breaking news
Petrol subsidy
-
పెట్రోల్‌కు డబ్బులు.. పాకిస్థాన్‌లో సబ్సిడీ పథకం
చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు తీవ్ర భారంగా మారాయి. దాయాది దేశం పాకిస్థాన్‌లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. దీంతో ఆ దేశ ప్రభుత్వం సామాన్య వాహనదారులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని అమలు చేస్తోంది.ఇంధన ధరల పెరుగుదలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు ఊరట కల్పించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక పెట్రోల్ సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రారంభించిన ఈ ప్రధానమంత్రి స్పెషల్ ఫ్యూయల్ రిలీఫ్ స్కీమ్ కింద మోటార్‌సైకిళ్లు, ఆటో రిక్షాలు, చింగ్చీ (Qingqi) వాహనాలతో పాటు 800 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న చిన్న కార్లకు రాయితీ అందుతోంది. ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయంగా ఇంధన ధరలు భారమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.తాజా మార్పుల ప్రకారం మోటార్‌సైకిల్, ఆటో రిక్షా, చింగ్చీ వినియోగదారులకు వారానికి రూ.500 (పాకిస్థాన్ రూపాయలు) చొప్పున, నెలకు నాలుగు టోకెన్ల ద్వారా గరిష్ఠంగా రూ.2,000 వరకు ఇంధన ఉపశమనం లభిస్తుంది. తొలుత అమలు చేసిన 5 లీటర్ల కనీస పెట్రోల్ కొనుగోలు నిబంధనను ప్రభుత్వం తొలగించింది. అంటే తక్కువ పరిమాణంలో పెట్రోల్ కొనుగోలు చేసినా అర్హత ఉన్న వినియోగదారుడికి రూ.500 రాయితీ వర్తిస్తుంది. ఈ మార్పు ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా తీసుకున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.800 సీసీ వరకు చిన్న కార్లకు మాత్రం వేరే విధానం కొనసాగుతోంది. ప్రతి పది రోజులకు 10 లీటర్ల పెట్రోల్‌పై లీటరుకు రూ.100 చొప్పున రాయితీ లభిస్తుంది. అంటే ఒక్క టోకెన్‌కు గరిష్ఠంగా రూ.1,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ప్రభుత్వం తొలుత ప్రకటించిన విధానంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నెలకు 20 లీటర్లు, 800 సీసీ వరకు కార్లకు నెలకు 30 లీటర్ల వరకు రూ.100 చొప్పున రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. అనంతరం వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విధానంలో మార్పులు చేసింది.20 ఏళ్ల వాహనాలకూ అర్హతసబ్సిడీ పరిధిని ప్రభుత్వం మరింత విస్తరించింది. తొలుత పాత వాహనాలపై ఉన్న పరిమితిని సడలిస్తూ 2006 జనవరి 1 లేదా ఆ తర్వాత రిజిస్టర్ అయిన మోటార్‌సైకిళ్లు, రిక్షాలు, చింగ్చీ వాహనాలను కూడా పథకంలోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా మోటార్‌సైకిల్, రిక్షా వినియోగదారులకు తప్పనిసరిగా వాహనం తమ పేరుమీదే ఉండాలన్న నిబంధనను కూడా తొలగించినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో అద్దె వాహనాలను ఉపయోగించే అర్హులకూ ప్రయోజనం అందే అవకాశం ఏర్పడింది.అర్హత కలిగిన వారు 9771 నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల జాతీయ గుర్తింపు కార్డు, వారి పేరుతో ఉన్న సిమ్, వాహన రిజిస్ట్రేషన్ వివరాలను డిజిటల్ వ్యవస్థ ద్వారా తనిఖీ చేస్తున్నారు. నకిలీ దరఖాస్తులు, ఒకే వ్యక్తి పేరుతో బహుళ క్లెయిమ్‌లను అడ్డుకోవడమే దీని ఉద్దేశం.ఇప్పటికే 60 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లుపథకం అమలులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే భారీ స్పందన వచ్చింది. సెప్టెంబర్ 25 నాటికి 58 లక్షలకు పైగా ప్రజలు నమోదు చేసుకోగా, సుమారు 61 లక్షల టోకెన్లు జారీ అయ్యాయి. 47 లక్షల మంది ఇప్పటికే ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. అనంతరం సెప్టెంబర్ 27 నాటికి రిజిస్ట్రేషన్లు 60 లక్షలు దాటినట్లు పెట్రోలియం శాఖ మంత్రి తెలిపారు.ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లో అక్టోబర్ ప్రారంభంలో పెట్రోల్ ధరలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ఆధారంగా అక్టోబర్ 1 నుంచి పెట్రోల్ ధర లీటరుకు రూ.387.40గా నిర్ణయించారు. అయితే అక్టోబర్ 6 నుంచి మరోసారి లీటరుకు రూ.0.88 పెంచినట్లు తాజా సమాచారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇంధన ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ పథకం సామాన్య వాహనదారులకు కీలక ఉపశమనంగా మారింది. -
పెట్రోలు రూ.40కి రాదేం..?
అంతర్జాతీయంగా ఏడాదిలో 40 శాతం తగ్గిన చమురు ధర ► అదే రీతిలో ఇక్కడా తగ్గిస్తే లీటరు రూ.40 ► ప్రస్తుత ధర రూ.65; తగ్గింది 0.5-2 శాతమేతగ్గిన ప్రయోజనమంతా రిఫైనరీలు; ప్రభుత్వాల జేబుల్లోకే అంతర్జాతీయంగా మరింత పతనం ► ప్రస్తుతం 36 డాలర్ల దిగువకు... 2010లో పెట్రోల్‌పై సబ్సిడీని ఎత్తివేసిన కేంద్రం... 2014లో సరిగ్గా సమయం చూసి నొప్పి తెలియని మరో దెబ్బ కొట్టింది. నిజానికి డీజిల్ ధర పెరిగితే దేశంలో తీవ్రమైన ఆందోళన రేగేది. ఎందుకంటే దాని ప్రభావం రవాణాపై ఉంటుంది కనక... ఫలితంగా నిత్యావసరాలతో సహా అన్నీ పెరుగుతాయి. కాకపోతే 2014లో అంతర్జాతీయంగా చమురు ధర తగ్గుతున్నపుడు... కేంద్రం ఠక్కున సబ్సిడీని ఎత్తేసింది. మన మార్కెట్ ధరల్ని అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా వదిలేసింది. కాకపోతే అప్పుడు ధరలు తగ్గుతున్న తరుణం కనక కేంద్రం చర్యతో డీజిల్‌పై అర్ధరూపాయి నుంచి రూపాయి మధ్య ధర తగ్గింది తప్ప పెరగలేదు. దీంతో జనం కూడా ధర పెరగలేదు కదా!! అని ఊరుకున్నారు. ప్రభుత్వం అదృష్టం బాగుంది. డీజిల్‌పై సబ్సిడీ తొలగించిన నాటి నుంచీ అంతర్జాతీయంగా దాని ధర తగ్గుతున్నదే తప్ప ఎన్నడూ పెరగలేదు. కానీ మార్కెట్లో ధర మాత్రం ఆ స్థాయిలో తగ్గటం లేదు. అదీ విచిత్రం. ఇదీ... ధరల తీరు ఉదాహరణకు 2014 డిసెంబర్ తొలి పక్షంలో ఇండియన్ బాస్కెట్ క్రూడ్ సగటు ధర బ్యారెల్‌కు రూ.4,558. (డాలర్లలో 67.24. అప్పట్లో మారకపు విలువ రూ. 63.34). మళ్లీ ఈ సంవత్సరం నవంబర్ రెండో పక్షం వచ్చేసరికి ఇండియన్ బాస్కెట్ క్రూడ్ బ్యారెల్ సగటు ధర ఏకంగా రూ.2,725కు పడిపోయింది. (డాలర్లలో 41.17, మారకపు విలువ రూ.66.21). ఈ సగటు ధరను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 1న కేంద్రం స్వల్పంగా పెట్రోల్ ధరను తగ్గించిన సంగతి తెలిసిందే. కేంద్ర పెట్రోలియం శాఖ తన వెబ్సైట్లో ప్రకటించిన ఈ అంతర్జాతీయ క్రూడ్ దిగుమతి ధర ప్రకారం... ఏడాది కాలంలో చమురు ధర 40 శాతం పడిపోయింది. కానీ ఢిల్లీ పెట్రోల్ బంకుల్లో మాత్రం లీటరు ధర 4 శాతం లోపే తగ్గింది. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలోనైతే తగ్గింది 2 శాతంలోపే. ఆంధ్రప్రదేశ్‌లో మరీ ఘోరం. ఇక్కడ తగ్గింది కేవలం అరశాతం. ఇలా... క్రూడ్ ధర తగ్గుదల ప్రయోజనంలో కొంత పెట్రో రిఫైనరీలు తీసేసుకుంటుంటే, అగ్రభాగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయి. నిజానికి అంతర్జాతీయంగా మన ధర 40 శాతం తగ్గింది కనక... అది నేరుగా వినియోగదారుకు బదలాయిస్తే బంకుల్లో లీటరు పెట్రోలు దాదాపు 40 రూపాయలకు విక్రయించాలి. కానీ రూ.65కు విక్రయిస్తూ ఆ ప్రయోజనాన్ని ప్రభుత్వాలే లాక్కుంటున్నాయి. పదేళ్లలో ఇదే కనిష్ఠ ధర!! ఇండియా దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ధర తాజాగా పదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంటే 2004లో ఉన్నప్పటి ధరతో సమానమయింది. అయితే బంకుల్లో 2004లో లీటరు పెట్రోల్ రూ.40కి దొరికేది. కానీ ఇపుడు రూ.65 వరకూ ఉంది. అంటే రిటైల్ ధర 60 శాతానికన్నా ఎక్కువ పెరిగిందన్న మాట. ఈ పదేళ్లలో రూపాయి మారకపు విలువ క్షీణించడం, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఎత్తేయడం ఈ ధరలు పెరగటానికి కొంత కారణం కాగా... విపరీతంగా పన్నులు పెంచేయడం మరో ప్రధాన కారణం. దీనికితోడు రిఫైనరీలకు కూడా మార్జిన్లు భారీగా పెరిగాయి. 2014లో ఒక బ్యారల్ క్రూడ్‌ను శుద్ధి చేస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 6 డాలర్లు లాభం వచ్చేది. అది 2015లో 10 డాలర్లకు పెరిగి పోయింది. అంటే... తగ్గిన క్రూడ్ ధరలో 4 డాలర్ల వరకూ ఈ రిఫైనరీల ఖాతాల్లోకి పోతోందన్న మాట. దీనర్థం... మొత్తం ధర 40% వరకూ తగ్గితే అందులో 10% వరకూ రిఫైనరీల జేబుల్లోకి పోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మరింత వాత... రాష్ట్రాలు కూడా తక్కువ తినలేదు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలు రెండూ ఈ ఏడాది పెట్రోల్, డీజిల్‌పై అమ్మకపు పన్నును రెండు దఫాలు పెంచేశాయి. గతేడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటా పెట్రోల్, డీజిల్‌పై 31% పన్ను వుండేది. ఆ మధ్య రెండు రాష్ట్రాలు లీటరుపై రూ.2 చొప్పున అదనంగా వ్యాట్‌ను వడ్డించాయి. తర్వాత నెలల్లో తెలంగాణ ప్రభుత్వం రూ. 2ను తొలగించి 31% పన్నునే 35.20 శాతానికి పెంచింది. ఏపీ ప్రభుత్వం మాత్రం మరో రూ.2 కలిపి మొత్తం రూ.4 అదనపు వ్యాట్‌ను వడ్డిస్తోంది. దీంతో వ్యాట్ రూపంలో ప్రస్తుత ధరపై తెలంగాణ ప్రభుత్వం రూ.17.09 వసూలుచేస్తుండగా, ఏపీ ప్రభుత్వం రూ.19.05 (31%+రూ.4) పిండుకొంటోంది. అందుకే గత 12 నెలల్లో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 67.02 నుంచి రూ. 65.61కి తగ్గగా, విజయవాడలో మాత్రం ఇది రూ. 66.68గా ఉంది. ఏడాది కిందట హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.67.02. ఇప్పుడు రూ.65.65 హమ్మయ్య! ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నపుడు ఇది కాస్తయినా తగ్గింది కదా అని సంతోషించాలా? అలాకాకుండా దాదాపు రూ.40 వద్ద విక్రయించాల్సిన పెట్రోలును రూ.65 అమ్ముతున్నారని బాధపడాలా? తగ్గించాల్సినంత తగ్గించకుండా ప్రభుత్వాలన్నీ కలిసి మనల్ని దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేయాలా? బాధపడాల్సిందే. ఆవేదన వ్యక్తం చేయాల్సిందే. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతూ వచ్చినపుడు ఆ భారాన్ని నేరుగా మనపైనే వేసిన ప్రభుత్వాలు... రేపు మళ్లీ ధరలు పెరిగితే ఈ రేట్లను మరింత పెంచవనే గ్యారంటీ ఏమీ లేదు. పెపైచ్చు ఇపుడక్కడ దారుణంగా పతనమవుతున్నా ఆ తగ్గింపును మనకు బదలా యించటం లేదు. పన్నులు పెంచి తమ ఖజానా నింపుకొంటున్నాయి. ఈ దోపిడీని వివరించే ప్రత్యేక కథనం... కేంద్రం అదనపు బాదుడు రూ. 7 మార్కెట్‌తో ధరల్ని లింకు చేస్తున్నామంటూ గొప్పలుపోయిన ప్రభుత్వం పెట్రోల్ ధరను తగ్గించాల్సిన పలు సందర్భాల్లో ఎక్సయిజ్ సుంకాన్ని పెంచేసింది. కేంద్రం ఎక్సయిజు సుంకం, సెస్‌లతో కలిపి గత నవంబర్‌లో లీటరు పెట్రోల్‌కు రూ.11.02 వసూలు చేయగా, ఇప్పుడది ఏకంగా రూ.19.06కు చేరింది. ఇంత వేగంగా పెట్రో సుంకాల్ని గతంలో ఏ ప్రభుత్వమూ పెంచలేదు. ఈ పెంపుతో డీలరు ధరపై కేంద్ర ఎక్సయిజు సుంకం, సెస్‌లు కలిపి 70%కి చేరాయి. 2004లో కేంద్ర ఎక్సయిజు సుంకం 23 శాతమే.


