breaking news
petbasheerabad police
-
పోలీస్ అంటూ.. మహిళా హాస్టల్‌కు వెళ్లి..
హైదరాబాద్: పోలీస్ అవతారమెత్తి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పేట్‌బష్‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పేట్‌బష్‌రాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏసీపీ శంకర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లాకు చెందిన పాండి యాదగిరి అలియాస్ అనీల్‌కుమార్ (25) సిద్దిపేట జిల్లా బండమైలారం గ్రామంలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. గతంలో మహంకాళి ట్రాఫిక్ పోలీసు విభాగంలో క్యాజువల్ లేబర్‌గా పనిచేసిన సమయంలో పోలీసుల పనితీరుపై అవగాహన ఏర్పడింది. డబ్బు సంపాదించాలనే ఆశతో అతను పోలీసు యూనిఫామ్, మోటార్ సైకిల్‌ను కొనుగోలు చేసి, పోలీసు అధికారిగా నటిస్తూ తిరగడం ప్రారంభించాడు. దుండిగల్‌లోని ఓ బాలికల హాస్టల్‌ను లక్ష్యంగా చేసుకుని వసూళ్లకు పాల్పడ్డాడు. పేట్‌బష్‌రాబాద్–మేడ్చల్ హైవేపై ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా నటిస్తూ వాహనదారుల నుండి డబ్బు వసూలు చేశాడు. సుచిత్రలోని మోనిడాశ్రీ గరŠల్స్ హాస్టల్‌కు వచి్చన యాదగిరి రాత్రి హాస్టల్లో కార్యకలాపాలు నిలిపివేయాలని యజమాన్యాన్ని బెదిరించాడు. ఈ నెల 29న రాత్రి మరోసారి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. అమ్మాయిలపై ప్రాసిస్ట్యూషన్ కేసులు నమోదు చేస్తానని, వారి మొబైల్ ఫోన్లు లాక్కొని ఫొటోలు తీసి బెదిరించాడు. దీంతో హాస్టల్ నిర్వాహకుడు గుడూరు విజయ్‌కుమార్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పేట్‌బïÙరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. -
తొమ్మిది మంది విద్యార్థులపై ర్యాగింగ్ కేసు
హైదరాబాద్: తొమ్మిది మంది విద్యార్థులపై పేట్ బషీరాబాద్ పోలీసులు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు. వీరిలో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. కొంపల్లి సినీప్లానెట్ సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని చొక్కా గుండి పెట్టుకోలేదని ఈ నెల 26న సీనియర్ విద్యార్థులు తొమ్మిదిమంది ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అదే రోజు రాత్రి 12 సమయంలో ఎదురు తిరిగిన జూనియర్ విద్యార్థిపై వారు దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరిపి తొమ్మిది మంది విద్యార్థులపై ర్యాగింగ్ కేసు నమోదు చేశారు. వీరిలో ఏడుగురిని ఆదివారం అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.


