు.. కొబ్బరి బూరెలు.. కజ్జికాయలు.. కరకరలాడే చక్రాలు.. చక్కలు, బూందీ లడ్డూలు, బెల్లం గవ్వలు.. ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే పిండి వంటకాలెన్నో.. ఎన్నోన్నో.. తెలుగునాట పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతి వేడుకల్లో పిండి వంటలది ప్రథమ స్థానం. అందులోనూ అరిసెలది అందెవేసిన చెయ్యి. సంక్రాంతికి సమ్‌థింగ్ స్పెషల్ వంటకమూ ఇదే.. తెలుగింటి ముంగిట మరో 24 గంటల్లో సంక్రాంతి సందడి ప్రారంభం కానుండడంతో పల్లెల్లో ఎక్కడ చూసినా పిండివంటల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. నేతి అరిసెల సువాసనలు వీధులను చుట్టేస్తున్నాయి. గ్రామాలలో చుట్టుపక్కల నివాసాల వారు, బంధుమిత్రులంతా ఒక చోటకు చేరి కలిసికట్టుగా సంక్రాంతి వంటకాల తయారీలో నిమగ్నమై కనిపిస్తున్నారు. -
పిండిప్రోలు లో రాయల అంత్యక్రియలు
తిరుమలాయపాలెం: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్(రవన్న) అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో గురువారం జరిగారుు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో నేతలు, ప్రజల సందర్శనార్థం సుభాష్‌చంద్రబోస్ మృతదేహాన్ని ఉంచిన నాయకులు సాయంత్రం పిండిప్రోలుకు తీసుకొచ్చారు. చిన్నతనంలోనే అజ్ఞాతంలోకి వెళ్లిన బోస్‌ని కడసారి చూసేందుకు పలు గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానాలు భారీగా తరలివచ్చారు. అంత్యక్రియల్లో సీపీఐ ఎంఎల్ కేంద్ర కమిటీ కార్యదర్శి డాక్టర్ యతీంద్రకుమార్ , కేంద్రకమిటీ సభ్యులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ ఆకస్మిక మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, ఆపార్టీ నేతలు డాక్టర్ కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, న్యూడెమోక్రసీ నేతలు చంద్రన్న, సాది నేని వెంకటేశ్వరరావు, కె.గోవర్దన్ సంతాపం తెలిపారు. రాయల మృతిపట్ల బీసీ సంక్షేమ సంఘంనేతలు కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ సంతాపం తెలిపారు.


