breaking news
photografy
-
చిత్ర యాత్ర
తల్లిగా, చెల్లిగా, కూతురుగా... పలు రూ పాల్లో లోకాన్ని ముందుకు నడిపించే శక్తి స్త్రీ మూర్తి. ఆ శక్తి స్వరూ పాన్ని తన ఛాయాచిత్రాల్లో ఆవిష్కరించడానికి పన్నేండేళ్ల కాలాన్ని అంకితం చేస్తూ ప్రపంచ యాత్ర చేస్తున్నారు భరద్వాజ్ దయాల. 195 దేశాలకు చెందిన మహిళల ముఖకవళికల చిత్రాలను సేకరించాలనేది ఆయన లక్ష్యం....సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించిన భరద్వాజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో మూవీ గ్రాఫిక్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ‘జీవితం చాలా చిన్నది. ఉన్న సమయంలోనే ప్రపంచాన్ని చూసెయ్యాలి. వీలైనంత మందితో మాట్లాడాలి’ అనేది భరద్వాజ్ లక్ష్యం. ఇందులో భాగంగా మహిళామణుల చిత్రాల ఆల్బమ్ రూపకల్పనకు సంకల్పించారు. ఈ డాక్యుమెంటరీలో మిలియ న్ అమేజింగ్ ఉమె న్ (10లక్షల మంది అసాధారణ మహిళలు)కు చోటు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాలకు చెందిన మహిళల ముఖకవళికల చిత్రాలను సేకరించే పనికి శ్రీకారం చుట్టారు.ఒంటరిగా... కెమెరా ఆయుధంగాప్రపంచంలోని మిలియ న్ (10లక్షల) మహిళామణుల ముఖకవళికలపై డాక్యుమెంటరీ తీయడానికి భరద్వాజ్ 100 మిల్లీమీటర్లు, 2.8 లెన్స్ గల కెమెరాను భుజాన వేసుకొని లక్ష్యం దిశగా ముందుకు కదులుతున్నారు. 55 ఏళ్ల భరద్వాజ ఒంటరిగానే, ఎవరి సాయం లేకుండా ప్రపంచయాత్ర చేస్తున్నారు. ఒక కారును తన ప్రయాణానికి అనుగుణంగా మార్చుకున్నారు. ఏడు ఖండాలు తిరిగి. 12 ఏళ్లలోగా అంటే 2037 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనేది తన లక్ష్యం.మహిళా దినోత్సవం రోజు శ్రీకారంప్రస్తుతం భరద్వాజ్ చేపడుతున్న మిలియన్ అమేజింగ్ మహిళ చిత్రసేకరణ ప్రాజెక్టు యాత్ర రెండోది. దీన్ని ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభించారు. మిలియన్ అమేజింగ్ మహిళా ఫొటోల సేకరణలో గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 500 మంది మహిళల చిత్రాలను కెమెరాల్లో బంధించారు. ఆల్బమ్‌లో 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మహిళల వరకు ఉన్నారు.రాజమాతతో ప్రారంభం...గుజరాత్ రాష్ట్రం వడోదరలోని రాజవంశానికి చెందిన రాజమాత శుభాంగిణిరాజే చిత్రంతో ఈ మిలియ న్ అమేజింగ్ ఉమె న్ ప్రాజెక్టు ప్రారంభమైంది. రాజమాత జీవితానికి సంబంధించి బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా చిత్రాన్ని తీశారు. రెస్టారెంట్ నడుపుతూ, నెలకు 8 లక్షల రూ పాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న గిరిజన మహిళతో పాటు పారిశుద్ధ్య కార్మికులు, గృహిణులు, విద్యార్థినులకు చోటు కల్పించారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల్లో భరద్వాజ్ పర్యటన సాగుతోంది.అమ్మకు ప్రేమతో...మా అమ్మకు ఐదుగురు సంతానం. మా అందరినీ పెంచి పెద్ద చేయడంలో ఆమె చూపిన కృషి అనిర్వచనీయం. అందుకే అమ్మకు ప్రేమతో ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ఆ ఆలోచనలో భాగమే మిలియ న్ అమేజింగ్ ఉమె న్ ఆల్బమ్. ప్రస్తుతం నా ప్రయాణానికి అవసరమయ్యే ఖర్చునంతా నేనే భరిస్తున్నాను. నా కంపెనీ తరపున ఆ న్ లై న్ లో జాబ్ చేస్తూ వచ్చిన వేతనంతో టూర్‌ను కొనసాగిస్తున్నాను. – భరద్వాజ్ దయాల – కరుకోల తిరుమలరావు, సాక్షి, విజయవాడ -
నేటి నుంచి ఆర్ట్–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్..
గచ్చిబౌలి: మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మూడు రోజులపాటు ఆర్ట్–ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 50 మంది ప్రముఖ ఫొటోగ్రాఫర్లు రూపొందించిన ఫొటోలను ప్రదర్శిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఆదివారం వరకూ ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, కార్యదర్శి శృతిఓజా, సాంస్కృతిక, భాషాశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రారంభిస్తారు. ఇంటరీ్మడియట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ కంట్రోలర్, ఆర్జేడీ బి జయప్రదబాయి, ఎస్ఐవీఈ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ జ్యోష్ణారాణి పాల్గొంటారు. 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. -
బర్డ్స్ ఫొటోగ్రఫీ అంత తేలిక కాదు..
పదవీ విరమణ చేసిన తర్వాత చాలా మంది ఉద్యోగిణులు ఇంట్లో టీవీ సీరియళ్లు చూస్తూనో.. కిట్టీ పార్టీల్లో కాలక్షేపం చేస్తూనో.. చుట్టుపక్కల వాళ్లతో సరదాగా షాపింగ్ చేస్తూనో గడుపుతుంటారు. అయితే.. డాక్టర్ వీ.ఏ.మంగ మాత్రం పదవీ విరమణ అనంతరం తన అభిరుచికి పదును పెట్టుకున్నారు. తనకున్న అలవాటును సద్వినియోగం చేసుకునే దిశగా చాలా ఓర్పుతోఫొటోగ్రఫీ నేర్చుకోవడమే కాదు.. అందమైన పక్షుల చిత్రాలు కూడా తీసి శెభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్‌లోని ఏఎస్‌రావునగర్‌లో నివసించే వీ.ఏ.మంగ నారాయణగూడలోని భవన్స్ న్యూసైన్స్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ప్రకృతి అంటే ఎంతో ఇష్టంగా భావించే మంగ ఆ ప్రకృతిలోని రమణీయమైన పక్షులను ఫొటోలు తీయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన బృహత్తర కార్యక్రమం విజయవంతంగా ముగించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయని, అవి కొండ ప్రాంతాల్లో, చెరువుల వద్ద, అడవులు, పార్కుల్లో ఉన్నాయని తెలుసుకున్న మంగ వాటి ఫొటోలు తీసేందుకు నడుం బిగించారు. ఐదేళ్ల పాటు శ్రమించిన ఆమె 500 పక్షుల చిత్రాలను తీశారు. అందులో 266 రకాల పక్షులున్నాయి. కేవలం ఫొటోలు తీసి గాలికి వదిలేయలేదు. వాటి పూర్తి వివరాలను అందంగా మల్టీకలర్లో రూపొందించిన ‘బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్’ గ్రంథాన్ని తీసుకొచ్చారు. ఇందుకోసం ఆమెపడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఒక లెక్చరర్‌గా ఉండి హైదరాబాద్‌లో ఇన్ని రకాల పక్షులు ఉన్నాయని తెలియజేసిన ప్రయత్నం అద్భుతంగా ఉందని ఐపీఎస్ అధికారిణి తేజ్‌దీప్‌కౌర్ ఆమెను ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా అభినందించారు. ఈ పక్షుల వివరాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఇటీవల ఆమె ప్రారంభించారు. పక్షులకు సంబంధించిన పుస్తకాలు చాలా వచ్చినప్పటికీ మంగ ప్రచురించిన గ్రంథం చాలా ప్రత్యేకంగా, వివరణాత్మకంగా ఉందని, చాలా కొత్త విషయాలు విపులీకరించారంటూ ప్రకృతి ప్రేమికులు ప్రశంసించారు. వీ.ఏ.మంగ తీసిన పక్షుల ఫొటోలతో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన.. బర్డ్స్ ఫొటోగ్రఫీ అంత తేలిక కాదు.. తాను సరదాగా ఫొటోలు తీయడం ఆరంభించి, ఆసక్తితో సీరియస్ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయి ఐదేళ్లు కష్టపడి తీసిన చిత్రాలతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినట్లు మంగ తెలిపారు. వేలాది ఫొటోలు తీసినప్పటికీ అందులోంచి 500 చిత్రాలను ఎంపిక చేశామని, వీటిలో ఉన్న మరో 226 పక్షులను డాక్యుమెంట్ చేయడం జరిగిందన్నారు. ఫొటోగ్రఫీ అంటే తనకెంతో ఇష్టమని, పక్షులంటే ప్రాణమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం తనకు లభించిన పూర్తి కాలాన్ని సిటీలో ఉన్న పక్షులను చూడటం, కెమెరాల్లో బంధించడం చేస్తూ వచ్చానన్నారు. వన్ ట్రీ మెనీ బర్డ్స్ పేరిట తొలుత కాఫీ టేబుల్ బుక్‌ను విడుదల చేశారు. ఆ పుస్తకానికి లభించిన విశేష స్పందనతో ఇప్పుడు రెండో గ్రంథం బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ పుస్తకాన్ని తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో పక్షులకు కొదవ లేదని, మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడే పక్షులు ఎక్కువగా ఉన్నాయన్నారు. బర్డ్స్ ఫొటోగ్రఫీ అంత ఈజీ కాదని మామూలు కెమెరాలు ఇందుకు సరిపోవని, లాంగ్ లెన్స్ ఉన్న కెమెరాలు తీసుకొని ప్రతిరోజూ కొండకోనలు, చెరువులు, అడవుల్లో తిరగేదానినని ఆమె వెల్లడించారు. ప్రతిరోజూ 800 నుంచి వెయ్యి వరకు ఫొటోలు తీసినా అందులో అరుదైన ఫొటోలు ఎంపిక చేసుకొని ఎప్పటికప్పుడు కంప్యూటర్లో అప్లోడ్ చేసుకునేదానినని వెల్లడించారు. బర్డ్స్ ఫొటోగ్రఫీ చేయాలంటే ముందుగా బర్డ్స్ వాచ్ ముఖ్యమని, చాలా మంది 20 ఏళ్లు కష్టపడి ఈ ఫొటోలను తీసేవారని, అది కూడా ముగ్గురు, నలుగురు కలిసి తీసేవారని, తాను మాత్రం ఒక్కదాన్నే ఈ ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. -
16లెన్స్‌ల ఫోన్‌ను తయారుచేస్తోన్న ఎల్జీ
భారతీయ మార్కెట్లోకి తిరిగి అడుగు పెట్టిన నోకియా బడ్జట్ స్థాయి నుంచి హైఎండ్ వరకు మొబైల్ విడుదల చేసింది. నోకియా 9 ప్యూర్‌వ్యూను ఐదు రియర్ కెమెరాలతో త్వరలోనే రిలీజ్ చేయనుంది. కొద్ది రోజుల క్రితం శాంసంగ్ నాలుగు వెనుక కెమెరాలతో గెలక్సీ ఎ9 ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఈ మధ్య కెమెరాలను శక్తివంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎల్జీ 16 లెన్స్‌లతో ఫోల్డబుల్ ఫోన్ తయారు చేస్తున్నట్లు లెట్స్‌గో డిజిటల్ అనే డచ్ వెబ్సైట్ తెలిపింది. మాట్రిక్ ఫార్మాట్లో లెన్స్‌ను అమరుస్తున్న ఈ ఫీచర్‌పై ఎల్జీ పేటెంట్ రైట్స్ తీసుకుంది. ఈ ఫోన్లో ఏర్పాటు చేసిన అన్నీ లెన్స్‌ల నుంచి ఫోటో తీసి, అందులో నిర్ణీత లెన్స్ ద్వారా కాప్చర్ చేసిన పోటోలోని భాగాలను అవసరం లేదనుకుంటే తొలగించే ఆప్షన్‌ను ఇందులో ప్రవేశపెట్టనున్నారు. ఈ లెన్స్‌ల ద్వారా తీసే ఫోటోలోని భాగాన్ని మరో ఫోటొతో మెర్జ్ చేసే ఫీచర్ కూడా సాధ్యమవుతుందని ఆ వెబ్సైట్ వెల్లడించింది. మొబైల్ వెనుక వైపున టచ్‌పాడ్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఫోటోగ్రాఫర్లకు అవసరమయ్యే స్థాయి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఇది మాత్రమేగాక ఫోన్ బ్యాక్పానెల్లో స్పీకర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. -
గత స్మృతులకు సజీవ సాక్ష్యం ఫొటోగ్రఫీ
ముకరంపుర: గత స్మృతులకు సజీవ సాక్ష్యంగా ఫొటోగ్రఫీ నిలుస్తుందని జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ నాగేంద్ర అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా జిల్లా ప్రెస్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో శనివారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఫొటోగ్రఫీకి కాలాన్ని స్తంభింపజేసే శక్తి ఉందని, ఈ కళను బతికించుకోవాలని అన్నారు. విశిష్ట అతిథి నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ... ప్రెస్ ఫొటోగ్రఫీకి సమాజాన్ని మార్చే శక్తి ఉందన్నారు. ఒక వార్త చెప్పే సందేశం కంటే ఒక ఫొటో ఎన్నో రెట్ల భావాన్ని చెపుతుందన్నారు. ఫొటోగ్రఫీని చేతివృత్తిగా గుర్తించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పత్రికల ఫొటోగ్రఫర్లు తీసిన ఫొటోలు సమాజాన్ని కదిలించాయన్నారు. అనంతరం ఫొటోగ్రఫీ డే సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ అవార్డులను ప్రదానం చేశారు. ప్రకృతి విభాగంలో ప్రథమ బహుమతి వూరడి మల్లికార్జున్ (సిరిసిల్ల సాక్షి రిపోర్టర్), తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాల విభాగంలో ప్రథమ బహుమతి బొమ్మెన కుమార్ (గొల్లపల్లి సాక్షి రిపోర్టర్), వార్తా కథనం విభాగంలో తృతీయ బహుమతి జవ్వాజి చంద్రశేఖర్ (మల్యాల సాక్షి రిపోర్టర్) బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో ఫ్రెస్ఫొటోగ్రఫీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏలేటి శైలేందర్‌రెడ్డి, డీపీఆర్వో ప్రసాద్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు తాడూరి కరుణాకర్, కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు జనార్దన్, సతీష్, నరేష్ పాల్గొన్నారు.